twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాల్గో రోజూ అదే జోరు.. ఏడు చోట్ల నాన్ బాహుబలి రికార్డు

    |

    స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలిసి చేసిన మాయాజాలం అల వైకుంఠపురములో. సంక్రాంతి బరిలోకి దిగి.. పందెం కోడిలా విజృంభించి బాక్సాఫీస్ వద్ద నెగ్గింది. కలెక్షన్ల రికార్డుల్లో సరికొత్త పంథాను క్రియేట్ చేస్తోంది. ఈ మూవీ కంటే ఒక రోజు ముందు రిలీజ్ అయిన సరిలేరు నీకెవ్వరును అధిగమించేట్టు కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తోంది. అల వైకుంఠపురములో ధాటికి కొన్ని చోట్ల నాన్ బాహుబలి రికార్డులు నమోదు అవుతున్నాయి.

    ఇప్పటి వరకు ఎంతంటే..

    ఇప్పటి వరకు ఎంతంటే..

    ఇప్పటిదాకా అందిన రిపోర్ట్స్ ప్రకారం నాలుగో రోజు ముగిసే సరికి తెలుగు రాష్ట్రాల్లో ‘అల.. వైకుంఠపురములో' మూవీ 56.5 నుంచి 59 కోట్ల షేర్ రాబట్టిందని తెలిసింది. అలాగే వరల్డ్ వైడ్ టోటల్ షేర్ 71 నుంచి 74 కోట్లు అని తెలిసింది. అంతేకాకుండా విడుదలైన ప్రతీ చోట అంతకంతకూ ఆక్యుపెన్సీ పెరుగుతోందని, థియేటర్ల సంఖ్య కూడా పెరుగుతోందని తెలుస్తోంది.

    మల్టీప్లెక్సుల్లో ‘అల'దే హవా..

    మల్టీప్లెక్సుల్లో ‘అల'దే హవా..

    అన్ని మల్టీప్లెక్స్‌ల్లో అల వైకుంఠపురుములోదే హవా అని టాక్. పీవీఆర్,ఐనాక్స్, సినీపోలీస్ వంటి మాల్స్‌లో లెక్కలను పరిశీలిస్తే.. ఆదివారం 3.17కోట్లు, సోమవారం 2.24 కోట్లు, మంగళవారం 2.24కోట్లు, బుధవారం 2.55కోట్లు మొత్తంగా 10.20కోట్లు కలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది.

     తెలుగు రాష్ట్రాల్లో జెట్ స్పీడ్‌..

    తెలుగు రాష్ట్రాల్లో జెట్ స్పీడ్‌..

    తెలుగు రాష్ట్రాల్లో అయితే అల వైకుంఠపురములో చిత్రానిదే పై చేయి అని తెలుస్తోంది. సరిలేరు చిత్రం ఒకరోజు ముందు విడుదలైనా కూడా.. అల వైకుంఠపురములో మూవీ కలెక్షన్లే ఎక్కువగా ఉన్నాయని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో జెట్ స్పీడ్‌లో దూసుకుపోతోన్న అల వైకుంఠపురములో.. కొన్ని చోట్ల నాన్ బాహుబలి రికార్డులను క్రియేట్ చేసింది.

    Recommended Video

    భార్య స్నేహారెడ్డితో అల్లు అర్జున్ సంక్రాంతి సంబరాలు..!! వీడియో వైరల్
    ఏడో చోట్ల నాన్ బాహుబలి..

    ఏడో చోట్ల నాన్ బాహుబలి..

    తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతోన్న అల వైకుంఠపురములో నాల్గో రోజూ అంతే దూకుడును ప్రదర్శించింది. నాల్గో రోజు షేర్‌ను పరిగణలోకి తీసుకుంటే.. నిజాం, సీడెడ్, వైజాగ్, కృష్ణా, వెస్ట్, గుంటూరు, నెల్లూరు ఏరియాల్లో నాన్ బాహుబలి రికార్డులను క్రియేట్ చేసింది. ఈ దూకుడు చూస్తుంటే అల వైకుంఠపురములో ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు.

    English summary
    Ala vaikunthapurramuloo Created Non Bahubali Records On 4th Day Share In Seven Areas Across Telugu States. This Movie Is Directed By Trivikram And relaesed On 12th January.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X