అల.. వైకుంఠపురములో 15 డేస్ కలెక్షన్స్: నో బ్రేక్స్.. వసూళ్ల వరదే!! అల్లు అర్జున్ సునామీ
ఈ సంక్రాంతికి మొదలైన అల్లు అర్జున్ రికార్డుల వేట కొనసాగుతూనే ఉంది. ఆట ఆటకూ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ అన్ని ఫీట్స్ అలవోకగా అధిగమిస్తున్నారు ఈ స్టైలిష్ స్టార్. గత సినిమాతో కాస్త డీలా పడిన అల్లు అర్జున్ 'అల.. వైకుంఠపురములో' సినిమాతో ఆ జ్ఞాపకాలను చెరిపేశారు. జనవరి 12న ప్రేక్షకుల ముందుకొచ్చిన అల.. వైకుంఠపురములో మూవీ ఈ 15 రోజులు వసూళ్ల వరద పారించింది. వివరాల్లోకి పోతే..

అల్లు అర్జున్- త్రివిక్రమ్ హాట్రిక్ హిట్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్- మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సక్సెస్‌ఫుల్ కాంబో మరో హిట్ సాధించింది. 'అల.. వైకుంఠపురములో' సినిమాతో హాట్రిక్ హిట్ తమ ఖాతాలో వేసుకుంది ఈ జోడీ. ''జులాయి, s/o సత్యమూర్తి'' సినిమాల తర్వాత ఈ సినిమాతో సాలిడ్ కలెక్షన్స్ రాబడుతూ సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నారు. తొలి షో నుంచే పాజిటివ్‌గా వెళ్తున్న ఈ సినిమా అలవోకగా బ్రేక్ ఈవెన్ సాధించింది.

నో బ్రేక్స్.. రెండో వారంలోనూ అదే జోష్
తొలివారంలో సత్తా చాటిన 'అల.. వైకుంఠపురములో' సినిమా రెండో వారంలోనూ అదే జోష్ కంటిన్యూ చేసింది. వారం ముగియకముందే 200 కోట్ల గ్రాస్ వసూలు చేసి సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది. 'సరిలేరు నీకెవ్వరు' మూవీతో పాటు 'డిస్కో రాజా' సినిమాలతో పోటీ పడుతూ రెండో వారం ముగించేసింది.

మొత్తంగా ఈ 15 రోజుల్లో పరిస్థితి
దేశ విదేశాల్లో ఈ 15 రోజుల్లో పరిస్థితి చూస్తే.. ఏ ఒక్క రోజూ వసూళ్లలో డ్రాప్స్ కనిపించలేదు. ఆట ఆటకూ థియేటర్స్ వద్ద జనం కోలాహలం కనిపించింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో 'అల.. వైకుంఠపురములో' వసూళ్లు పుంజుకున్నాయి. మొత్తంగా 15 రోజుల్లో 116.44 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది 'అల.. వైకుంఠపురములో' మూవీ.

ఏరియావైజ్ డీటెయిల్ రిపోర్ట్
‘అల వైకుంఠపురములో' మూవీ కలెక్షన్స్ వివరాలు ఏరియావైజ్‌గా చూసినట్లయితే..
నైజాం - 38.32 కోట్లు
సీడెడ్ - 17.43 కోట్లు
గుంటూరు - 10.39 కోట్లు
ఉత్తరాంధ్ర - 17.62 కోట్లు
తూర్పు గోదావరి - 10.41 కోట్లు
పశ్చిమ గోదావరి - 8.04 కోట్లు
కృష్ణా - 9.99 కోట్లు
నెల్లూరు - 4.24 కోట్లు
AP/TG 15 డేస్ టోటల్ షేర్ - 116.44 కోట్లుగా ఉన్నాయి.

టాప్ 3లో అల్లు అర్జున్.. నాన్ బాహుబలి రికార్డ్స్
ఆంధ్ర, తెలంగాణలో టాప్-3 షేర్స్ తీసుకుంటే బాహుబలి- 2 (198.7 కోట్లు), అల వైకుంఠపురములో (116.44 కోట్లు), బాహుబలి (110.1 కోట్లు) వరుసగా ఉన్నాయి.
Recommended Video

‘అల వైకుంఠపురములో’ ప్రీ రిలీజ్ బిజినెస్
‘అల వైకుంఠపురములో' చిత్రానికి 85 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఈ మార్క్ దాటేసి బ్రేక్ ఈవెన్ సాధించింది. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన పూజ హెగ్డే నటించగా.. సుశాంత్, నివేతా పేతురాజ్, మురళి శర్మ, జయరాం, సచిన్, టబు కీలక పాత్రలు పోషించారు.


Click it and Unblock the Notifications











