బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న హనుమాన్.. నార్త్ అమెరికాలో రికార్డు వసూళ్లు రాబట్టిన టాప్ 10 తెలుగు చిత్రాలివే!
తేజా సజ్జా హీరోగా, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన తాజా సినిమా హనుమాన్ గురించి అందిరకీ తెలిసిందే. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12వ తేదీన విడుదల అయిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద బారీ ప్రభంజనం సృష్టిస్తోంది. ముందుగా తక్కువ థియేటర్లలో మాత్రమే విడుదల అయిన ఈ సినిమా థియేటర్ల సంఖ్యను పెంచుకుంటూ పోతోంది. అలాగే ఎవరూ ఊహించని స్థాయిలో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా రికార్డులు క్రియేట్ చేస్తోంది. నార్త్ అమెరికాలో అత్యధిక వసూళ్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. నాలుగు రోజుల్లోనే 3 మిలినయ్లకు పైగా వసూళ్లు చేపట్టింది. అయితే ఇప్పటి వరకు నార్త్ అమెరికాలో హైయెస్ట్ గ్రాస్ వసూళ్లు రాబట్టిన టాప్ 10 తెలుగు చిత్రాలు ఏవో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
నార్త్ అమెరికాలో సెన్సేషన్ క్రియేట్ చేసి భారీ వసూళ్లు రాబట్టుకున్న టాప్ 1 తెలుగు చిత్రం బాహుబలి 2. ప్రభాస్ హీరోగా దర్శకధీరుడు రాజమౌళి తెరెకక్కించిన ఈ సినిమా 20 మిలియన్ డాలర్లు రాబట్టుకుంది. ఇక ఆ తర్వాత స్థానంలో ఆర్ఆర్ఆర్ సినిమా నిలిచింది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన ఈ చిత్రానికి కూడా రాజమౌళియే దర్శకత్వం వహించారు. అయితే 14.3 మిలియన్ డాలర్లు రాబట్టుకుని ఆర్ఆర్ఆర్ సినిమా టాప్ 2 లోకి వచ్చేసింది.

ఇక ఆ తర్వాతి స్థానంలో అంటే టాప్ 3లో సలార్ నిలిచింది. ప్రభాస్ హీరోగా వచ్చిన ఈ సనిమాకు స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. శృతి హాసన్ హీరోయిన్ గా చేయగా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టుకుంది. నార్త్ అమెరికాలోనే 8.9 మిలియన్ డాలర్లు రాబట్టుకుంది. ఇక టాప్ 4లో ప్రభాస్ హీరోగా చేసిన బాహుబలి 1 సినిమా నిలిచింది. రానా దగ్గుబాటి, ప్రభాస్ ల కాంబోలో జక్కన్న తీసిన ఈ సినిమాకు నార్త్ అమెరికాలో 8 మిలియన్ డాలర్ల వసూళ్లు వచ్చాయి.
ఇక ఆ తర్వాత స్థానంలో అంటే టాప్ 5లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా చేసిన అల వైకుంఠపురంలో సినిమా నిలిచింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా చేసింది. సూపర్ డూపర్ హిట్టుగా నిలిచిన ఈ సినిమా నార్త్ అమెరికాలో 3.6 మిలియన్ డాలర్లు రాబట్టుకుంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా చేసిన రంగస్థలం సినిమా టాప్ 6లో నిలిచింది. సుకుమార్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా చేయగా.. నార్త్ అమెరికాలోనే 3.5 మిలియన్ డాలర్లు రాబట్టుకుంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా చేసిన భరత్ అనే నేను సినిమా కూడా 3.4 మిలియన్ల డాలర్లు రాబట్టుకుని టాప్ 7గా రికార్డు క్రియేట్ చేసింది. ఆ తర్వాత ప్రభాస్ హీరోగా చేసిన సాహో సినిమా 3.2 మిలియన్ల డాలర్లు సాధించి టాప్ 8లో నిలిచింది. ప్రభాస్ హీరోగా, కృతి సనన్ హీరోయిన్ గా వచ్చిన ఆదిపురుష్ సినిమా 3.1 మిలియన్ల డాలర్లు వసూలు చేసుకుని టాప్ 9లో స్థానం సంపాదించుకుంది. కేవలం నాలుగు రోజుల్లో 3 మిలియన్ల డాలర్లు సంపాదించుకుని హనుమాన్ టాప్ 10 గా నిలిచింది. మరో వారం రోజుల్లో హనుమాన్ మరింత పైకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.


Click it and Unblock the Notifications











