Naandhi 10 Days Collections: బాక్సాఫీస్‌పై అల్లరి నరేష్ దండయాత్ర.. ‘నాంది’కి ఎంత లాభం వచ్చిందంటే!

దిగ్గజ దర్శకుడి కుమారుడిగా సినిమాల్లోకి ప్రవేశించినప్పటికీ.. తనకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటీని సంపాదించుకున్నాడు విలక్షణ హీరో నరేష్. 'అల్లరి' అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అతడు.. అప్పటి నుంచి వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ వచ్చాడు. తద్వారా తక్కువ సమయంలోనే యాభై చిత్రాలను పూర్తి చేశాడు. ఇక, కామెడీ హీరోగా పేరొందిన ఈ టాల్ హీరో.. మధ్యలో కొన్ని ప్రయోగాత్మక చిత్రాలనూ చేశాడు. అందులో 'నాంది' ఒకటి. పది రోజుల క్రితం విడుదలైన ఈ మూవీతో నరేష్ మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. ఈ సినిమా బాక్సాఫీస్ రిపోర్టు మీకోసం!

‘నాంది' పలికిన నరేష్.. వాళ్లతో కలిసి ఇలా

‘నాంది' పలికిన నరేష్.. వాళ్లతో కలిసి ఇలా

కామెడీ హీరోగా పేరొందినప్పటికీ.. అప్పుడప్పుడూ యాక్టింగ్ స్కోప్ ఉన్న చిత్రాల్లోనూ నటించి మెప్పించాడు అల్లరి నరేష్. ఈ క్రమంలోనే విజయ్ కనకమేడల దర్శకత్వంలో 'నాంది' అనే సినిమాలోనూ నటించాడు. క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాను సతీష్ వేగేశ్న నిర్మించారు. వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర పోషించిన ఈ సినిమాకు శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు.

కొత్తగా ట్రై చేశాడు... బంపర్ హిట్ కొట్టేశాడు

కొత్తగా ట్రై చేశాడు... బంపర్ హిట్ కొట్టేశాడు

అల్లరి నరేష్‌కు ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా మార్కెట్ దక్కడం లేదనే చెప్పాలి. అయినప్పటికీ 'నాంది' ఫస్ట్ లుక్‌లో బట్టలు లేకుండా కనిపించి షాకిచ్చాడు. దీనికి తోడు టీజర్, ట్రైలర్‌తో సినిమాపై బజ్ ఏర్పడింది. దీంతో నైజాం రూ. కోటి, సీడెడ్ రూ. 30 లక్షలు, ఆంధ్రా రూ. 1.20 కోట్లు, ఓవర్సీస్ రూ. 20 లక్షలుతో మొత్తంగా ఈ మూవీకి రూ. 2.70 కోట్ల వ్యాపారం జరిగింది.

పోటీ ఉన్నా నరేష్ ‘వన్ మ్యాన్ షో' అనేలా

పోటీ ఉన్నా నరేష్ ‘వన్ మ్యాన్ షో' అనేలా

ఎన్నో అంచనాల నడుమ 'నాంది' మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనితో పాటే మరో మూడు సినిమాలు అదే రోజు రిలీజ్ అయ్యాయి. 'ఉప్పెన' ప్రభావం కూడా ఇంకా ఉంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఈ సినిమా రిజల్ట్‌పై అనుమానాలు వచ్చాయి. కానీ, ఊహించని విధంగా అల్లరి నరేష్ వన్ మ్యాన్ షోతో సినిమాను హిట్ చేసుకున్నాడు. తద్వారా కలెక్షన్లను కూడా అందుకున్నాడు.

 పదో రోజు నాంది ఎంత వసూలు చేసింది?

పదో రోజు నాంది ఎంత వసూలు చేసింది?

'నాంది' పదో రోజు మరింతగా పుంజుకుంది. తద్వారా ఆదివారం నైజాంలో రూ. 16 లక్షలు, సీడెడ్‌లో రూ. 5.2 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 8 లక్షలు, ఈస్ట్‌లో రూ. 4 లక్షలు, వెస్ట్‌లో రూ. 3 లక్షలు, గుంటూరులో రూ. 4.40 లక్షలు, కృష్ణా రూ. 4.30 లక్షలు, నెల్లూరులో రూ. 2.40 లక్షలు వసూలు చేసింది. ఓవరాల్‌గా రూ. 47 లక్షలు షేర్, రూ. 80 లక్షలు గ్రాస్ రాబట్టి సత్తా చాటింది.

10 రోజులకు మొత్తం ఎంత రాబట్టిందంటే?

10 రోజులకు మొత్తం ఎంత రాబట్టిందంటే?

గత వారం నితిన్ 'చెక్', 'అక్షర' వంటి సినిమాలు రిలీజ్ అయినప్పటికీ నాంది పదో రోజు బాగా పుంజుకుంది. తద్వారా పది రోజులకు కలిపి తెలుగు రాష్ట్రాల్లో రూ. 4.18 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 15 లక్షలు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 10 లక్షలు సహా ప్రపంచ వ్యాప్తంగా రూ. 4.43 కోట్లు షేర్, రూ. 8.20 కోట్లు గ్రాస్ రాబట్టింది. దీంతో నరేష్ తన కెరీర్‌లోనే మంచి ఫిగర్స్‌ను అందుకున్నట్లైంది.

‘నాంది'కి మొత్తం ఎంత లాభం వచ్చిందంటే!

‘నాంది'కి మొత్తం ఎంత లాభం వచ్చిందంటే!

ప్రపంచ వ్యాప్తంగా 'నాంది' సినిమాకు రూ. 2.70 కోట్ల వ్యాపారం జరగడంతో.. బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను రూ. 3 కోట్లుగా నిర్ణయించుకున్నారు. ఇక, పది రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 4.43 కోట్లు వసూలు చేసింది. అంటే ఇప్పటి వరకు నరేష్ సినిమాకు రూ. 1.43 కోట్లు లాభం వచ్చింది. పది రోజులైనా ఈ మూవీ హవా చూపిస్తుండడంతో పెట్టుబడికి డబుల్ వచ్చే ఛాన్స్‌ కూడా ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X