Gangubai Kathiawadi Collections నిలకడగా బాక్సాఫీస్ పోరు.. 100 కోట్ల వైపు పరుగులు!
బాలీవుడ్‌లో టాలెంటెడ్ హీరోయిన్ అలియాభట్ నటించిన గంగూభాయ్ చిత్రం నిలకడగా వసూళ్లను సాధిస్తూ ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నది. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన ఈ బయోపిక్ చిత్రం బాలీవుడ్ బాక్సాఫీస్‌కు జోష్ పెంచే ప్రయత్నం చేస్తున్నది. అయితే ఈ సినిమా కలెక్షన్లు అంచనాలకు తగినట్టుగా లేకపోయినప్పటికీ. నిరాశజనకంగా లేకపోవడం గమనార్హం. అయితే గత నాలుగు రోజుల గంగూభాయ్ కతియావాడి సినిమా కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే..

రెండున్నర ఏళుగా బాలీవుడ్‌కు గడ్డుపరిస్థితి
గత రెండున్నర ఏళ్లుగా బాలీవుడ్ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నది. కోవిడ్ పరిస్థితుల కారణంగా ముంబై మహానగరంతోపాటు మహారాష్ట్ర అల్లాడిపోయింది. ఏకధాటిగా రెండు సంవత్సరాలపాటు కోవిడ్ కఠిన ఆంక్షలు కొనసాగడంతో సినిమా రిలీజ్‌లు వాయిదా పడ్డాయి. అయితే మూడో వేవ్ తర్వాత ఇప్పుడే షూటింగులతోను, రిలీజ్‌లతో హిందీ పరిశ్రమ ఊపందుకొనే ప్రయత్నం చేస్తున్నది.

మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై నవల ఆధారంగా
బాలీవుడ్‌లో నెలకొన్న నిరాశజనక పరిస్థితుల నేపథ్యంలో ఆలియాభట్ నటించిన గంగూభాయ్ కతియవాడి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రముఖ రచయిత హుస్సేన్ జైదీ రాసిన మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై అనే నవల ఆధారంగా కామటిపురలో గంగూభాయ్ కోతేవాలి అలియాస్ గంగుభాయ్ హర్జివందాస్ అనే వేశ్య, మాఫియా క్వీన్ జీవితంలోని వాస్తవ సంఘటనల ఆధారంగా గంగూభాయ్ కతియావాడి సినిమాను తెరక్కించారు.

నాలుగు రోజుల్లో 50 కోట్ల వసూళ్లు
గంగూభాయ్ కతియావాడి ఫిబ్రవరి 25 తేదీన రిలీజ్ అయింది. తొలి రోజున దేశవ్యాప్తంగా భారీ ఒపెనింగ్స్ సాధించింది. తొలి రోజున 10.50 కోట్లు, శనివారం 13.32 కోట్లు, ఆదివారం 15.30 కోట్లు, సోమవారం 8.19 కోట్లు వసూళ్లను సాధించింది. గత నాలుగు రోజుల్లో 47.31 కోట్లు రాబట్టింది. ఇటీవల కాలంలో సినిమాకు లిట్మస్ టెస్ట్‌గా మారిన సోమవారం రోజున స్ట్రాంగ్‌గా వసూళ్లను రాబట్టడం సానుకూలంగా మారింది అంటూ ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

సరికొత్త మైలురాయి వైపు
ఇక ఐదో రోజున గంగూభాయ్ కతియావాడి చిత్రం రూ.50 కోట్ల క్లబ్‌లోకి చేరేందుకు రంగం సిద్ధమైంది. మంగళవారం మహాశివరాత్రి కావడంతో గంగూభాయ్ కలెక్షన్లు భారీగా ఉండే అవకాశం ఉంది. జాగారం సందర్భంగా సెకండ్, ప్రత్యేక షోలకు ప్రేక్షకులు పోటెత్తే అవకాశం ఉంది. దీంతో ఈ సినిమా 100 కోట్ల క్లబ్‌పై దృష్టి సారించే అవకాశం ఉంది.

వారాంతానికి 100 కోట్లు?
ఇక గంగూభాయ్ కలెక్షన్లు నిలకడగా నమోదు అవుతుండటం, ఇదే ఊపు ఈ వారం కూడా కొనసాగిస్తే.. 100 కోట్ల క్లబ్‌లో చేరడం కష్టం కాకపోవచ్చనే అభిప్రాయం ట్రేడ్ వర్గాలు వ్యక్తమవుతున్నది. ఒకవేళ ఈ వారాంతానికి 100 కోట్లు సాధిస్తే.. లాక్‌డౌన్ తర్వాత ఈ రేంజ్‌లో కలెక్షన్లు సాధించిన చిత్రంగా ఓ రికార్డును క్రియేట్ చేసే అవకాశం ఉంది.

ఐదో రోజు కలెక్షన్ల అంచనా
అలాగే గంగూభాయ్ కతియవాడి ఐదో రోజు కలెక్షన్ల అంచనా ఈ విధంగా ఉంది. మంగళవారం మార్చి 1వ తేదీ సెలవు దినం కావడంతో ఈ సినిమా 6 నుంచి 8 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉంది. దాంతో ఈ సినిమా మొత్తంగా 55 కోట్లకు చేరువయ్యే ఛాన్స్ ఉంది. ఈ చిత్రం రానున్నది రోజుల్లో 100 కోట్ల క్లబ్‌లో చేరుతుందా? లేదా అనే విషయాన్ని వేచి చూడాల్సిందే..


Click it and Unblock the Notifications











