For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రికార్డులు తిరగరాస్తున్న మిషన్ మంగళ్.. 2.0‌ వసూళ్లపై కన్నేసిన అక్షయ్

|

బాలీవుడ్ కిలాడి అక్షయ్ కుమార్ నటించిన మిషన్ మంగళ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద హంగామా చేస్తున్నది. ఈ చిత్రం కలెక్షన్లు అక్షయ్ కెరీర్‌లోనే అత్యధికంగా నిలిచాయి. విద్యాబాలన్, సోనాక్షి సిన్షా, తాప్సీ పన్ను, కృతి కుల్హారి, నిత్యా మీనన్, శర్మాన్ జోషి నటించిన ఈ చిత్రం రూ.200 కోట్లకు చేరువైంది. తాజాగా ఈ సినిమా కలెక్షన్ల దృష్టి రజనీకాంత్, అక్షయ్ కుమార్ నటించిన 2.0పై పడింది. త్వరలోనే 2.0 చిత్ర వసూళ్లను అధిగమించే అవకాశం ఉంది.

ఆగస్టు 15న రిలీజ్ అయిన మిషన్ మంగళ్ చిత్రం ఇప్పటికే 18 రోజులు పూర్తి చేసుకొన్నది. ఈ చిత్రం రూ.188 కోట్ల వసూళ్లను సాధించింది. ఆదివారం రూ.3 కోట్లు సాధించడంతో రూ.190 కోట్లు దాటేసింది. మూడో వారంలోకి ప్రవేశించిన ఈ సినిమా వారాంతానికి మొత్తం రూ.6 కోట్లు వసూలు చేయడం గమనార్హం.

Akshay Kumars Mission Mangal collects Rs.250 crores

మిషన్ మంగళ్ చిత్రం తొలి రోజున రూ.29.16 కోట్లు, వారాంతంలో రూ.97.56 కోట్లు, తొలివారంలో రూ.128.16 కోట్లు, రెండో వారంలో రూ.178.11 కోట్లు వసూలు చేసింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు, ఓవర్సీస్ కలెక్షన్లను కలిపితే ఇప్పటి వరకు రూ.251.16 కోట్లు వసూలు చేసింది.

English summary
Akshay Kumar's Mission Mangal roaring at box office. Sonakshi Sinha, Vidya Balan, Taapsee Pannu, Kirti Kulhari and Sharman Joshi starrer movie getting good response all over. This makes the worldwide collection of Mission Mangal so far at Rs. 251.16 crores.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more