Ala Vaikunthapurramuloo Day 13 box office Report : ఆగని ‘అల’... ఇప్పటి వరకు ఎంత లాభం వచ్చిందంటే..?
స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో చిత్రం వసూళ్ల ప్రభంజనాన్ని రెండోవారంలో కూడా కొనసాగిస్తోంది. ఇప్పటికే ఏపీ, తెలంగాణలోని కొన్ని ప్రదేశాల్లో నాన్ బాహుబలి రికార్డులను తిరగరాసిందని నిర్మాతలు ప్రకటించారు. ఇక సంక్రాంతి బరిలో వచ్చిన సరిలేరు నీకెవ్వరుతో కలిసి పోటాపోటీగా వసూళ్లను సాధించడం గమనార్హం. గత 13 రోజుల కలెక్షన్లు ఇలా ఉన్నాయి.

13వ రోజున కలెక్షన్లు
ఇక 13వ రోజున ఏపీ, తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో వసూలు చేసిన కలెక్షన్లు ఇలా ఉన్నాయి.
నైజాంలో రూ. 57లక్షలు
సీడెడ్‌లో రూ. 16లక్షలు
ఉత్తరాంధ్రలో రూ.26కోట్లు
తూర్పు గోదావరి జిల్లాలో రూ. 16లక్షలు
పశ్చిమ గోదావరి జిల్లాలో రూ. 13లక్షలు
గుంటూరులో రూ. 13 లక్షలు
కృష్ణా జిల్లాలో రూ.10లక్షలు
నెల్లూరులో రూ.7లక్షలు వసూలు చేసింది.

మొత్తం 13 రోజుల్లో
ఏపీ, తెలంగాణలో మొత్తం 13 రోజుల్లో
గత 9 రోజుల్లో అల వైకుంఠపురములో సాధించిన మొత్తం
నైజాంలో రూ.33.99 కోట్లు
సీడెడ్‌లో రూ.17.59 కోట్లు
వైజాగ్ 17.86కోట్లు
తూర్పు గోదావరి జిల్లాలో రూ.9.44 కోట్లు
పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.7.34 కోట్లు
గుంటూరులో రూ.9.68 కోట్లు
కృష్ణా జిల్లాలో రూ.8.52 కోట్లు
నెల్లూరులో రూ.3.92 కోట్లు వసూలు చేశాయి.

ప్రపంచవ్యాప్తంగా రూ. 137 కోట్ల షేర్
అల వైకుంఠపురములో చిత్రం 13వ రోజున భారీ వసూళ్లు సాధించడంతో రికార్డు వసూళ్లు నమోదయ్యాయి. వీకెండ్ కావడంతో మళ్లీ కలెక్షన్ల వేగం పుంజుకుంది. ఈ చిత్రం ఏపీ, తెలంగాణలో రూ.1.58 కోట్ల షేర్, ప్రపంచవ్యాప్తంగా రూ.1.80కోట్ల షేర్‌ను నమోదు చేసుకొన్నది. దీంతో ఈ చిత్రం 13 రోజుల్లో మొత్తంగా ఏపీ తెలంగాణలో రూ.111 కోట్ల షేర్, ప్రపంచవ్యాప్తంగా రూ.138.58 కోట్ల షేర్‌ను రాబట్టింది.

ఓవర్సీస్‌లో వసూళ్లు
ఇక ఏపీ, తెలంగాణేతర రాష్ట్రాల్లో కూడా అల వైకుంఠపురములో సత్తా చాటుతోంది. కర్ణాటకలో రూ.8.34 కోట్లు, కేరళలో 1.15కోట్లు,రెస్టాఫ్ ఇండియాలో 1.35కోట్లు, ఓవర్సీస్‌లో 16.78 కోట్లు వసూలు చేసింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా 138.62 కోట్ల షేర్, దాదాపు 220.80కోట్ల గ్రాస్‌ను రాబట్టినట్టు తెలుస్తోంది.

అల వైకుంఠపురములో ప్రీ రిలీజ్ బిజినెస్
అల వైకుంఠపురములో చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఇలా ఉన్నాయి..
నైజాంలో రూ.20 కోట్లు
సీడెడ్‌లో రూ.12.06 కోట్లు
ఉత్తరాంధ్రలో రూ.8.50 కోట్లు
తూర్పు గోదావరి జిల్లాలో రూ. 6.30 కోట్లు
పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.5 కోట్లు
గుంటూరులో రూ.6.30 కోట్లు
కృష్ణా జిల్లాలో రూ.5 కోట్లు
నెల్లూరులో రూ.2.78 కోట్లు
కర్ణాటకలో రూ.7.2 కోట్లు
కేరళ, రెస్టాఫ్ ఇండియా కలిపి 1.40కోట్లు
ఓవర్సీస్‌లో రూ.9.80 కోట్లుతో మొత్తంగా రూ.84 కోట్లకుపైగా బిజినెస్ నమోదైనట్టు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అయిన 85కోట్లను కొల్లగొట్టి.. దాదాపు 50కోట్లకు పైగా లాభాలను తెచ్చిపెట్టింది.


Click it and Unblock the Notifications











