twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లక్ష్మీ బాంబ్ భలే పేలింది.. కళ్లు చెదిరే ధరకు డిజిటల్ హక్కులు!

    |

    కరోనావైరస్ కారణంగా థియేటర్లు మూత పడటంతో సినీ నిర్మాతలు తమ చిత్రాలను డిజిటల్ ఫ్లాట్‌ఫాంపై రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే సూర్య, జ్యోతిక నిర్మించిన పాన్‌మగల్ వంధాల్ అమెజాన్ రిలీజ్ చేయగా.. అదే దారిలో అక్షయ్ కుమార్ కూడా రెడీ అవుతున్నారు. అక్షయ్, కియారా అద్వానీ జంటగా నటించిన కామెడీ హారర్ చిత్రం లక్ష్మీబాంబ్ ఓటీటీ ఫ్లాట్‌ఫాంపై రిలీజ్‌ కోసం జరిగిన బిజినెస్ రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమా డిజిటల్ బిజినెస్ వివరాల్లోకి వెళితే..

    కాంచన రీమేక్‌గా లక్ష్మీబాంబ్

    కాంచన రీమేక్‌గా లక్ష్మీబాంబ్

    తమిళ, తెలుగులో ఘన విజయం సాధించిన కాంచన చిత్రం రీమేక్‌గా లక్ష్మీబాంబ్ తెరకెక్కించారు. తమిళంలో దర్శకత్వం వహించిన రాఘవ లారెన్స్ ఈ చిత్రాన్ని హిందీలో కూడా తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని రూ.50 కోట్ల బడ్జెట్‌తో రూపొందింది. ఈ చిత్రాన్ని మే 22న రిలీజ్ చేయాలని భావించారు. అయితే లాక్‌డౌన్ కారణంగా విడుదలకు నోచుకోలేదు.

    ప్రీ రిలీజ్ డిజిటల్ బిజినెస్

    ప్రీ రిలీజ్ డిజిటల్ బిజినెస్

    అయితే లాక్‌డౌన్ కారణంగా థియేటర్లలో కాకుండా ఓటీటీ ఫ్లాట్‌ఫాం డిస్నీ, హాట్ స్టార్ యాప్‌లో సినిమాను రిలీజ్ చేయాలని ఒప్పందం కుదుర్చుకొన్నారు. ఈ ప్రీ రిలీజ్ బిజినెస్‌లో భాగంగా ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ రైట్స్ సుమారు రూ.125 కోట్లకు అమ్మినట్టు సమాచారం. ఇలా డిజిటల్ రైట్స్ ఈ రేంజ్‌లో అమ్ముడుపోవడం ఇటీవల కాలంలో ఇదే మొదటదని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

    మారుతున్న బాలీవుడ్

    మారుతున్న బాలీవుడ్

    ఇటీవల కాలంలో బాలీవుడ్‌లో సినిమాల రిలీజ్ విషయంలో భారీ మార్పులు చోటుచేసుకొంటున్నాయి. అగ్రేజీ మీడియం, భాగీ3 చిత్రాలు థియేటర్లలో కొద్ది రోజులకే లాక్‌డౌన్ విధించి సినిమాలు మూసి వేయడంతో వాటిని హాట్‌స్టార్‌లో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పట్లో కరోనా పరిస్థితుల్లో మార్పు వచ్చే దిక్కు లేకపోవడంతో ఇదే దారిలో బాలీవుడ్ నిర్మాతలు తమ సినిమాలు రిలీజ్ చేయడానికి మొగ్గు చూపుతున్నారు.

    ఓటీటీపైనే హిందీ చిత్రాలు

    ఓటీటీపైనే హిందీ చిత్రాలు

    ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా గులాబో సితాబో, శకుంతలదేవి లాంటి సినిమాలు ఓటీటీపై రిలీజ్‌కు సిద్ధమవుతున్నాయి. ఇంకా దక్షిణాదిలో ఐదు, ఆరు సినిమాలు ఓటీటీపైకి రావడానికి క్యూ కడుతున్నాయి. ఓటీటీలో ఆడియెన్స్ రెస్పాన్స్ బాగా ఉంటే మరికొన్ని సినిమాలు నేరుగా రిలీజ్ అయ్యే అవకాశాలు లేకపోలేదని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.

    English summary
    Akshay Kumar's Laxmmi Bomb whopps Rs 125 crore for Digital rights by Disney, Hotstar. Reports suggest that, Akshay Kumar movie may release on OTT platform Disney, Hotstar.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X