రికార్డులు తిరగరాస్తున్న మిషన్ మంగళ్.. 2.0 వసూళ్లపై కన్నేసిన అక్షయ్
బాలీవుడ్ కిలాడి అక్షయ్ కుమార్ నటించిన మిషన్ మంగళ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద హంగామా చేస్తున్నది. ఈ చిత్రం కలెక్షన్లు అక్షయ్ కెరీర్‌లోనే అత్యధికంగా నిలిచాయి. విద్యాబాలన్, సోనాక్షి సిన్షా, తాప్సీ పన్ను, కృతి కుల్హారి, నిత్యా మీనన్, శర్మాన్ జోషి నటించిన ఈ చిత్రం రూ.200 కోట్లకు చేరువైంది. తాజాగా ఈ సినిమా కలెక్షన్ల దృష్టి రజనీకాంత్, అక్షయ్ కుమార్ నటించిన 2.0పై పడింది. త్వరలోనే 2.0 చిత్ర వసూళ్లను అధిగమించే అవకాశం ఉంది.
ఆగస్టు 15న రిలీజ్ అయిన మిషన్ మంగళ్ చిత్రం ఇప్పటికే 18 రోజులు పూర్తి చేసుకొన్నది. ఈ చిత్రం రూ.188 కోట్ల వసూళ్లను సాధించింది. ఆదివారం రూ.3 కోట్లు సాధించడంతో రూ.190 కోట్లు దాటేసింది. మూడో వారంలోకి ప్రవేశించిన ఈ సినిమా వారాంతానికి మొత్తం రూ.6 కోట్లు వసూలు చేయడం గమనార్హం.

మిషన్ మంగళ్ చిత్రం తొలి రోజున రూ.29.16 కోట్లు, వారాంతంలో రూ.97.56 కోట్లు, తొలివారంలో రూ.128.16 కోట్లు, రెండో వారంలో రూ.178.11 కోట్లు వసూలు చేసింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు, ఓవర్సీస్ కలెక్షన్లను కలిపితే ఇప్పటి వరకు రూ.251.16 కోట్లు వసూలు చేసింది.


Click it and Unblock the Notifications











