అల.. వైకుంఠపురములో ప్రభంజనం: 200 కోట్లు క్రాస్ చేసిన బన్నీ.. సరికొత్త రికార్డ్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన 'అల.. వైకుంఠపురములో' మూవీ ఇటీవలే విడుదలై సూపర్ సక్సెస్ సాధించింది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా రికార్డు స్థాయిలో వసూళ్లు రాబడుతూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. తొలివారంలో సక్సెస్‌ఫుల్ రన్ కొనసాగించిన ఈ సినిమా రెండో వారంలోనూ అదే జోష్ కంటిన్యూ చేస్తూ 200 కోట్లు క్రాస్ చేసింది. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే..

సంక్రాంతి రేస్.. అలా విన్నర్

సంక్రాంతి రేస్.. అలా విన్నర్

ఈ సారి సంక్రాంతి బరిలో రెండు బడా తెలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు', అల్లు అర్జున్ 'అల.. వైకుంఠపురములో' పోటాపోటీగా ప్రదర్శించబడుతున్నాయి. రెండు సినిమాలకూ భారీ కలెక్షన్స్ వస్తున్నప్పటికీ సంక్రాంతి విన్నర్‌గా అల్లు అర్జున్ 'అల.. వైకుంఠపురములో' నిలిచింది.

10 రోజుల హవా.. వసూళ్ల ప్రభంజనం

10 రోజుల హవా.. వసూళ్ల ప్రభంజనం

విడుదలైన తొలి షోతోనే సక్సెస్ టాక్ తెచ్చుకున్న 'అల.. వైకుంఠపురములో' ఈ 10 రోజులు వసూళ్ల ప్రభంజనం సృష్టించింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అన్ని ఏరియాల్లో, ఓవర్సీస్ మార్కెట్‌లో నాన్ బాహుబలి రికార్డులను తిరగరాసి తన పేరును లిఖించుకుంది. చివరకు తొలి 10 రోజుల్లోనే 200 కోట్ల గ్రాస్ రాబట్టింది.

 ఏపీ, తెలంగాణ‌లో 10 రోజుల్లో.. ఏరియా వైజ్

ఏపీ, తెలంగాణ‌లో 10 రోజుల్లో.. ఏరియా వైజ్

ఏపీ, తెలంగాణ‌లో మొత్తం 10 రోజుల్లో 112.90 కోట్లు కొల్లగొట్టింది 'అల.. వైకుంఠపురములో' మూవీ.
నైజాంలో రూ.35.69 కోట్లు
సీడెడ్‌లో రూ.18.07 కోట్లు
వైజాగ్ 18.80 కోట్లు
తూర్పు గోదావరి జిల్లాలో రూ.9.89 కోట్లు
పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.7.65 కోట్లు
గుంటూరులో రూ.9.93 కోట్లు
కృష్ణా జిల్లాలో రూ.8.80 కోట్లు
నెల్లూరులో రూ.4.07 కోట్లు వసూలయ్యాయి.

ప్రపంచవ్యాప్తంగా చూస్తే..

ప్రపంచవ్యాప్తంగా చూస్తే..

ఇకపోతే కర్ణాటకలో 10.70 కోట్లు, తమిళనాడు, కేరళ & రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 3.60 కోట్లు, యూఎస్ 12.50 కోట్లు, రెస్ట్ ఆఫ్ వరల్డ్ 3.55 కోట్లు.. మొత్తంగా చూస్తే ప్రపంచవ్యాప్తంగా 143.25 కోట్ల షేర్, 220 కోట్ల గ్రాస్ వసూలు చేసింది 'అల.. వైకుంఠపురములో' మూవీ.

అల్లు అర్జున్ కెరీర్ లోనే హయ్యస్ట్ గ్రాసర్‌.. ఆల్ టైం రికార్డ్

అల్లు అర్జున్ కెరీర్ లోనే హయ్యస్ట్ గ్రాసర్‌.. ఆల్ టైం రికార్డ్

అల్లు అర్జున్ కెరీర్ లోనే హయ్యస్ట్ గ్రాసర్‌ గా నిలిచిన 'అల.. వైకుంఠపురములో' నాన్ బాహుబలి 2 రికార్డులను తిరగరాసి ఆల్ టైం రికార్డ్ తన పేరిట లిఖించుకుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన పూజ హెగ్డే నటించింది. చిత్రంలో సుశాంత్, నివేతా పేతురాజ్, మురళి శర్మ, జయరాం, సచిన్, టబు కీలక పాత్రలు పోషించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X