Just In
- 41 min ago
నాని హీరోయిన్.. మొత్తానికి పెద్ద హీరోనే పట్టేసింది
- 47 min ago
రాగిణి ద్వివేదికి మోక్షం.. ఎట్టకేలకు బెయిల్ మంజూరు
- 1 hr ago
ప్రభాస్ సినిమా సీక్రెట్స్ లీక్ చేసిన కృష్ణం రాజు: రిలీజ్ డేట్.. క్యారెక్టర్స్ ఇలా అన్నీ బయట పెట్టారు!
- 1 hr ago
రజనీకాంత్ మరో షాక్ ఇవ్వబోతున్నారా?.. సినిమాలను ఆపేసిన తలైవా.. ఆ దర్శకుడి తీరుతో అనుమానాలు
Don't Miss!
- News
దారుణం.. దళిత యువకులను చెట్టుకు కట్టేసి కొట్టారు... షాకింగ్ వీడియో..
- Finance
ఫ్యూచర్ గ్రూప్ డీల్, అమెజాన్‌కు షాక్: రిలయన్స్‌కు గుడ్‌న్యూస్, షేర్ జంప్
- Sports
IPL 2021లో అత్యధిక ధర అతనికే.. ఎవరూ ఊహించరు కూడా!!
- Automobiles
భారత్‌లో అడుగుపెట్టిన కొత్త బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్; ధర & వివరాలు
- Lifestyle
కాజల్ కౌగిలిలో కిచ్లూ ప్రతిరోజూ బంధి అయిపోవాల్సిందేనట...! రోజూ హగ్ చేసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఆట ఆటకీ రికార్డుల వేట.. వసూళ్ళలో కింగ్ అల్లు అర్జున్.. సరికొత్త ఫీట్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రికార్డుల వేట కొనసాగుతూనే ఉంది. ఆయన నటించిన తాజా సినిమా 'అల.. వైకుంఠపురములో' అన్ని ఏరియాల్లో సత్తా చాటుతూ గత రికార్డులు తిరగరాస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా అల్లు అర్జున్ మేనియానే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఓ ఏరియాలో అల్లు అర్జున్ సరికొత్త ఫీట్ సాధించారు. ఆ వివరాలేంటో చూద్దామా..

విమర్శకుల ప్రశంసలు.. కొత్త ఉత్సాహం
గత సినిమా 'నా పేరు సూర్య' రూపంలో డిజాస్టర్ తన ఖాతాలో వేసుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. 'అల.. వైకుంఠపురములో' సినిమాతో ఆ జ్ఞాపకాలను చెరిపేశారు. రికార్డుల మోత మోగిస్తూ అభిమానుల్లో కొత్త ఉత్సాహం నింపారు. కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ సంక్రాంతి విన్నర్‌గా నిలిచి విమర్శకుల ప్రశంసలందుకున్నారు బన్నీ.

దూకుడుగా బన్నీ.. సరికొత్త రికార్డ్స్
సంక్రాంతి కానుకగా విడుదలై మొదటి రోజే బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకుంది 'అల.. వైకుంఠపురములో' మూవీ. జనవరి 12 నుంచి నేటికీ దూకుడుగా వెళ్తోంది. దేశవిదేశాల్లో కలెక్షన్ల ప్రవాహం పారిస్తూ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. మొదటి రోజు నుంచి ఇప్పటిదాకా ఎక్కడా కలెక్షన్స్ డ్రాప్ కాకపోవడం విశేషం.

ఆట ఆటకీ రికార్డుల వేట.. ఆ ఏరియాలో
కర్నూల్ సిటీలో 'అల.. వైకుంఠపురములో' వసూళ్లు వరదై పారుతున్నాయి. ఇప్పటికే నాన్ బాహుబలి రికార్డ్స్ తిరగరాసిన ఈ సినిమా మొదటి 11 రోజుల్లో చిరంజీవి 'సైరా నరసింహా రెడ్డి' సినిమాను కూడా వెనక్కు నెట్టింది. కర్నూల్ సిటీలో 2 కోట్లు కొల్లగొట్టిన 3వ సినిమాగా రికార్డు నెలకొల్పింది.

చిరంజీవిని వెనక్కినెట్టి అల్లు అర్జున్
కర్నూల్ సిటీలో చిరంజీవి 'సైరా నరసింహా రెడ్డి' సినిమా 16 రోజుల్లో 2,00,22,704 రూపాయలు రాబట్టి నాన్ బాహుబలి రికార్డ్ నెలకొల్పింది. ఇప్పుడు అల్లు అర్జున్ 'అల.. వైకుంఠపురములో' మూవీ 11 రోజుల్లోనే 2,01,53,624 రూపాయలు రాబట్టి ఆ రికార్డును తన పేరిట లిఖించుకుంది. ఇదే ఏరియాలో బాహుబలి 2 మూవీ 9 రోజుల్లో 2,08,82,852 రూపాయలు రాబట్టింది.

త్రివిక్రమ్- అల్లు అర్జున్ హ్యాట్రిక్ హిట్.. ఆ దూకుడు చూస్తుంటే
జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత 'అల.. వైకుంఠపురములో' హ్యాట్రిక్ పూర్తి చేశారు త్రివిక్రమ్ శ్రీనివాస్- అల్లు అర్జున్. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా, టబు కీలక పాత్ర పోషించింది. బన్నీ దూకుడు చూస్తుంటే ఫుల్‌రన్‌లో మరిన్ని రికార్డులను తిరగరాసే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు.