15 ఫ్లాపులతో అక్షయ్ కుమార్ రికార్డు.. ఓ మై గాడ్ 2 (OMG 2) బాక్సాఫీస్ కలెక్షన్ల పరిస్థితి ఇది?
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన ఓ మై గాడ్ 2 (OMG 2) చిత్రం పంద్రాగస్టు కానుకగా ఆగస్టు 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. చాలా కాలంగా అక్షయ్ నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాలను చవిచూస్తున్నాయి. అయితే గతంలో బ్రహ్మండమైన విజయం సాధించిన ఓ మై గాడ్ సినిమాకు సీక్వెల్‌గా రూపొందిన ఈ చిత్రం విడుదలై మంచి స్పందనను సొంతం చేసుకొంటున్నది. మిక్స్‌డ్ టాక్‌తో ప్రదర్శింపబడుతున్న ఓ మై గాడ్ 2 సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అత్యధికంగా సినిమాలు చేసే హీరోల్లో అక్షయ్ కుమార్ ఒకరు. ఏడాదికి ఐదు నుంచి ఆరు సినిమాలు ఎలాంటి కష్టం లేకుండా చేసుకొంటూ పొతుంటాడు. ప్రతీ రెండు, మూడు నెలలకు ఓ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుంటాడు. హిట్, ఫ్లాప్స్ అనే తేడా లేకుండా వరుసగా సినిమాలు చేస్తుంటడం అందర్నీ ఆకట్టుకొంటుంది.

అయితే గత నాలుగు, ఐదు సంవత్సరాల్లో దాదాపు 16 సినిమాలు చేశారు. అయితే అందులో దాదాపు అన్నీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోర్లా పడ్డాయి. అక్షయ్ కుమార్ నటించిన కేసరీ, బ్లాక్, లక్ష్మీ, బెల్ బాటమ్, సూర్యవంశీ, అత్రంగి రే, బచ్చన్ పాండే, సామ్రాట్ పృథ్వీరాజ్, రక్షా బంధన్, కట్ పుత్లీ, రామసేతు. యాక్షన్ హీరో, సెల్ఫీ సినిమాలు భారీగా దెబ్బ తీశాయి.
ఇలాంటి పరిస్థితుల్లో సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ నటించిన ఓ మై గాడ్ సినిమాకు సీక్వెల్‌గా OMG 2 వచ్చింది. ఈ సినిమా రకరకాల వివాదాల్లో చిక్కుకోవడంతో కొంత అటెన్షన్ పెరిగింది. సెక్స్ ఎడ్యుకేషన్ బ్యాక్ డ్రాప్ కావడంతో ఈ సినిమాకు సెన్సార్ అధికారులు అభ్యంతరం తెలిపారు. దాంతో ఈ సినిమా A సర్టిఫికెట్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఈ సినిమా మెల్లమెల్లగా క్రేజ్ పెరుగడంతో హిట్ దిశగా ప్రయాణిస్తున్నది.

ఇక ఓ మై గాడ్ 2 (OMG 2) సినిమా బడ్జెట్ విషయానికి వస్తే.. ఈ చిత్రాన్ని సుమారు 150 కోట్ల రూపాయలతో తెరకెక్కించారు. పంకజ్ త్రిపాఠి, యామీ గౌతమ్, గోవింద్ నామ్‌దేవ్ లాంటి నటీనటులు నటించిన సినిమాను సుమారు 1500 స్క్రీన్లకుపైగా రిలీజ్ చేశారు. ఈ సినిమాతోపాటు గదర్ 2 కూడా రిలీజ్ కావడంతో గట్టిపోటీని ఎదుర్కొంటున్నది.
ఓ మై గాడ్ 2 (OMG 2) సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు ఈ సినిమా 10 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. ఈ సినిమాకు సానుకూలమైన టాక్ రావడంతో రెండో రోజు 15 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. ఇక మూడో రోజు ఆదివారం కావడంతో కలెక్షన్ల భారీగా రాబట్టింది. ఈ చిత్రం 3వ రోజున 18 కోట్లు రాబట్టింది. దాంతో ఈ చిత్రం 43 కోట్ల వసూళ్లను నమోదు చేసింది.
ఓ మై గాడ్ 2 (OMG 2) చిత్రం 4వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. సోమవారం కూడా మంచి ఆక్యుపెన్సీ నమోదు అవుతున్నది. మార్నింగ్ షోకు 30 శాతం, మ్యాట్నీకి 45 శాతం, ఫస్ట్, సెకండ్ షోలకు కూడా భారీగానే అడ్వాన్స్ బుకింగ్ నమోదైంది. దాంతో ఈ సినిమా 4వ రోజుకనీసం 11 కోట్ల వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

ఇక ఓ మై గాడ్ 2 (OMG 2) చిత్రం లాభాల్లోకి రావాలంటే.. భారీ లక్ష్యమే ముందు కనిపిస్తున్నది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. సుమారు కనీసం 160 కోట్లు వసూలు చేయాల్సి ఉంటుందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఒకవేళ ఈ రేంజ్‌లో కలెక్షన్లు సాధిస్తే.. హిట్ జాబితాలో ఈ సినిమా చేరడం ఖాయం.


Click it and Unblock the Notifications











