Don't Miss!
- News
Leader: రూ. 100కే అందరికి బ్లూఫిల్మ్ చూపించిన గొప్ప లీడర్ ఆ మాజీ మంత్రి, అంతు చూస్తా, చాలెంజ్!
- Sports
పాపం సర్ఫరాజ్‌ఖాన్.. సెలెక్టర్ల బాక్స్ బద్దలు కొట్టినా ఎంపికవ్వలేదు: రవిచంద్రన్ అశ్విన్
- Lifestyle
సంబంధంలో సాన్నిహిత్యం, నమ్మకాన్ని పెంపొందించడానికి చిట్కాలు
- Finance
household income: భారతీయ కుటుంబాలపై సర్వే.. ఆదాయం, పొదుపులు ఎంతో తెలుసా ?
- Technology
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- Automobiles
భారతీయ మార్కెట్లో Hero XOOM ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: ప్రైస్, వేరియంట్స్ & కలర్ ఆప్సన్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
Itlu Maredumilli Prajaneekam day 1 Collections అంచనాలు మించని అల్లరి నరేష్ మూవీ.. తొలి రోజు ఎంత వసూలంటే?
ఓటు హక్కు, ప్రజాస్వామ్య విలువలు, ప్రభుత్వాలు, ఉద్యోగుల పనితీరును ప్రశ్నిస్తూ రూపొందిన చిత్రం ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం. నాంది తర్వాత కామెడీ పాత్రలను దూరంగా ఉంటూ అల్లరి నరేష్ చేసిన మరో విభిన్నమైన చిత్రం ఇది. ఏఆర్ మోహన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం రిలీజ్‌కు ముందు మంచి క్రేజ్ తెచ్చుకొన్నది. దాంతో ఈ సినిమాపై భారీగానే ఆసక్తి పెరిగింది. ఇలాంటి అంచనాల మధ్య రిలీజైన ఈ చిత్రం తొలి రోజు ఎంత మేరకు కలెక్షన్లు సాధించిందంటే?

ప్రీ రిలీజ్ బిజినెస్ వ్యాల్యూ
ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా విషయానికి వస్తే.. ఈ మూవీ నిర్మాణంలో జీ తెలుగు భాగస్వామిగా ఉంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ జీ సొంతం చేసుకొన్నది. అయితే థియేట్రికల్ రైట్స్‌ను 4.5 కోట్లుగా లెక్క కట్టారు. దాంతో ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. కనీసం 5 కోట్ల వసూళ్లు సాధించాల్సి ఉంటుంది.

వరల్డ్ వైడ్ థియేటర్ కౌంట్
ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం మూవీ రిలీజ్, థియేటర్ కౌంట్ విషయానికి వస్తే.. ప్రపంచవ్యాప్తంగా భారీగానే రిలీజ్ చేశారు. నైజాంలో 150 స్క్రీన్లకుపైగా, సీడెడ్‌లో 60 స్క్రీన్లకుపైగా, ఆంధ్రాలో 180 స్క్రీన్లకుపైగా రిలీజ్ చేశారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఈ చిత్రం సుమారు 400 థియేటర్లలో రిలీజ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా 510 థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

లవ్ టుడే, తోడేలు నుంచి పోటీ
ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా ఆక్యుపెన్సీ విషయానికి వస్తే.. ఈ మూవీకి ఉన్న క్రేజ్‌ను బట్టి చూస్తే.. కనబడాల్సినంత ఆక్యుపెన్సీ కనిపించలేదు. లవ్ టుడే, తోడేలు సినిమాలు ఈ సినిమాకు గట్టి పోటీగా మారాయి. అయినప్పటికీ.. పోటీని ఎదుర్కొన్ని బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్‌గానే కనిపించింది.

ఆక్యుపెన్సీ ఎలా ఉందంటే?
తెలుగు రాష్ట్రాల్లో ఆక్యుపెన్సీ విషయానికి వస్తే.. తెలంగాణలో మహబూబ్ నగర్లో 35 శాతం, హైదరాబాద్, వరంగల్‌లో మంచి రెస్పాన్స్ లభించింది. ఏపీలో పెద్దగా ఈ సినిమాకు అంతంత మాత్రంగానే ఆక్యుపెన్సీ కనిపించింది. ఓవరాల్‌గా 30 శాతం ఆక్యుపెన్సీతో సరిపెట్టుకొన్నది. ఇక మౌత్ టాక్‌తో శనివారం రెండో రోజున బాక్సాఫీస్ రిపోర్టు మెరుగ్గా ఉండే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

తొలి రోజు కలెక్షన్లు ఎంతంటే?
ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 35 లక్షల షేర్ సాధించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల విషయానికి వస్తే.. 45 లక్షల షేర్, 80 లక్షలకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.