Alappuzha Gymkhana Collections: అలపుజా జింఖానాకు రికార్డు కలెక్షన్లు.. మమ్ముట్టిని వెనక్కి నెట్టి ఎన్ని కోట్లం
మలయాళంలో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన అలపుజా జింఖానా సినిమా ఏప్రిల్ 10వ తేదీన రిలీజై ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయం సాధిస్తున్నది. ప్రేమలు ఫేమ్ నెల్సన్, లక్మణ్ అవరన్, గణపతి, షైన్ టామ్ ఛాకో, కొట్టాయం నజీర్ నటించిన ఈ సినిమాకు ఖాలీద్ రెహ్మాన్ రచించి దర్శకత్వం వహించారు. ఈ సినిమాను ఖాలీద్ రెహ్మన్, జాబిన్ జార్జ్, సమీర్ కారత్, సబీష్ కన్నన్ చెర్రీ నిర్మించారు. ఈ సినిమా గత 6 రోజులుగా వసూళ్లను భారీగా రాబడుతున్నది. ఈ సినిమాకు సంబంధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
అలపుజా జింఖానా సినిమాకు జిమిషి ఖాలీద్ సినిమాటోగ్రఫి, విష్ణు విజయ్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమాకు నిషద్ యూసఫ్ ఎడిటర్‌గా వ్యవహరించారు. ప్లాన్ బీ మోషన్ పిక్చర్స్, రిలీస్టిక్ స్టూడియోస్ సంయుక్తంగా ఈ సినిమాను రూపొందించాయి. ఈ సినిమాను సుమారుగా 15 కోట్ల రూపాయల వ్యయంతో తెరకెక్కించారు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా 10 కోట్ల షేర్, 20 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఈ సినిమాను రూపొందించారు.

అలపుజా జింఖానా చిత్రం తొలి రోజు నుంచే స్టార్ హీరోల సినిమాలను ఎదురించి కలెక్షన్లను సాధిస్తున్నది. ఈ సినిమా తొలి రోజు 2.65 కోట్లు, రెండో రోజు 2.8 కోట్ల రూపాయలు, 3వ రోజు 3.5 కోట్ల రూపాయలు, 4వ రోజు 3.65 కోట్లు, 5వ రోజు ఈ సినిమా 3.5 కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 5 రోజుల్లో సుమారుగా 15 కోట్ల రూపాయలకుపైగా వసూళ్లను మలయాళంలో సాధించింది.
ఈ సినిమా కేవలం కేరళలోనే కాకుండా విదేశాల్లో కూడా మంచి స్పందనను రాబట్టింది. దాంతో ఓవర్సీస్ మార్కెట్‌లో భారీ కలెక్షన్లు నమోదు అయ్యాయి. ఓవర్సీస్‌లో ఈ సినిమా గత 5 రోజుల్లో 10 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ చిత్రం కేరళ, ఓవర్సీస్ మార్కెట్‌లో కలిపి ఈ చిత్రం 25 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని సాక్‌నిల్క్ సంస్థ వెల్లడించింది. ఈ సినిమా ఇప్పటికే 30 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిందని పేర్కొన్నది.
ఇదిలా ఉండగా, మంగళవారం 6వ రోజున కూడా ఈ చిత్రం భారీ వసూళ్లను సాధించే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ చిత్రం కేరళలో 2.5 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 1 కోటి రూపాయలు వసూలు చేస్తుందనే విషయాన్ని సాక్ నిల్క్ వెల్లడించింది. దాంతో ఈ సినిమా 28 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టి.. 50 కోట్ల మైలురాయి వైపు వేగంగా పరుగులు పెడుతున్నట్టు కనిపిస్తున్నది.
ఇక కేరళలో అలపుజా జింఖానా సినిమాతో పోటీ పడుతూ మమ్ముట్టి నటించిన బజూకా చిత్రం బాక్సాఫీస్ వద్ద నువ్వా? నేనా అనే విధంగా వసూళ్లను రాబడుతున్నది. బజుకా చిత్రం గత 6 రోజుల్లో 20 కోట్ల రూపాయలకుపైగా వసూళ్లను సాధించింది. దాంతో ఈ సినిమా అలపుజా జింఖానాతో పోటీ పడుతుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











