twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అల.. వైకుంఠపురములో 20 డేస్ కలెక్షన్స్: అల్లు అర్జున్ పరుగును ఆపేవారే లేరండోయ్..

    |

    స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పరుగును ఆప్ వారే కనిపించడం లేదు. 'అల.. వైకుంఠపురములో' రూపంలో సంక్రాంతికి సక్సెస్‌ఫుల్ ఎంట్రీ ఇచ్చి 2020 సంవత్సరానికి శుభారంభం ఇచ్చారు బన్నీ. జనవరి 12న విడుదలైన ఈ సినిమా 20 రోజులు గడిచినా కలెక్షన్ల ప్రవాహాన్ని పారిస్తూనే ఉంది. మరి ఈ రోజుల్లో 'అల.. వైకుంఠపురములో' బాక్సాఫీస్ రిపోర్ట్‌పై ఓ లుక్కేద్దామా..

    మూడో వారంలోనూ అదే స్పీడ్.. ఎవ్వరి అడ్డు లేదు

    మూడో వారంలోనూ అదే స్పీడ్.. ఎవ్వరి అడ్డు లేదు

    మూడో వారంలోనూ థియేటర్స్ వద్ద 'అల.. వైకుంఠపురములో' హంగామా కనిపిస్తోంది.
    తొలి రోజే సక్సెస్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ నేటికీ డీసెంట్ రన్ కొనసాగిస్తోంది. అల్లు అర్జున్ పరుగు చూసి అబ్బో అంటున్నాయి సినీ వర్గాలు. 20వ రోజు 'అల.. వైకుంఠపురములో' సినిమా దాదాపు 39 లక్షల రూపాయలు వసూలు చేసింది.

    20 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా చూస్తే..

    20 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా చూస్తే..

    దేశ విదేశాల్లో ఈ 20 రోజుల్లో పరిస్థితి చూస్తే.. ఏ ఒక్క రోజూ వసూళ్లలో డ్రాప్స్ కనిపించలేదు. ఆట ఆటకూ థియేటర్స్ వద్ద జనం కోలాహలం కనిపించింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో 'అల.. వైకుంఠపురములో' వసూళ్లు భేష్ అనిపించుకుంటున్నాయి. మొత్తంగా 20 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 151.72 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది 'అల.. వైకుంఠపురములో' మూవీ.

    20వ రోజు 'అల.. వైకుంఠపురములో' వసూళ్ల పరిస్థితి

    20వ రోజు 'అల.. వైకుంఠపురములో' వసూళ్ల పరిస్థితి

    నైజాం - 18 లక్షలు
    సీడెడ్ - 3 లక్షలు
    గుంటూరు - 1.2 లక్షలు
    ఉత్తరాంధ్ర - 5 లక్షలు
    తూర్పు గోదావరి - 2 లక్షలు
    పశ్చిమ గోదావరి - 1 లక్ష
    కృష్ణా - 1.8 లక్షలు
    నెల్లూరు - 1.2 లక్షలు
    AP/TG 20 డేస్ టోటల్ షేర్ - 0.33 కోట్లు

    తెలుగు రాష్ట్రాల్లో ఏరియావైజ్ 20 డేస్ డీటెయిల్ రిపోర్ట్

    తెలుగు రాష్ట్రాల్లో ఏరియావైజ్ 20 డేస్ డీటెయిల్ రిపోర్ట్

    ‘అల వైకుంఠపురములో' మూవీ కలెక్షన్స్ వివరాలు ఏరియావైజ్‌గా చూసినట్లయితే..
    నైజాం - 41.30 కోట్లు
    సీడెడ్ - 17.53 కోట్లు
    గుంటూరు - 10.62 కోట్లు
    ఉత్తరాంధ్ర - 18.77 కోట్లు
    తూర్పు గోదావరి - 10.83 కోట్లు
    పశ్చిమ గోదావరి - 8.52 కోట్లు
    కృష్ణా - 10.21 కోట్లు
    నెల్లూరు - 4.38 కోట్లు
    AP/TG 20 డేస్ టోటల్ షేర్ - 122.16 కోట్లు.

    నిర్మాతలకు లాభాల పంట

    నిర్మాతలకు లాభాల పంట

    ఇక ప్రపంచ వ్యాప్తంగా చూస్తే 151.72 కోట్ల రూపాయల షేర్, 242.35 కోట్ల గ్రాస్ రాబట్టింది ‘అల వైకుంఠపురములో' మూవీ. బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసేసిన ఈ సినిమా పలు రికార్డులు తిరగరాస్తూ నిర్మాతలకు లాభాల పంట పండిస్తోంది.

    ‘అల వైకుంఠపురములో’ ప్రీ రిలీజ్ బిజినెస్

    ‘అల వైకుంఠపురములో’ ప్రీ రిలీజ్ బిజినెస్

    ‘అల వైకుంఠపురములో' చిత్రానికి 85 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఈ మార్క్ దాటేసి సంక్రాంతి విన్నర్ గా నిలిచింది ఈ మూవీ. ఇకపోతే ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన పూజ హెగ్డే నటించగా.. సుశాంత్, నివేతా పేతురాజ్, మురళి శర్మ, జయరాం, సచిన్, టబు కీలక పాత్రలు పోషించారు.

    English summary
    Stylish Star Allu Arjun Latest Movie Ala Vaikunthapurramuloo going good at box office. This movie crossed break even and collects more money.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X