Alia Bhatt Vs Tripti Dimri: ఆలియా టాప్ లేపిన త్రిప్తి డిమ్రీ.. ఈ స్టార్ హీరోయిన్ల మూవీకి ఎన్ని కోట్ల కలెక్షన్ల
బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇద్దరు స్టార్ హీరోయిన్లు తడఖా చూపిస్తున్నారు. అందులో ఒకరు ఆలియా భట్ కాగా, మరొకరు త్రిప్తి డిమ్రి. ఆలియా నటించిన జిగ్రా సినిమా, అలాగే త్రిప్తి డిమ్రీ ప్రధాన పాత్రలో నటించిన వికీ,విద్యా కా వో వాలా వీడియో ఒకే రోజు రిలీజ్ కలెక్షన్లపరంగా పోటీ పడుతున్నాయి. హీరోయిన్ ఓరియెంటెడ్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ రెండు సినిమాల బడ్జెట్, బ్రేక్ ఈవెన్ టార్గెట్, కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
జిగ్రా విషయానికి వస్తే.. యువ హీరో వేదాంగ్ రైనా ప్రధాన పాత్రలో నటించిన జిగ్రా చిత్రం 90 కోట్ల రూపాయల వ్యయంతో రూపొందింది. ఈ సినిమాను కరణ్ జోహర్ నిర్మాణ సారథ్యంలో ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందింది. ఈ సినిమాను 2000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఇక రాజ్ కుమార్ రావ్ నటించిన వికీ విద్యా కా ఓ వాలా వీడియో సుమారుగా 60 కోట్ల రూపాయలతో రూపొందింది. ఈ

జిగ్రా సినిమా విషయానికి వస్తే.. ఈ మూవీ తొలి రోజు 4.5 కోట్లు నికరంగా, రెండో రోజు 6.5 కోట్ల రూపాయలు, మూడో రోజు ఈ సినిమా 5.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ మూడు రోజుల్లో ఈ సినిమా 16.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక ఈ సినిమా 4వ రోజున 2.5 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దాంతో ఈ సినిమా 19 కోట్ల రూపాయలు రాబట్టే అవకాశం ఉంది.
ఇక వికీ విద్యా కా ఓ వాలా వీడియో విషయానికి వస్తే.. ఈ చిత్రం సుమారుగా 60 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమాను సుమారుగా 2000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ లక్ష్యం సుమారుగా 60 కోట్ల రూపాయలుగా నిర్ణయించారు. ఈ మూవీ గ్రాండ్‌గా ఓపెనింగ్స్ సాధించి బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది.

త్రిప్తి డిమ్రీ నటించిన ఈ సినిమా ఇండియాలో తొలి రోజు 5.5 కోట్లు, రెండో రోజు 7 కోట్లు, మూడో రోజు 6.5 కోట్లు వసూలు చేసింది. మూడు రోజుల్లో 19 కోట్లు వసూలు చేసింది. ఇక ఈ సినిమా 4వ రోజు 3 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ మూవీ 4 రోజుల్లో సుమారుగా 22 కోట్ల రూపాయలు కలెక్ట్ చేస్తుందని పేర్కొన్నారు.
బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఈ రెండు చిత్రాలు తమ సత్తాను చాటేందుకు పోటీ పడుతున్నాయి. అయితే తొలివారాంతంలో భారీగానే వసూలు చేశాయి. అయితే తొలివారాంతం తర్వాత నిలకడగా వసూళ్లు సాధిస్తే.. బ్రేక్ ఈవెన్ దిశగా అడుగులేసే ఛాన్స్ ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











