'అల.. వైకుంఠపురములో' సాలిడ్ కలెక్షన్స్.. మహేష్ కంటే ఓ రోజు ముందే బన్నీ.. బాక్సాఫీస్ ఊచకోత
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్- మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ హాట్రిక్ హిట్ సాధించారు. జులాయి, s/o సత్యమూర్తి సినిమాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'అల.. వైకుంఠపురములో' సాలిడ్ కలెక్షన్స్ రాబడుతూ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ సినిమా తొలి 11 రోజుల్లోనే అరుదైన ఫీట్ సాధించింది. వివరాల్లోకి పోతే..

రెండో వారంలోనూ అదే జోష్.. సరిలేరుకు గట్టి పోటీ
తొలివారంలో సక్సెస్‌ఫుల్ రన్ కొనసాగించిన ఈ సినిమా రెండో వారంలోనూ అదే జోష్ కంటిన్యూ చేస్తూ ఈజీగా 200 కోట్లు క్రాస్ చేసింది. సంక్రాంతి బరిలో గట్టిపోటీ ఇస్తూ సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది. ఇకపోతే ఈ సినిమాతో పాటే విడుదలైన 'సరిలేరు నీకెవ్వరు' మూవీ 11 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ఈ సినిమా 10 రోజుల్లోనే సాధించడం విశేషం.

వసూళ్ల ప్రభంజనం.. తొలి 11 రోజుల్లో
తొలి షోతోనే సక్సెస్ టాక్ తెచ్చుకున్న 'అల.. వైకుంఠపురములో' మూవీ ఈ 11 రోజులు వసూళ్ల ప్రభంజనం సృష్టించింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అన్ని ఏరియాల్లో, ఓవర్సీస్ మార్కెట్‌లో నాన్ బాహుబలి రికార్డులను తిరగరాసి తన పేరును లిఖించుకుంది. చివరకు తొలి 11 రోజుల్లో ఈ మూవీ 214.65 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.

ఏపీ, తెలంగాణలో 11 రోజుల్లో.. ఏరియా వైజ్
ఏపీ, తెలంగాణలో మొత్తం 11 రోజుల్లో 105.8 కోట్ల షేర్ రాబట్టింది 'అల.. వైకుంఠపురములో' మూవీ.
నైజాం : 34.36 కోట్లు
సీడెడ్ : 15.81 కోట్లు
గుంటూరు : 9.63 కోట్లు
ఉత్తరాంధ్ర : 15.99 కోట్లు
తూర్పు గోదావరి : 9.46 కోట్లు
పశ్చిమ గోదావరి : 7.38 కోట్లు
కృష్ణ : 9.34 కోట్లు
నెల్లూరు : 3.85 కోట్లు
ఆంధ్ర, తెలంగాణ కలిపి 105.8 కోట్లు వసూలయ్యాయి.

అల్లు అర్జున్ టాప్ ప్లేస్.. నాన్ బాహుబలి రికార్డ్స్
ఆంధ్ర, తెలంగాణలో టాప్-3 షేర్స్ తీసుకుంటే బాహుబలి- 2 (198.7 కోట్లు), బాహుబలి (110.1 కోట్లు), అల వైకుంఠపురములో (105.8 కోట్లు). ఇలా ఈ సినిమాతో నాన్ బాహుబలి రికార్డ్స్‌లో అల్లు అర్జున్ టాప్ ప్లేస్ సాధించడం విశేషం.
Recommended Video

‘అల వైకుంఠపురములో' ప్రీ రిలీజ్ బిజినెస్
‘అల వైకుంఠపురములో' చిత్రానికి 85 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. విడుదలైన కొద్దీ రోజుల్లోనే ఈ మార్క్ దాటేసి బ్రేక్ ఈవెన్ సాధించింది. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన పూజ హెగ్డే నటించగా.. సుశాంత్, నివేతా పేతురాజ్, మురళి శర్మ, జయరాం, సచిన్, టబు కీలక పాత్రలు పోషించారు.


Click it and Unblock the Notifications











