Raksha Bandhan Day 1 Collections: అక్షయ్ కుమార్‌కు బిగ్ షాక్.. తొలి రోజే ఇంత తక్కువగానా!

విలక్షణమైన నటన, విభిన్నమైన చిత్రాలతో దాదాపు మూడు నాలుగు దశాబ్దాలుగా హిందీ చిత్ర పరిశ్రమలో హవాను చూపిస్తూ టాప్ హీరోగా వెలుగొందుతోన్నాడు అక్షయ్ కుమార్. ఏజ్ బార్ అవుతోన్నా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తోన్న ఆయన.. ఏడాది మూడు నాలుగు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అంతేకాదు, తన సినిమాలను పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ చేస్తున్నాడు. ఇలా తన ఫాలోయింగ్‌ను, మార్కెట్‌ను క్రమంగా పెంచుకుంటూనే ఉన్నాడు. ఈ ఉత్సాహంతోనే అక్షయ్ కుమార్ మరిన్ని ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తూ దూసుకుపోతోన్నాడు. ఇలా ఫ్యాన్స్‌ను రంజింప చేస్తున్నాడు.

వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తున్నా ఈ మధ్య కాలంలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్‌కు బిగ్గెస్ట్ సక్సెస్ మాత్రం రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ స్టార్ హీరో నటించిన సినిమానే 'రక్షా బంధన్'. ఆనంద్ ఎల్ రాయ్ నిర్మించి తెరకెక్కించిన ఈ సినిమా ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించింది. దీనికితోడు ఈ సినిమా నుంచి వచ్చిన అన్ని రకాల అప్‌డేట్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కింది. దీంతో ఈ మూవీ హక్కుల కోసం దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని ఏరియాల్లోనూ భారీ డిమాండ్ కనిపించింది. అలాగే, ఓవర్సీస్ మార్కెట్‌ను కూడా కలుపుకుని ఈ చిత్రానికి అదిరిపోయే బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Akshay Kumar Raksha Bandhan Movie Day 1 Box Office Collections

అక్షయ్ కుమార్ కెరీర్‌లోనే సిస్టర్ సెంటిమెంట్‌తో తెరకెక్కిన చిత్రమే 'రక్షా బంధన్'. నలుగురు చెల్లెల్లు ఉన్న అన్న వాళ్లకు ఎలా పెళ్లి చేశాడు? కట్నం అనేది పెళ్లిల్లో ఎలాంటి పాత్ర పోషిస్తుంది? పెళ్లిలో అమ్మాయి వాళ్లకి, అబ్బాయి వాళ్లకి ఎలాంటి వ్యత్యాసం ఉంటుంది? అనే అంశాలతో ఈ సినిమా తెరకెక్కించారు. దీనికితోడు ఈ సినిమా రాఖీ పండుగ రోజునే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. అనుకున్నట్లుగానే ఈ చిత్రాన్ని దేశ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ పాజిటివ్ టాక్ వచ్చింది. అలాగే, రివ్యూలు కూడా మంచిగానే దక్కాయి. దీంతో ఈ సినిమాకు అదిరిపోయే కలెక్షన్లు వస్తాయని ట్రేడ్ పండితులు అంచనాలు వేసుకున్నారు.

క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'రక్షా బంధన్' మూవీకి టాక్ బాగానే ఉన్నా ప్రేక్షకుల నుంచి స్పందన ఆశించిన స్థాయిలో రాలేదు. ఫలితంగా ఈ చిత్రానికి అనుకున్న రీతిలో కలెక్షన్లు దక్కలేదు. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని ఏరియాలను కలుపుకుని కేవలం రూ. 10.70 కోట్ల గ్రాస్‌ను మాత్రమే వసూలు చేసింది. తద్వారా రూ. 9 కోట్ల నెట్ కలెక్షన్లను మాత్రమే రాబట్టుకోగలిగింది. ఇది అక్షయ్ కుమార్ రేంజ్‌కు చాలా తక్కువ అనే చెప్పుకోవాలి. ఇక, ఈ ఏడాది వచ్చిన అతడి చిత్రాల్లో 'బచ్చన్ పాండే'కు రూ. 13.25 కోట్లు నెట్.. సామ్రాట్ పృథ్వీరాజ్ చిత్రానికి రూ. 10.70 కోట్ల నెట్ కలెక్షన్లు వచ్చిన విషయం తెలిసిందే. వాటితో పోల్చినా ఇది చాలా తక్కువనే చెప్పాలి.

ఇదిలా ఉండగా.. స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన తాజా చిత్రమే 'రక్షా బంధన్'. ఆనంద్ ఎల్ రాయ్ నిర్మించి తెరకెక్కించిన ఈ సినిమాకు జీ స్టూడియోస్ సంస్థ నిర్మాణ భాగస్వామిగా ఉంది. ఇందులో భూమి పడ్నేకర్ హీరోయిన్‌గా నటించగా.. సదీయా ఖతీబ్, సహేజ్‌మీన్ కౌర్, దీపికా ఖన్నా, సృతి శ్రీకాంత్ కీలక పాత్రలు చేశారు. ఇషాన్ చబ్రా, హిమేష్ సంగీతాన్ని సమకూర్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X