వసూళ్ల సునామీని సృష్టిస్తోన్న బన్నీ.. తొమ్మిది రోజుల్లో ఎంత కొల్లగొట్టాడంటే..?
స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో చిత్రం వసూళ్ల ప్రభంజనాన్ని రెండోవారంలో కూడా కొనసాగిస్తోంది. ఇప్పటికే ఏపీ, తెలంగాణలోని కొన్ని ప్రదేశాల్లో నాన్ బాహుబలి రికార్డులను తిరగరాసిందని నిర్మాతలు ప్రకటించారు. ఇక సంక్రాంతి బరిలో వచ్చిన సరిలేరు నీకెవ్వరుతో కలిసి పోటాపోటీగా వసూళ్లను సాధించడం గమనార్హం. గత 9 రోజుల కలెక్షన్లు ఇలా ఉన్నాయి.

9వ రోజున కలెక్షన్లు
ఇక 9వ రోజున ఏపీ, తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో వసూలు చేసిన కలెక్షన్లు ఇలా ఉన్నాయి.
నైజాంలో రూ. 1.48 కోట్లు
సీడెడ్‌లో రూ. 66 లక్షలు
ఉత్తరాంధ్రలో రూ.96 కోట్లు
తూర్పు గోదావరి జిల్లాలో రూ. 52 లక్షలు
పశ్చిమ గోదావరి జిల్లాలో రూ. 39.3 లక్షలు
గుంటూరులో రూ. 39.7 లక్షలు
కృష్ణా జిల్లాలో రూ.45.4 లక్షలు
నెల్లూరులో రూ.19 లక్షలు వసూలు చేసింది.

మొత్తం 9 రోజుల్లో
ఏపీ, తెలంగాణలో మొత్తం 9 రోజుల్లో
గత 9 రోజుల్లో సరిలేరు నీకెవ్వరు సాధించిన మొత్తం
నైజాంలో రూ.33.99 కోట్లు
సీడెడ్‌లో రూ.17.59 కోట్లు
వైజాగ్ 17.86కోట్లు
తూర్పు గోదావరి జిల్లాలో రూ.9.44 కోట్లు
పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.7.34 కోట్లు
గుంటూరులో రూ.9.68 కోట్లు
కృష్ణా జిల్లాలో రూ.8.52 కోట్లు
నెల్లూరులో రూ.3.92 కోట్లు వసూలు చేశాయి.

ప్రపంచవ్యాప్తంగా రూ. 137 కోట్ల షేర్
అల వైకుంఠపురములో చిత్రం 9వ రోజున భారీ వసూళ్లు సాధించడంతో రికార్డు వసూళ్లు నమోదయ్యాయి. సోమవారం రోజున ఈ చిత్రం ఏపీ, తెలంగాణలో రూ.5.05 కోట్ల షేర్, ప్రపంచవ్యాప్తంగా రూ.6.18 కోట్ల షేర్‌ను నమోదు చేసుకొన్నది. దీంతో ఈ చిత్రం 9 రోజుల్లో మొత్తంగా ఏపీ తెలంగాణలో రూ.108 కోట్ల షేర్, ప్రపంచవ్యాప్తంగా రూ.137 కోట్ల షేర్‌ను రాబట్టింది.

ఓవర్సీస్‌లో వసూళ్లు
ఇక ఏపీ, తెలంగాణేతర రాష్ట్రాల్లో కూడా అల వైకుంఠపురములో సత్తా చాటుతోంది. కర్ణాటకలో రూ.10.55 కోట్లు, కేరళ,రెస్టాఫ్ ఇండియాలో 3.55కోట్లు, ఓవర్సీస్‌లో 11.95 కోట్లు వసూలు చేసింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా 137 కోట్ల షేర్, దాదాపు 200కోట్ల గ్రాస్‌ను రాబట్టినట్టు తెలుస్తోంది.
Recommended Video

సరిలేరు నీకెవ్వరు ప్రి రిలీజ్ బిజినెస్
సరిలేరు నీకెవ్వరు చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఇలా ఉన్నాయి..
నైజాంలో రూ.20 కోట్లు
సీడెడ్‌లో రూ.12.06 కోట్లు
ఉత్తరాంధ్రలో రూ.8.50 కోట్లు
తూర్పు గోదావరి జిల్లాలో రూ. 6.30 కోట్లు
పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.5 కోట్లు
గుంటూరులో రూ.6.30 కోట్లు
కృష్ణా జిల్లాలో రూ.5 కోట్లు
నెల్లూరులో రూ.2.78 కోట్లు
కర్ణాటకలో రూ.7.2 కోట్లు
కేరళ, రెస్టాఫ్ ఇండియా కలిపి 1.40కోట్లు
ఓవర్సీస్‌లో రూ.9.80 కోట్లుతో మొత్తంగా రూ.84 కోట్లకుపైగా బిజినెస్ నమోదైనట్టు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే ఈ చిత్రం వంద కోట్ల షేర్‌ను రాబట్టడంతో అన్ని ఏరియాల డిస్ట్రిబయూటర్లు హ్యాపీగా ఉన్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











