మహేష్ బాబుకు షాక్.. ఓవర్సీస్‌లో సరిలేరును దాటేసిన అల వైకుంఠపురములో
ఓవర్సీస్ మార్కెట్‌ను మకుటం లేని మారాజుగా ఏలుతున్నాడు. వరుసగా మిలియన్ల క్లబ్‌లో జాయిన్ అవుతూ దక్షిణాదిని మరే హీరోకు అందని ఫీట్‌ను సాధించాడు. మహేష్ నటించిన పది చిత్రాలు ఓవర్సీస్‌లో మిలియన్ క్లబ్‌లో చేరాయి. మహేష్ చిత్రాలకు ఓవర్సీస్‌లో గిరాకీ ఎక్కువగా ఉండటం..సరిలేరు చిత్రం మంచి అంచనాలే ఉండటంతో రికార్డులు బద్దలవ్వడం ఖాయమని అంతా భావించారు. కానీ అల వైకుంఠపురములో రూపంలో సరిలేరుకు పెద్ద దెబ్బ తగిలేట్టు కనిపిస్తోంది.

సరిలేరుకు బ్రేక్ వేసిన అల..
మహేష్ బాబుకు ఉన్న ఓవర్సీస్ ట్రాక్ రికార్డ్ దృష్ట్యా..సరిలేరు కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందని అంతా భావించారు. దానికి తగ్గట్టే కేవలం ప్రీమియర్లు, ఫస్ట్ డే కలెక్షన్లతోనే మిలియన్ క్లబ్ లోకి చేరిపోయింది అక్కడి వరకు బాగానే.. ఉన్నా అల వైకుంటపురములో రిలీజ్ అయ్యాక పరిస్థితి తారుమారైంది. సరిలేరు కలెక్షన్లకు అల పెద్ద గండికొట్టినట్టు తెలుస్తోంది.

క్లాస్‌కు ఓటేస్తోన్న ఆడియెన్న్..
త్రివిక్రమ్‌కు ఓవర్సీస్‌లో మంచి మార్కెట్ ఉండటం.. అక్కడి ప్రేక్షకులు క్లాస్ మూవీస్‌కే ఓటేయడం లాంటివి అల వైకుంఠపురములో చిత్రానికి కలిసి వచ్చాయి. దీంతో ఈ చిత్రానికి ఆదరణ పెరుగుతూ వస్తోంది. ఈ క్రమంలోనే ఒకరోజు ముందు విడుదలైన సరిలేరు కంటే.. అల వైకుంఠపురములో చిత్రమే వసూళ్లలో పై చేయి సాధించింది.
సరిలేరును బీట్ చేసిన అల..
సరిలేరు చిత్రం మొదటి రోజే మిలియన్ క్లబ్‌లోకి రీచ్ అయినా.. అక్కడి నుంచి కాస్త స్లో అవుతూ వచ్చింది. అదే సమయంలో అల వైకుంఠపురములో చిత్రానికి కలెక్షన్లు పెరుగుతూ వచ్చాయి. తమిళ ఆడియెన్స్ కూడా ఈ రెండు చిత్రాలకే ఓటేయడంతో వసూళ్లు కూడా గణనీయంగా పెరుగుతున్నాయని తెలుస్తోంది. తాజాగా అందిన రిపోర్ట్ ప్రకారం.. సరిలేరును అల వైకుంఠపురములో బీట్ చేసిందని టాక్.

చిన్నపాటి తేడాతో..
ఈ రెండు చిత్రాలు ఇప్పటి వరకు పోటాపోటీగా దూసుకుపోతుండగా.. ఒకరోజు వెనక వచ్చిన అల వైకుంఠపురములో సరిలేరును క్రాస్ చేసిందని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాలా ట్వీట్ చేశాడు. అల వైకుంఠపురములో 1.88 మిలియన్ల డాలర్లను కలెక్ట్ చేయగా, సరిలేరు 1.82మిలియన్ డాలర్లను వసూళ్లు చేసినట్టు తెలిపాడు.


Click it and Unblock the Notifications











