'అల.. వైకుంఠపురములో' 50 రోజుల సునామీ: హాఫ్ సెంచరీ వసూళ్లు ఎలా ఉన్నాయంటే..
గతేడాది అభిమానులను నిరాశపర్చిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 2020 సంవత్సరానికి కిక్ స్టార్ట్ ఇచ్చారు. గత జ్ఞాపకాలన్నీ మరిపించేలా 'అల.. వైకుంఠపురములో' సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ సాధించారు. పలు రికార్డులు తిరగరాస్తూ కలెక్షన్ల సునామీ సృష్టించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ సినిమా సక్సెస్‌ఫుల్‌గా 50 రోజులు పూర్తిచేసుకుంది. మరి ఈ 50 రోజుల్లో అల్లు అర్జున్ వసూళ్లు ఎలా ఉన్నాయో చూద్దామా..

సక్సెస్‌ఫుల్ రన్.. తెలుగు చిత్రసీమలో మరో బ్లాక్‌బస్టర్
ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ తొలి షోతోనే సక్సెస్ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత రోజు రోజుకూ స్పీడ్ పెంచేస్తూ తెలుగు చిత్రసీమలో మరో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాగా నిలిచింది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకు నీరాజనాలు పలికారు. దీంతో విడుదలైన రోజు మొదలుకొని 50 రోజుల పాటు సక్సెస్‌ఫుల్ రన్ కొనసాగించింది.

పోటీ పడుతూ.. రికార్డులను చెరిపేస్తూ
ఇదే సంక్రాంతి కానుకగా విడుదలైన మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాతో పోటీ పడుతూనే పలు రికార్డులను చెరిపేస్తూ వచ్చింది 'అల.. వైకుంఠపురములో' మూవీ. నాన్ బాహుబలి రికార్డులన్నీ తన పేరిట లిఖించుకొని సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. దీంతో బన్నీ అభిమానుల్లో సరికొత్త ఉత్సాహం ఉరకలేస్తోంది.

50 రిపోర్ట్.. ఎంత రాబట్టిందో తెలుసా..?
విజయవంతమైన జర్నీ కొనసాగించిన 'అల.. వైకుంఠపురములో' ప్రపంచ వ్యాప్తంగా ఈ 50 రోజుల్లో 161.22 కోట్లా రూపాయలు వాసులు చేసింది. ఈ సినిమాతో పోటీపడిన సరిలేరు నీకెవ్వరు కలెక్షన్స్ 146.19 కోట్లు నమోదుకాగా అంతకుమించిన వసూళ్లు రాబట్టి సత్తా చాటింది 'అల.. వైకుంఠపురములో' సినిమా.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏరియా వైజ్ 50 డేస్ రిపోర్ట్..
‘అల వైకుంఠపురములో' మూవీ కలెక్షన్స్ వివరాలు ఏరియావైజ్‌గా చూసినట్లయితే..
నైజాం - 44.87
సీడెడ్ - 18.50 కోట్లు
ఉత్తరాంధ్ర - 19.84 కోట్లు
తూర్పు గోదావరి - 11.44 కోట్లు
పశ్చిమ గోదావరి - 8.93 కోట్లు
కృష్ణా - 10.84 కోట్లు
గుంటూరు - 11.14 కోట్లు
నెల్లూరు - 4.71 కోట్లు
AP/TG 22 డేస్ టోటల్ షేర్ - 131.02 కోట్లు.

ప్రపంచవ్యాప్తంగా చూస్తే..
కర్ణాటక - 9.23 కోట్లు
కేరళ- 1.17 కోట్లు
ఓవర్సీస్ - 18.35 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ షేర్ - 161.22 కోట్లు

‘అల వైకుంఠపురములో' ప్రీ రిలీజ్ బిజినెస్
‘అల వైకుంఠపురములో' చిత్రానికి 85 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఈ మార్క్ దాటేసి సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. ఏరియా వైజ్ చేస్తే నైజాం ఏరియాలో ‘అల వైకుంఠపురములో' వసూళ్లు ఎక్కువగా నమోదయ్యాయి.

‘అల వైకుంఠపురములో' మూవీ
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అల్లు అర్జున్ హీరోగా నటించగా ఆయన సరసన పూజా హెగ్డే ఆడిపాడింది. సుశాంత్, నివేతా పేతురాజ్, మురళి శర్మ, జయరాం, సచిన్, టబు కీలకపాత్రల్లో నటించి భేష్ అనిపించుకున్నారు.

తమన్ మ్యాజిక్.. మ్యూజిక్ సునామీ
కేవలం కలెక్షన్స్ పరంగానే గాక మ్యూజిక్ పరంగా కూడా సరికొత్త రికార్డులు సృష్టించింది అల.. వైకుంఠపురములో మూవీ. తమన్ అందించిన బాణీలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. ముఖ్యంగా ''రాములో రాములా, సామజవరగమన, బుట్ట బొమ్మ'' పాటలు సంగీత ప్రియుల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయేలా ఉన్నాయి.


Click it and Unblock the Notifications











