For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Raksha Bandhan 2 Days Collections: అక్షయ్‌కు భారీ దెబ్బ.. 2వ రోజే దారుణం.. ఎన్ని కోట్లు రావాలంటే!

  |

  ఇండియాలో చాలా మంది హీరోలు తమదైన చిత్రాలతో సందడి చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే, అందులో కొందరు మాత్రమే స్టార్‌డమ్‌ను కంటిన్యూ చేస్తూ తమ మార్కెట్‌ను, ఫాలోయింగ్‌ను అంతకంతకూ పెంచుకుంటూనే ఉన్నారు. అలాంటి వారిలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ఒకరు. కెరీర్ ఆరంభం నుంచీ విలక్షణమైన నటన, విభిన్నమైన చిత్రాలతో వస్తున్న ఆయన.. హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఇలా ఏడాది రెండు మూడు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. దీంతో అతడి అభిమానులతో పాటు సినీ ప్రియులు అందరూ ఫుల్ ఖుషీ అయిపోతోన్నారు.

  ఫ్లైట్‌లోనే నయనతార - విఘ్నేష్ రచ్చ: భర్త మీద కూర్చుని.. ఏకంగా అక్కడ ముద్దు పెట్టేసి!

  ఇప్పటికే ఈ ఏడాది రెండు సినిమాలతో అలరించిన బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్.. ఇప్పుడు 'రక్షా బంధన్' అనే సిస్టర్ సెంటిమెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆనంద్ ఎల్ రాయ్ నిర్మించి తెరకెక్కించిన ఈ సినిమాపై మొదటి నుంచే అందరూ దృష్టి సారించారు. అందుకు అనుగుణంగా ఈ మూవీ నుంచి వచ్చిన అన్ని రకాల అప్‌డేట్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కింది. దీంతో ఈ మూవీ హక్కుల కోసం దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని ఏరియాల్లోనూ భారీ డిమాండ్ కనిపించింది. అలాగే, ఓవర్సీస్ మార్కెట్‌ను కూడా కలుపుకుని ఈ చిత్రానికి దాదాపు రూ. 125 కోట్ల మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

  రాఖీ పండుగ రోజు విడుదలైన 'రక్షా బంధన్' మూవీలో అక్షయ్ కుమార్ నలుగురు చెల్లెల్లు ఉన్న సాధారణ వ్యక్తిగా నటించాడు. అలాంటి వాడు వాళ్లకు ఎలా పెళ్లి చేశాడు? కట్నం అనేది పెళ్లిల్లో ఎలాంటి పాత్ర పోషిస్తుంది? పెళ్లిలో అమ్మాయి వాళ్లకి, అబ్బాయి వాళ్లకి ఎలాంటి వ్యత్యాసం ఉంటుంది? అనే అంశాలతో ఈ సినిమా తెరకెక్కించారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన ఈ సినిమాకు అనుకున్నట్లుగానే దేశ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ పాజిటివ్ టాక్ వచ్చింది. అలాగే, రివ్యూలు కూడా మంచిగానే దక్కాయి. దీంతో ఈ సినిమాకు అదిరిపోయే కలెక్షన్లు వస్తాయని ట్రేడ్ పండితులు అంచనాలు వేశారు.

  రష్మిక మందన్నా హాట్ సెల్ఫీ వైరల్: ఈ పిక్‌లో ఆమెను చూస్తే తట్టుకోలేరు

  Akshay Kumar Raksha Bandhan Movie 2 Days Box Office Collections

  సిస్టర్ సెంటిమెంట్ స్టోరీతో రూపొందిన 'రక్షా బంధన్' మూవీకి మంచి టాక్ వచ్చినా మొదటి రోజు కలెక్షన్లు ఆశించిన స్థాయిలో రాలేదు. దీనికి ఓపెనింగ్ డేన ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలిపి కేవలం రూ. 10.70 కోట్ల గ్రాస్.. రూ. 8.20 కోట్ల నెట్ మాత్రమే వసూలు అయింది. ఇక, రెండో రోజు ఈ చిత్రానికి 30 శాతానికి పైగా కలెక్షన్లు పడిపోయాయి. ఫలితంగా దీనికి రూ. 7.10 కోట్ల గ్రాస్‌‌తో పాటు రూ. 6.00 కోట్ల నెట్ మాత్రమే దక్కింది. ఇలా రెండు రోజుల్లో ఈ సినిమా రూ. 14.20 కోట్ల నెట్‌ను మాత్రమే వసూలు చేసింది. అంటే ఇంకా ఈ చిత్రానికి రూ. 110 కోట్లు వసూలు అయితేనే హిట్ స్టేటస్ సొంతం అవుతుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

  బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన తాజా చిత్రమే 'రక్షా బంధన్'. ఆనంద్ ఎల్ రాయ్ నిర్మించి తెరకెక్కించిన ఈ సినిమాకు జీ స్టూడియోస్ సంస్థ నిర్మాణ భాగస్వామిగా ఉంది. ఇందులో భూమి పడ్నేకర్ హీరోయిన్‌గా నటించగా.. సదీయా ఖతీబ్, సహేజ్‌మీన్ కౌర్, దీపికా ఖన్నా, సృతి శ్రీకాంత్ కీలక పాత్రలు చేశారు. ఇషాన్ చబ్రా, హిమేష్ సంగీతాన్ని అందించారు.

  English summary
  Bollywood Star Hero Akshay Kumar Did Raksha Bandhan Movie Under Aanand L. Rai Direction. This Movie Collects 14.20 Crore Net in 2 Days.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X