Don't Miss!
- Sports PBKS vs MI: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ!
- News ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
Box office: అల్లరి నరేష్ 'బంగారు బుల్లోడు' మొదటి రోజు కలెక్షన్స్.. నిజంగా ఇది పెద్ద షాక్!
కామెడీ సినిమాలతో ట్రెండ్ సెట్ చేసి ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న అల్లరి నరేష్ మధ్యమధ్యలో కొన్ని డిఫరెంట్ సినిమాలు కూడా చేసేవాడు. అప్పట్లో గమ్యం సినిమా అతనికి మాంచి గుర్తింపును అంధించింది. అయితే నరేష్ గత కొంత కాలంగా వరుస అపజయాలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇక మొత్తానికి బంగారు బుల్లోడు సినిమాతో శనివారం ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. ఇక ఆ సినిమా మొదటి రోజు బాక్సాఫీస్ కలెక్షన్స్ వివరాల్లోకి వెళితే..
Recommended Video
హిట్టు చూసి చాలా కాలమైంది
చాలా కాలంగా ఎలాంటి సినిమా చేసినా కూడా ఈ హీరోకు కలిసి రావడం లేదు. అప్పుడెప్పుడో సుడిగాడు సినిమాతో బాక్సాఫీస్ హిట్ కొట్టిన నరేష్ ఇంతవరకు సరైన సక్సెస్ చూడలేదు. దీంతో ఎలాగైనా ఈ సారి సక్సెస్ అందుకోవాలని కొన్ని విభిన్నమైన కథలను ఎంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక కమర్షియల్ కామెడీ కథ బంగారు బుల్లోడు శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
పోటీ ఎక్కువగా ఉండడం
బంగారు బుల్లోడు సినిమా కూడా గత ఏడాది రిలీజ్ కావాల్సింది. కానీ అనుకోకుండా కరోనా రావడం వలన వాయిదా పడుతూ వచ్చింది. ఇక సంక్రాంతి భరిలోనే సినిమాను రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ అప్పుడు పోటీ ఎక్కువగా ఉండడం వలన రిస్క్ చేయలేకపోయారు. ఇక సినిమా జనవరి 23న విడుదలైంది.
డల్ గా మొదలైన కలెక్షన్స్
తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 450కి పైగా థియేటర్స్ లో విడుదలైనప్పటికి సినిమా మొదటిరోజు కలెక్షన్స్ చాలా తక్కువగానే వచ్చాయి. సినిమాకు పాజిటివ్ టాక్ కూడా పెద్దగా ఏమి రాలేదు. పైగా సంక్రాంతి హాలిడేస్ అనంతరం విడుదలైన సినిమా కాబట్టి కలెక్షన్స్ అందుకునేందుకు ఏ విధంగాను అవకాశం కలగలేదు.
మొదటి రోజు వచ్చిన మొత్తం కలెక్షన్స్ ఎంతంటే..
తెలుగు రాష్ట్రాల్లో సినిమా మొదటిరోజు మొత్తం అందుకున్న షేర్స్ 67లక్షలు మాత్రమే. ఇక గ్రాస్ కలెక్షన్స్ 1.1కోట్లు రావడం గమనార్హం. ఇటీవల కాలంలో విడుదలైన సినిమాల్లో ఈ సినిమానే అతి తక్కువ ఓపెనింగ్స్ అందుకుంది. ఒకవైపు క్రాక్, రెడ్ సినిమాల జోరు ఇంకా తగ్గకపోవడం కూడా ప్రభావం చూపించింది. మరి శని ఆదివారం రోజులు సినిమా కలెక్షన్స్ ఇంకా ఏ స్థాయిలో ఉంటాయో చూడాలి.