twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాక్సాఫీస్‌పై కేసరి గాండ్రింపు .. 100 కోట్ల కాసుల వర్షం.. అక్షయ్ హ్యాట్రిక్

    |

    Recommended Video

    Akshay Kumar’s Kesari Crosses Rs.100 Crores || Filmibeat Telugu

    అక్షయ్ కుమార్, పరిణితి చోప్రా జంటగా రూపొందిన కేసరి చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్నది. ఐపీఎల్ టోర్నిని ధీటుగా ఎదురిస్తున్నఈ చిత్రం రూ.100 క్లబ్‌లో చేరేందుకు దూసుకెళ్తున్నది. గతవారంతో పోల్చుకొంటే రెండో సోమవారం కలెక్షన్లు నిరాశపరిచినా వసూళ్లు నిలకడగానే ఉన్నాయి. ఈ వారాంతంలోగా కేసరి వంద కోట్లు వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..

    ఐపీఎల్‌ టోర్ని పోటీని తట్టుకొని

    ఐపీఎల్‌ టోర్ని పోటీని తట్టుకొని

    కేసరి చిత్రం రెండో వారాంతంలో సినిమాలకు అగ్నిపరీక్షగా నిలిచే సోమవారం ఓ మోస్తారు కలెక్షన్లను సాధించింది. సోమవారం రూ.8.25 కోట్లు, మంగళవారం రూ.7.17 కోట్లు రాబట్టింది. ఉత్తరాదిలో ఈ చిత్రం నిలకడగా వసూళ్లు రాబట్టడం గమనార్హం.

    ఉత్తరాదిలో బలంగానే

    ఉత్తరాదిలో బలంగానే

    ఉత్తరాదిలో కేసరి చిత్రం బలంగానే కనిపిస్తున్నది. బుధ, గురువారాల్లో ఈ చిత్రం రూ.100 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయం. గత గురువారం ఈ చిత్రం రూ.21.06, శుక్రవారం రూ.16.75 కోట్లు, శనివారం రూ.18.75 కోట్లు, ఆదివారం రూ.21.51 కోట్లు, సోమవారం రూ.8.25 కోట్లు, మంగళవారం రూ.7.17 కోట్లు వసూలు చేసింది. ఇప్పటి వరకు ఈ చిత్రం రూ.93.49 కోట్లు కలెక్ట్ చేసింది అని ట్రేడ్ అనలిస్టు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.

    కేసరి సినిమా కథ ఇదే..

    కేసరి సినిమా కథ ఇదే..

    అఫ్ఘనిస్థాన్‌లో 1897లో జరిగిన సారాగర్హి యుద్దం నేపథ్యంగా కేసరి చిత్రం రూపొందింది. 10 వేల మంది అఫ్ఘన్ వేర్పాటు వాదులతో 21 మంది భారతీయ సైనికులు జరిపిన పోరాటాన్ని తెరకెక్కించారు. అనురాగ్ సింగ్ దర్శకత్వం వహించగా, కరణ్ జోహర్ నిర్మించారు.

    అక్షయ్ కుమార్ హ్యాట్రిక్

    అక్షయ్ కుమార్ హ్యాట్రిక్

    అక్షయ్ కుమార్ నటించిన కేసరి చిత్రం రూ.100 క్లబ్‌లో చేరితో ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకొంటారు. వరుసగా మూడుసార్లు వంద కోట్ల క్లబ్‌లో చేరిన బాలీవుడ్ హీరోగా అక్షయ్ ఓ రికార్డును క్రియేట్ చేయనున్నారు. గతంలో ఆయన నటించిన గోల్డ్, 2.0 చిత్రాలు రూ.100 కోట్లు వసూలు చేసిన సంగతి తెలిసిందే.

    English summary
    Akshay Kumar's Kesari movie expected to cross Rs. 100 crore already, is still struggling and might near the Rs. 100-crore mark a week after its release. While it minted Rs. 8.25 crore on Monday, Kesari is still struggling and saw more fall on Tuesday.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X