For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రంగస్థలం రికార్డులు అక్కడ గోవిందా.. రామ్ చరణ్‌ను వెనక్కి నెట్టిన బన్నీ

    |

    అల వైకుంఠపురములో సినిమా ఇప్పటికే ఎన్నో రికార్డులను బద్దలు కొట్టేసింది. సంక్రాంతి బరిలోకి దిగి.. వసూళ్లలో కొత్త చరిత్రను సృష్టిస్తోంది. సంక్రాంతి సీజన్ ముగిసినా.. కలెక్షన్ల సునామిని క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో నాన్ బాహుబలి రికార్డులన్నింటినీ బద్దలు కొట్టి.. ఇంకా సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతూనే ఉంది.

    ఇండస్ట్రీ హిట్..

    ఇండస్ట్రీ హిట్..

    మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాయాజాలం, అల్లు అర్జున్ స్టైలీష్ పర్ఫామెన్స్ అల వైకుంఠపురములో చిత్రాన్ని ఇండస్ట్రీ హిట్‌గా నిలబెట్టాయి. ఇక తమన్ అందించిన పాటల గురించి ప్రపంచం చెప్పుకుంటూనే ఉంది. ఈ చిత్రం మూడు వందల కోట్ల గ్రాస్‌ను కూడా చేరుకునే అవకాశముందని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు.

     తెలుగు రాష్ట్రాల్లో సంచలనం..

    తెలుగు రాష్ట్రాల్లో సంచలనం..

    అల వైకుంఠపురములో తెలుగు రాష్ట్రాల్లో కొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. ముఖ్యంగా నైజాంలో 40కోట్లను కొల్లగొట్టి.. బాహుబలి చిత్రాల రికార్డులను సమం చేసింది. మిగతా అన్ని ఏరియాల్లోనూ నాన్ బాహుబలి రికార్డులను క్రియేట్ చేసింది. దాదాపు 140కోట్ల షేర్‌ను కొల్లగొట్టి ఔరా అనిపించింది.

    ఓవర్సీస్ కింగ్..

    ఓవర్సీస్ కింగ్..

    మహేష్ బాబుకు ఓవర్సీస్‌లో మంచి పట్టు ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే. అయినా సరే ఈ సారి మాత్రం సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని వెనక్కి నెట్టేసి అల్లు అర్జున్ అల వైకుంఠపురములో దూసుకుపోయింది. మొదటి రోజే మిలియన్ డాలర్ల క్లబ్‌లోకి ఎంటరైంది. ఇప్పటికీ ఓవర్సీస్‌లో మంచి వసూళ్లనే రాబడుతోంది.

    రంగస్థలం రికార్డులు గోవిందా..

    రంగస్థలం రికార్డులు గోవిందా..

    రామ్ చరణ్ రంగస్థలం ఓవర్సీస్‌లో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 3.52మిలియన్ల డాలర్లను వసూళ్లు చేసి సంచలనం సృష్టించింది. రంగస్థలం టోటల్ రన్‌లో 3.52మిలియన్ డాలర్లను కలెక్ట్ చేయగా అల వైకుంఠపురములో నేడు ఆ రికార్డును బ్రేక్ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే మహేష్ బాబు భరత్ అనే నేను రికార్డులు తుడిచేసిన సంగతి తెలిసిందే.

    English summary
    Ala Vaikunthapurramuloo Beats Rangasthalam Records In Oversees. Trade Analysts Says That Ala Vaikunthapurramuloo Crosses $3.52 Millions,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X