OMG 2 Collections ఓ మై గాడ్ 2 మూవీకి ఆ హీరో దెబ్బ.. అక్షయ్ కుమార్ మూవీకి ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన తాజా చిత్రం ఓ మై గాడ్ 2 (OMG 2). హిందీలో 2012 సంవత్సరంలో వచ్చిన ఓ మై గాడ్ సినిమాకు ఈ సీక్వెల్. ఈ చిత్రానికి అమిత్ రాయ్ దర్శకత్వం వహించగా అరుణ భాటియా, విపుల్ డీ షా నిర్మించారు. ఓ మై గాడ్ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో ఈ సీక్వెల్‌పై అందరి ఆసక్తి పెరిగింది. ఈ సినిమా రిలీజ్‌ను అడ్డుకోవడానికి కొన్ని వర్గాలు ప్రయత్నించడంతో వివాదం నెలకొనడంతో మరింత ఆసక్తి పెరిగింది. ఈ సినిమాకు సంబంధించిన బడ్జెట్, కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

ఓ మై గాడ్ 2 (OMG 2) చిత్రం కథ విషయానికి వస్తే. క్రాంతి శరన్ ముగ్దల్ (పంకజ్ త్రిపాఠి) శివుడి (అక్షయ్ కుమార్) పరమభక్తుడు. మంచి భర్త, తండ్రి. నీతి, నిజాయితీ, నైతిక విలువలు పాటించే క్రాంతి శరన్ కుమారుడిని అసభ్య ప్రవర్తన కారణంగా స్కూల్ నుంచి బయటకు పంపిస్తారు.

Akshay Kumars OMG 2 Movie day 1 official Collections worldwide

అయితే తప్పుడు సమాచారం, ఆరోపణల కారణంగా తన కుమారుడు బలైపోయాడని తెలుసుకొంటాడు. అయితే తన కొడుకుపై మోపిన నిందపై వాస్తవం తెలియాలంటే భగవంతుడు శివుడు ప్రత్యక్షమై తేల్చాసిందే అంటూ ఊరు, ఫ్యామిలి వదిలి వెళ్లిపోతాడు. అంతే కాకుండా కొడుకుపై అసత్య ఆరోపణలు చేసి వారిని కోర్టుకు లాగుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఓ మై గాడ్ 2 (OMG 2) కథ.

ఓ మై గాడ్ 2 (OMG 2) సినిమా కంటెంట్ ప్రధానంగా సాగే సినిమా. సెక్స్ ఎడ్యుకేషన్ గురించి విపులంగా చర్చించే సినిమా. ఫస్టాఫ్‌ను దర్శకుడు బాగా డీల్ చేశాడని, సెకండాఫ్‌లో బోధనలు ఎక్కువయ్యాయనే విషయాన్ని క్రిటిక్స్ వెల్లడించారు. ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ నెలకొని ఉన్నది. దాంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలా చేస్తుందనే ఆసక్తి పెరిగిపోయింది.

ఓ మై గాడ్ 2 (OMG 2) సినిమా బడ్జెట్ విషయానికి వస్తే.. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. అగ్ర నటులు, యామీ గౌతమి లాంటి హీరోయిన్‌తోపాటు పలువురు పేరున్న నటీనటులు ఉన్నారు. అయితే ఈ సినిమాకు భారీగానే వీఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ ఉపయోగించారు. దాంతో ఈ సినిమా వ్యయం ఎక్కువగానే అయింది. అక్షయ్ కుమార్ రెమ్యునరేషన్‌తోపాటు ఈ సినిమాకు 150 కోట్ల బడ్జెట్ అయింది.

Akshay Kumars OMG 2 Movie day 1 official Collections worldwide

ఓ మై గాడ్ 2 (OMG 2) సినిమాలో అడల్డ్ కంటెంట్ ఉండటంతో A సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ సినిమాను భారీగానే ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేశారు. ఇండియాలో 1500 స్క్రీన్లతోపాటు ప్రపంచవ్యాప్తంగా 2000 స్క్రీన్లలో ప్రదర్శిస్తున్నారు. అక్షయ్ కుమార్ కెరీర్‌లో అత్యధిక స్క్రీన్లలో ప్రదర్శించిన చిత్రంగా ఘనతను సాధించింది.

ఓ మై గాడ్ 2 (OMG 2) సినిమా తొలి రోజు మిక్స్‌డ్ ఆక్యుపెన్సీ నమోదు చేసుకొన్నది. ఈ చిత్రం అన్ని ప్రాంతాల్లో సగటున 55 శాతం ఆక్యుపెన్సీ నమోదు చేసుకొన్నది. ఈ సినిమా తొలి రోజు 10 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. ఇటీవల వరుస ఫ్లాప్‌లతో ఉన్న అక్షయ్ కుమార్‌కు ఈ సినిమా కొంతలో కొంత ఊరటను ఇచ్చిందనే చెప్పాలి.

ఓ మై గాడ్ 2 (OMG 2) సినిమా టాక్ ఎలా ఉన్నా.. భారీ ఓపెనింగ్ సాధించింది. బాలీవుడ్‌లో ఈ సంవత్సరం అత్యధిక ఓపెన్సింగ్స్ సాధించిన చిత్రంగా 10వ స్థానంలో నిలిచింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే కనీసం బాక్సాఫీస్ వద్ద 70 కోట్ల షేర్ సాధించాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే సన్నీడియోల్ నటించిన గదర్ 2 సినిమా ఈ చిత్ర కలెక్షన్లపై భారీ దెబ్బ కొట్టింది. ఆ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో ఈ సినిమా కలెక్షన్లపై భారీ ప్రభావం పడింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X