twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాక్సాఫీస్ వద్ద అల్లు అర్జున్ రచ్చ.. 300 కోట్ల క్లబ్ వైపు ‘అలా’ పరుగులు

    |

    స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన అల వైకుంఠపురంలో చిత్రం తెలుగు సినిమా రికార్డులు తిరగరాస్తూ 5వ వారంలోకి ప్రవేశించింది. రిలీజ్ తర్వాత ఇటీవల కాలంలో ఒక నెల రోజుల పోస్టర్ వేసుకోవడం బాహుబలి తర్వాత ఇదే అనే మాట ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్నది. అయితే గత 31 రోజులు కలెక్షన్లు ఇలా ఉన్నాయి. వసూళ్ల వివరాల్లోకి వెళితే..

    31వ రోజున కలెక్షన్లు

    31వ రోజున కలెక్షన్లు

    స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్టామినాకు అద్దం పడుతూ అల వైకుంఠపురంలో చిత్రం మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ.15 లక్షలు సంపాదించింది. నైజాంలోనే ఈ చిత్రం రూ.6 లక్షలు వసూలు చేయగా, సీడెడ్‌లో రూ.2 లక్షలు రాబట్టింది. ఇక ఉత్తరాంధ్రలో రూ.3 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో రూ.70 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.60 లక్షలు, గుంటూరులో రూ.1.1 లక్షలు, కృష్ణాలో రూ.1.3 లక్షలు, నెల్లూరులో రూ.70 లక్షలు రాబట్టింది.

    నైజాం, సీడెడ్, ఉత్తరాంధ్రలో

    నైజాం, సీడెడ్, ఉత్తరాంధ్రలో

    అల వైకుంఠపురం ప్రభంజనం సంక్రాంతి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. నైజాంలో ఈ చిత్రం రూ.44.23 కోట్లు, సీడెడ్‌లో రూ.18.11 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.19.69 కోట్లు వసూలు చేసింది. ఇంకా పలు ప్రాంతాల్లో ఈ చిత్రం ఇంకా భారీ వసూళ్లను రాబడుతున్నది.

    ఆంధ్రాలో కలెక్షన్లు

    ఆంధ్రాలో కలెక్షన్లు

    ఇక ఆంధ్రాలో ఏరియాల వారీగా పరిశీలిస్తే.. తూర్పు గోదావరి జిల్లాలో రూ.11.30 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.8.85 కోట్లు, గుంటూరులో రూ.11.03 కోట్టు, కృష్ణా జిల్లాలో రూ.10.66 కోట్లు, నెల్లూరులో రూ.4.66 కోట్లు వసూలు చేసింది. దీంతో ఇప్పటి వరకు 128 కోట్లకుపైగా రాబట్టిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ.150 క్లబ్ వైపు పరుగులు పెడుతున్నది.

    కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో

    కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో

    తెలుగు రాష్ట్రేతర ప్రాంతాల్లో కర్ణాటకలో అల వైకుంఠపురంలో రూ.9.18 కోట్లు, కేరళలో రూ.1.17 కోట్లు, ఇతర రాష్ట్రాల్లో రూ.144 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.18.32 కోట్లు వసూలు చేసిది. దీంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.158 కోట్ల షేర్‌ను, 253 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ చిత్రం టాలీవుడ్‌లో అరుదైన రూ.300 కోట్ల క్లబ్‌వైపు దూసుకెళ్తున్నది.

    ప్రీ రిలీజ్ బిజినెస్‌ను మించి

    ప్రీ రిలీజ్ బిజినెస్‌ను మించి

    ఇక అల వైకుంఠపురంలో మూవీ బిజినెస్ విషయానికి వస్తే.. ప్రపంచవాప్యంగా రూ.85 కోట్ల మేర బిజినెస్ జరిగింది. అయితే మొదటి వారంలోనే ఈ మార్కును దాటినట్టు డిస్టిబ్యూటర్లతోపాటు ట్రేడ్ వర్గాలు ధృవీకరించాయి. బాహుబలి తర్వాత అంతటి వసూళ్లు సాధించిన చిత్రంగా అల వైకుంఠపురంలో టాలీవుడ్‌కి జోష్ నింపింది.

    English summary
    Stylish Star Allu Arjun's Ala vaikunthapurramuloo making rampage at box office. Allu Arjun entered first time in Rs.250 crores club.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X