twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఐదో రోజూ ఆగని అల వైకుంఠపురములో.. దుమ్ముదులిపిన బన్నీ

    |

    మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాయాజాలం, స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ స్టైలీష్ పర్ఫామెన్స్ అల వైకుంఠపురములో చిత్రాన్ని ఎక్కడో నిలబెట్టాయి. మిగిలిన సినిమాలకు కలెక్షన్లు తగ్గుతున్నట్టు కనిపిస్తున్నా.. 'అల' మాత్రం ఎగిసిపడుతూనే ఉంది. అన్నింటికంటే వెనకలా రిలీజ్ అయినా.. రేసులో లేటుగా జాయిన్ అయినా.. బాక్సాఫీస్ వద్ద మాత్రం మొదటి స్థానంలో నిల్చుంది. ఐదో రోజు అల వైకుంఠపురములో ఏ రేంజ్‌లో రాబట్టిందో ఓ సారి చూద్దాం..

    మొదటి రోజు నుంచి..

    మొదటి రోజు నుంచి..

    అల వైకుంఠపురములో చిత్రం విడుదలకు ముందే బ్లాక్ బస్టర్ హిట్ అన్న నమ్మకాన్నికలిగింది. తమన్ అందించిన పాటలతో రెండు తెలుగు రాష్ట్రాలను షేక్ చేయగా.. త్రివిక్రమ్ తన మాటలతో, టేకింగ్ బాక్సాఫీస్‌ను వణికిస్తోంది. మొదటి రోజే ఈ చిత్రం దాదాపు 35 కోట్ల షేర్ రాబట్టి.. కలెక్షన్ల పరంగా కొత్త రికార్డులను క్రియేట్ చేస్తూనే ఉంది.

    ఓవర్సీస్‌లో బన్నీ పై చేయి..

    ఓవర్సీస్‌లో బన్నీ పై చేయి..


    ఓవర్సీస్‌లో త్రివిక్రమ్‌కు భారీ ఫాలోయింగ్ ఉంటుంది. క్లాస్ చిత్రాలు, ఫ్యామిలీ ఎమోషన్స్ చిత్రీకరించడంలో త్రివిక్రమ్ శైలికి అక్కడ క్రేజ్ బాగానే ఉంది. అందుకే బరిలో చివర దిగినా.. కలెక్షన్లలో మాత్రం సరిలేరు, దర్బార్ వంటి చిత్రాలను వెనక్కి నెట్టేసింది. గురువారం సాయంత్రం నాటికి అందిన రిపోర్ట్స్ ప్రకారం అల వైకుంఠపురములో ముందంజలో ఉంది. అల వైకుంఠపురములో 1.88 మిలియన్ల డాలర్లను కలెక్ట్ చేయగా, సరిలేరు 1.82మిలియన్ డాలర్లను వసూళ్లు చేసింది.

    ఐదో రోజూ అల ప్రభంజనం..

    ఐదో రోజూ అల ప్రభంజనం..


    ఐదో రోజూ అల వైకుంఠపురములో సరిలేరు కంటే ఎక్కువగా వసూళ్లు చేసినట్టు తెలుస్తోంది. సరిలేరు ఆరో రోజు కలెక్షన్లు 9 నుంచి 10 కోట్ల మధ్య ఉండబోతోన్నట్టు సమాచారం. అదే సమయంలో అల వైకుంఠపురములో ఐదో రోజూ వసూళ్లు 10 నుంచి 11కోట్ల మధ్య ఉండొచ్చని టాక్.

    Recommended Video

    Allu Arjun Excellent Speech At Ala Vaikunthapurramloo Success Meet
    95శాతం ఆక్యుపెన్సీతో..

    95శాతం ఆక్యుపెన్సీతో..


    మొదటి రెండు ఆటలకు కాస్త తగ్గినట్టు అనిపించిన ఫస్ట్ షో, సెకండ్ షోలకు విపరీతమైన ఆదరణ లభిస్తోందని, ఓవరాల్‌గా 95శాతం ఆక్యుపెన్సీతో దూసుకుపోతోందని తెలుస్తోంది. ఐదో రోజు ఈ చిత్రానికి వసూళ్ల పరంగా రెండు తెలుగు రాష్ట్రాల 9.5 నుంచి 10కోట్ల మధ్య ఉండగా.. ప్రపంచ వ్యాప్తంగా 10.6 నుంచి 11కోట్ల మధ్య ఉండబోతోందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మొత్తంగా ఇప్పటివరకు దాదాపు 96కోట్ల షేర్, 134కోట్ల గ్రాస్‌ను రాబట్టిందని టాక్.

    English summary
    Ala Vaikunthapurramuloo World Wide Day 5 Box Office Report. This Movie Is Top At Overseas Box Office Which Is released On 12th January.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X