twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాక్సాఫీస్‌పై అల వైకుంఠపురములో దాడి.. వారం రోజుల్లోనే నాన్ బాహుబలి రికార్డ్

    |

    మాటల మాంత్రికుడి మాయ, అల్లు అర్జున్ స్టైలీష్ పర్ఫామెన్స్‌తో వచ్చిన అల వైకుంఠపురములో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసేలా కనిపిస్తోంది. అన్ని ఏరియాల్లో అన్ని ఫార్మాట్లలో నాన్ బాహుబలి రికార్డులను క్రియేట్ చేసేలా కనిపిస్తోంది. ఇప్పటికే ఓవర్సీస్‌లో అల వైకుంఠపురుములో చిత్రం ఓ రేంజ్‌లో దూసుకుపోతూ ఉండగా.. వారం రోజులకు సంబంధించిన లెక్కలు చూస్తే ఎవ్వరికైనా దిమ్మతిరిగిపోవాల్సిందే. అల వైకుంఠపురములో బాక్సాఫీస్ వద్ద కురిపించిన ఏడు రోజుల వసూళ్లను ఓ సారి చూద్దాం..

    అన్నీ కలిసి రావడంతో..

    అన్నీ కలిసి రావడంతో..

    అల వైకుంఠపురములో చిత్రంపై ముందు నుంచి పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. తమన్ అందించిన సంగీతం ఈ సినిమాపై అంచనాలు పెంచేశాయి. త్రివిక్రమ్ స్టైల్ ఆఫ్ మేకింగ్, చాలా రోజుల తరువాత అల్లు అర్జున్ రావడం, టీజర్, ట్రైలర్ అన్నీ వర్కౌట్ కావడంతో పాటు సినిమాకు పాజిటివ్ టాక్ రావడం కూడా కలిసి వచ్చింది.

    బాక్సాఫీస్‌పై దాడి..

    సంక్రాంతి బరిలో ఒకరోజు ఆలస్యంగా దిగినా.. రేసులో మాత్రం అందరి కంటే ముందుంది. దర్బార్, సరిలేరు నీకెవ్వరు చిత్రాలను వెనక్కి నెట్టి వసూళ్లలో కొత్త ఒరవడిని సృష్టించింది. మొదటి రోజు (జనవరి 12) నుంచి బాక్సాఫీస్‌పై మొదలైన ఈ దాడి నేటికీ కొనసాగుతూనే ఉంది. ఈ వారం రోజుల్లో ఏ ఏరియాల్లో ఎంతెంత కొల్లగొట్టిందో ఓ సారి చూద్దాం.

    తెలుగు రాష్ట్రాల్లో..

    తెలుగు రాష్ట్రాల్లో..

    తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం భారీగానే కొల్లగొట్టినట్టు ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. నైజాం ఏరియాలో 28.84కోట్లు, సీడెడ్‌లో 15.45కోట్లు, వైజాక్ 15.01కోట్లు, గుంటూరు 8.58కోట్లు, ఈస్ట్ 8.12కోట్లు, వెస్ట్ 6.40కోట్లు, కృష్టా 7.40కోట్లు, నెల్లూరు 3.5కోట్లు వసూళ్లు చేసినట్టు తెలుస్తోంది. ఇలా మొత్తంగా ఈ వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 93.3కోట్లు కలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది.

    కర్ణాటక, రెస్టాఫ్ ఇండియాలో..

    కర్ణాటక, రెస్టాఫ్ ఇండియాలో..

    తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అల వైకుంఠపురములో విడుదల చేసిన అన్ని రాష్ట్రాల్లో మంచి వసూళ్లనే రాబడుతోంది. కర్ణాటకలో ఈ చిత్రం 9.3కోట్లు, తమిళ, కేరళ, రెస్టాఫ్ ఇండియా కలిసి ఈ చిత్రం.. 3.25కోట్లు కలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఇక ఓవర్సీస్‌లో అయితే 2.5మిలియన్ డాలర్లకు దగ్గర్లో ఉంది.

    నాన్ బాహుబలి రికార్డ్..

    నాన్ బాహుబలి రికార్డ్..

    ఇలా మొత్తంగా వారం రోజుల్లో ఈ చిత్రం 118కోట్ల షేర్‌ను, 180కోట్ల గ్రాస్‌ను రాబట్టి నాన్ బాహుబలి రికార్డులను క్రియేట్ చేసింది. ఇప్పటికీ హౌస్‌ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతోన్న అల వైకుంఠపురములో ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

    English summary
    Ala Vaikunthapurramuloo One Week Box Office Report. Ala Vaikunthapurramuloo Creating Non Bahubali Records. This Movie Is Collected 118 Crores Share And 180 Crores Gross In One Week.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X