twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అక్షయ్ కుమార్ కెరీర్లోనే హయ్యెస్ట్ గ్రాసర్ 2.0

    |

    2.0 చిత్రం బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కెరీర్లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్ గ్రాసర్‌గా నిలవడం ఖాయం అంటున్నారు ట్రేడ్ విశ్లేషరకులు. ఈ ఏడాది ఈ బిటౌన్ స్టార్ హీరోగా నటించిన ప్యాడ్ మ్యాన్, గోల్డ్ చిత్రాలు ఇప్పటికే విడుదలై మంచి వసూళ్లు సాధించాయి. తాజాగా విడుదలై 2.0లో అక్షయ్ విలన్ పాత్ర పోషించారు.

    2.0 చిత్రం హిందీతో పాటు తెలుగు, తమిళం భాషల్లో విడుదలైంది. తొలి రోజు రూ. 55 నుంచి 60 కోట్లు వసూలు చేసే అవకాశం ఉందని... ఇటీవల విడుదలైన బాలీవుడ్ మూవీ 'థగ్స్ ఆఫ్ హిందూస్తాన్' రూ. 52 కోట్ల ఓపెనింగ్ డే రికార్డ్ బద్దలవ్వడం ఖాయం అంటున్నారు.

    Akshay Kumar’s top first day grosser 2.0

    సాధారణంగా సినిమాలు శుక్రవారం విడుదలవుతాయి. ఏదైనా పండగ సీజన్ ఉంటే గురువారం రిలీజ్ చేస్తారు. ఇంతకు ముందు థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ దీవాళి నేపథ్యంలో గురువారం విడుదల చేశారు. ఈ నేపథ్యంలో నిన్న విడుదలైన 2.0 హయ్యెస్ట్ నాన్ ఫెస్టివల్ థర్స్‌డే ఓపెనర్‌గా పేర్కొంటున్నారు.

    సినిమాపై ముందు నుంచీ భారీ హైప్ ఉండటం, రజనీకాంత్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్స్ నటించడం, భారీ బడ్జెట్ చిత్రం కావడంతో ఈచిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా 10,500 స్క్రన్లలో విడుదల చేశారు. అన్ని ప్రాంతాల నుంచి కలెక్షన్ల వివరాలు అందాల్సి ఉంది. ఈ మొత్తం ఫిగర్ ఎంత ఉంటుంది? అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

    అయితే శంకర్ దర్శకత్వం వహించిన 2.0 చిత్రానికి ఉత్తరాదిలో అంతగా క్రేజ్ లేదని అంటున్నారు. ఒక వేళ మౌత్ టాక్ సూపర్ పాజిటివ్‌గా ఉంటే ఈ వీకెండ్ మంచి ఫలితాలు రాబట్టే అవకాశం ఉంది. సినిమా విజువల్స్ పరంగా అద్భుతంగా ఉన్నప్పటికీ కథ పరంగా పెద్దగా ఆకట్టుకోలేదని అంటున్నారు. 2010లో వచ్చిన రోబోతో పోలిస్తే అంతకు మించిన స్థాయి కనిపించలేదని అంటున్నారు.

    English summary
    Akshay Kumar’s top first day grosser 2.0. Akshay Kumar’s third release of this year after Padman and Gold is set to be his highest opening ever across all languages.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X