సుశాంత్ సింగ్ రికార్డును బ్రేక్ చేసిన అక్షయ్ కుమార్.. దూసుకెళ్తున్న లక్ష్మి
సినీ పరిశ్రమలో బాక్సాఫీస్ రికార్డులను లెక్కపెట్టుకొనే రోజులు ఈ మధ్య కాలంలో కనుమరుగైపోయాయి. లాక్‌డౌన్ కారణంగా థియేటర్లు మూతపడటంతో ఇప్పుడు సినిమాలకు ఓటీటీలు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయాయి. తాజాగా అక్షయ్ కుమార్, లారెన్స్ రాఘవ కాంబినేషన్‌లో వచ్చిన లక్ష్మి చిత్రం డిస్నీ+హాట్‌స్టార్ యాప్‌లో సరికొత్త రికార్డును సొంతం చేసుకొన్నది. ఈ రికార్డు వివరాల్లోకి వెళ్లితే..

కాంచన చిత్రాన్ని రీమేక్‌గా
దక్షిణాదిలో ఘన విజయం సాధించిన కాంచన చిత్రాన్ని రీమేక్‌గా లక్ష్మి మూవీని రూపొందించారు. తొలిసారి లారెన్స్ రాఘవ హిందీలోకి ప్రవేశించి దర్శకత్వం చేపట్టారు. అక్షయ్ కుమార్ కియారా అద్వాని నటించిన ఈ చిత్రం చిన్న చిన్న మార్పులతో తెరకెక్కింది. కరోనావైరస్ కారణంగా థియేటర్లు మూతపడటంతో ఈ చిత్రాన్ని నవంబర్ 9వ తేదీన డీస్నీ+హాట్‌స్టార్ యాప్‌లో రిలీజ్ చేశారు.

ప్రేక్షకులు పెదవి విరిచినప్పటికీ..
అయితే కాంచన చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు లక్ష్మి మూవీని చూసి పెదవి విరిచారు. ఆ స్థాయిలో సినిమా లేదంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. ఉత్తరాదిలో కొంత ప్రతికూలత, మరికొంత సానుకూలతను కూడగట్టుకొన్నప్పటికి మెజారిటీగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిందనే స్పందన మీడియాలో కనిపిస్తున్నది.

విడుదలైన కొద్ది గంటల్లోనే రికార్డు వ్యూవర్ షిప్
ఇదిలా ఉండగా, అక్షయ్ కుమార్ నటించిన లక్ష్మి చిత్రం డిస్నీ హాట్‌స్టార్‌లో అన్ని రికార్డులు తిరగరాసింది. విడుదలైన కొద్ది గంటల్లోనే ఈ చిత్రం బాలీవుడ్ బ్లాక్‌బాస్టర్‌గా నిలిచింది అంటూ ఓ పోస్టర్‌ను డిస్నీ+ హాట్ స్టార్ రిలీజ్ చేసింది. ఈ చిత్రాన్ని బ్లాక్‌బస్టర్ ఆఫ్ ది ఇయర్‌గా అభివర్ణించింది.
Recommended Video

దిల్ బేచారా రికార్డులు బ్రేక్
అయితే లక్ష్మి సినిమాకు ముందు డిస్నీ+హాట్‌స్టార్‌లో అత్యధిక ఓపెనింగ్ సాధించిన చిత్రం సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించిన దిల్ బేచారా ఉంది. సుశాంత్ సింగ్ మరణం తర్వాత ఈ చిత్రాన్ని రిలీజ్ చేయగా అత్యధిక వ్యూవర్ షిప్‌ను సాధించి రికార్డులు బ్రేక్ చేసింది. తాజా దిల్ బేచారా రికార్డును తిరగరాస్తూ అత్యధిక ఓపెనింగ్ సాధించిన చిత్రంగా లక్ష్మి దూసుకెళ్తున్నది.

ఆనందంలో అక్షయ్ కుమార్.. ఫ్యాన్స్‌కు థ్యాంక్స్
లక్ష్మి చిత్రం ఓటీటీలో అతి పెద్ద విజయాన్ని నమోదు చేసుకొన్న చిత్రంగా నిలువడంపై అక్షయ్ కుమార్ తన సంతోషాన్ని సోషల్ మీడియాలో వ్యక్తం చేశారు. లక్ష్మి చిత్రానికి మంచి రెస్పాన్ రావడంపై ఆనందంగా ఉంది. డిస్నీ+ హాట్ స్టార్‌లో పెద్ద ఎత్తున్న చూసిన ప్రేక్షకులకు, అభిమానులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.


Click it and Unblock the Notifications











