Just In
- 39 min ago
రష్మిక బ్రేకప్ పై ఇంకా తగ్గని ప్రశ్నలు.. విజయ్ దేవరకొండ ఇచ్చిన జవాబుకు రిపోర్టర్ మైండ్ బ్లాక్
- 1 hr ago
2021 గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ .. ఇండియాలో కూడా లైవ్.. ఎప్పుడంటే?
- 1 hr ago
అరణ్య ట్రైలర్ ఎప్పుడంటే.. రచ్చ చేసేందుకు రానా రెడీ!
- 2 hrs ago
చిత్ర సీమలో విషాదం.. నిర్మాత మృతిపై నారా రోహిత్, సుధీర్ వర్మ ఎమోషనల్
Don't Miss!
- Sports
కొంచెం స్పిన్ అయితే చాలు ఏడుపు మొదలుపెడతారు.. మొతేరా పిచ్ విమర్శకులపై నాథన్ లయన్ ఫైర్!
- News
రాహుల్ భయ్యా! మీరు వెకేషన్లో ఉన్నారు: ‘మత్స్యశాఖ’ కామెంట్లపై అమిత్ షా సెటైర్లు
- Finance
9 కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.2.2 లక్షల కోట్లు డౌన్, రిలయన్స్ మాత్రమే అదరగొట్టింది
- Automobiles
అతి తక్కువ ధరకే బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్.. పూర్తి వివరాలు
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు ఫిబ్రవరి 28 నుండి మార్చి 6వ తేదీ వరకు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఐదో రోజూ ఆగని అల వైకుంఠపురములో.. దుమ్ముదులిపిన బన్నీ
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాయాజాలం, స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ స్టైలీష్ పర్ఫామెన్స్ అల వైకుంఠపురములో చిత్రాన్ని ఎక్కడో నిలబెట్టాయి. మిగిలిన సినిమాలకు కలెక్షన్లు తగ్గుతున్నట్టు కనిపిస్తున్నా.. 'అల' మాత్రం ఎగిసిపడుతూనే ఉంది. అన్నింటికంటే వెనకలా రిలీజ్ అయినా.. రేసులో లేటుగా జాయిన్ అయినా.. బాక్సాఫీస్ వద్ద మాత్రం మొదటి స్థానంలో నిల్చుంది. ఐదో రోజు అల వైకుంఠపురములో ఏ రేంజ్‌లో రాబట్టిందో ఓ సారి చూద్దాం..

మొదటి రోజు నుంచి..
అల వైకుంఠపురములో చిత్రం విడుదలకు ముందే బ్లాక్ బస్టర్ హిట్ అన్న నమ్మకాన్నికలిగింది. తమన్ అందించిన పాటలతో రెండు తెలుగు రాష్ట్రాలను షేక్ చేయగా.. త్రివిక్రమ్ తన మాటలతో, టేకింగ్ బాక్సాఫీస్‌ను వణికిస్తోంది. మొదటి రోజే ఈ చిత్రం దాదాపు 35 కోట్ల షేర్ రాబట్టి.. కలెక్షన్ల పరంగా కొత్త రికార్డులను క్రియేట్ చేస్తూనే ఉంది.

ఓవర్సీస్‌లో బన్నీ పై చేయి..
ఓవర్సీస్‌లో త్రివిక్రమ్‌కు భారీ ఫాలోయింగ్ ఉంటుంది. క్లాస్ చిత్రాలు, ఫ్యామిలీ ఎమోషన్స్ చిత్రీకరించడంలో త్రివిక్రమ్ శైలికి అక్కడ క్రేజ్ బాగానే ఉంది. అందుకే బరిలో చివర దిగినా.. కలెక్షన్లలో మాత్రం సరిలేరు, దర్బార్ వంటి చిత్రాలను వెనక్కి నెట్టేసింది. గురువారం సాయంత్రం నాటికి అందిన రిపోర్ట్స్ ప్రకారం అల వైకుంఠపురములో ముందంజలో ఉంది. అల వైకుంఠపురములో 1.88 మిలియన్ల డాలర్లను కలెక్ట్ చేయగా, సరిలేరు 1.82మిలియన్ డాలర్లను వసూళ్లు చేసింది.

ఐదో రోజూ అల ప్రభంజనం..
ఐదో రోజూ అల వైకుంఠపురములో సరిలేరు కంటే ఎక్కువగా వసూళ్లు చేసినట్టు తెలుస్తోంది. సరిలేరు ఆరో రోజు కలెక్షన్లు 9 నుంచి 10 కోట్ల మధ్య ఉండబోతోన్నట్టు సమాచారం. అదే సమయంలో అల వైకుంఠపురములో ఐదో రోజూ వసూళ్లు 10 నుంచి 11కోట్ల మధ్య ఉండొచ్చని టాక్.

95శాతం ఆక్యుపెన్సీతో..
మొదటి రెండు ఆటలకు కాస్త తగ్గినట్టు అనిపించిన ఫస్ట్ షో, సెకండ్ షోలకు విపరీతమైన ఆదరణ లభిస్తోందని, ఓవరాల్‌గా 95శాతం ఆక్యుపెన్సీతో దూసుకుపోతోందని తెలుస్తోంది. ఐదో రోజు ఈ చిత్రానికి వసూళ్ల పరంగా రెండు తెలుగు రాష్ట్రాల 9.5 నుంచి 10కోట్ల మధ్య ఉండగా.. ప్రపంచ వ్యాప్తంగా 10.6 నుంచి 11కోట్ల మధ్య ఉండబోతోందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మొత్తంగా ఇప్పటివరకు దాదాపు 96కోట్ల షేర్, 134కోట్ల గ్రాస్‌ను రాబట్టిందని టాక్.