Naandhi 3rd Collections: ఒక్కసారిగా పెరిగిన నాంది కలెక్షన్స్.. ఎంత వస్తే హిట్ అవుతుందంటే!

తెలుగు సినీ ఇండస్ట్రీలోని హీరోలందరికీ ప్రత్యేకమైన శైలి ఉంది. ఒక్కో జోనర్‌లో ఒక్కొక్కరు తమ మార్క్‌ను చూపిస్తుంటారు. ఇలా.. కెరీర్ ఆరంభం నుంచే హాస్య ప్రధానమైన సినిమాలు చేస్తూ కామెడీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు అల్లరి నరేష్. చాలా తక్కువ సమయంలోనే యాభైకి పైగా సినిమాల్లో నటించిన అతడు.. ఎన్నో విజయాలను అందుకున్నాడు. అయితే, 2012లో వచ్చిన 'సుడిగాడు' తర్వాత హిట్‌ను కొట్టలేకపోయాడు. ఈ పరిస్థితుల్లో తన పంథాను మార్చుకుని 'నాంది' అనే సీరియస్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ మూవీ బాక్సాఫీస్ రిపోర్టు మీకోసం!

Recommended Video

Naandhi Box Office Report | Break Even Target For Allari Naresh Movie | Filmibeat Telugu

నేచురల్ బ్యూటీ సాక్షి అగర్వాల్ లేటేస్ట్ ఫోటోలు..

కొత్త కెరీర్‌కు ‘నాంది' పలికిన అల్లరి నరేష్

కొత్త కెరీర్‌కు ‘నాంది' పలికిన అల్లరి నరేష్

కామెడీ హీరోగా పేరొందిన అల్లరి నరేష్.. అప్పుడప్పుడూ ప్రయోగాత్మక చిత్రాల్లోనూ నటించి మెప్పించాడు. ఈ క్రమంలోనే విజయ్ కనకమేడల దర్శకత్వంలో 'నాంది' అనే సినిమాలోనూ నటించాడు. క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాను సతీష్ వేగేశ్న నిర్మించారు. వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర పోషించిన ఈ సినిమాకు శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు.

ఆ ఒక్క లుక్‌తో మారింది.. బాగా జరిగింది

ఆ ఒక్క లుక్‌తో మారింది.. బాగా జరిగింది

ఓ మూస ధోరణిలో కామెడీ చిత్రాలను చేస్తూ వస్తున్నాడు అల్లరి నరేష్. ఇలాంటి పరిస్థితుల్లో 'నాంది' ఫస్ట్ లుక్‌లో బట్టలు లేకుండా కనిపించి షాకిచ్చాడు. దీనికి తోడు టీజర్, ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. దీంతో నైజాం రూ. కోటి, సీడెడ్ రూ. 30 లక్షలు, ఆంధ్రా రూ. 1.20 కోట్లు, ఓవర్సీస్ రూ. 20 లక్షలు సహా మొత్తంగా ఈ మూవీకి రూ. 2.70 కోట్ల వ్యాపారం జరిగింది.

నాలుగు సినిమాలు పోటీ.. నరేష్ మార్క్‌తో

నాలుగు సినిమాలు పోటీ.. నరేష్ మార్క్‌తో

గత శుక్రవారం 'నాంది' మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనితో పాటే మరో మూడు సినిమాలు అదే రోజు రిలీజ్ అయ్యాయి. 'ఉప్పెన' ప్రభావం కూడా ఇంకా ఉంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఈ సినిమా బిజినెస్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. కానీ, ఊహించని విధంగా అల్లరి నరేష్ వన్ మ్యాన్ షోతో సినిమాను హిట్ చేసుకున్నాడు. తద్వారా కలెక్షన్లను కూడా రాబట్టుకుంటున్నాడు.

మూడో రోజు నాంది మూవీ కలెక్షన్స్ ఎంత?

మూడో రోజు నాంది మూవీ కలెక్షన్స్ ఎంత?

'నాంది' మూడో రోజు భారీగా పుంజుకుంది. తద్వారా ఆదివారం నైజాంలో రూ. 47 లక్షలు, సీడెడ్‌లో రూ. 15 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 6.2 లక్షలు, ఈస్ట్‌లో రూ. 8.2 లక్షలు, వెస్ట్‌లో రూ. 5.5 లక్షలు, గుంటూరులో రూ. 8.4 లక్షలు, కృష్ణా రూ. 9 లక్షలు, నెల్లూరులో రూ. 4.8 లక్షలు వసూలు చేసింది. ఓవరాల్‌గా రూ. 1.04 కోట్లు షేర్, రూ. 1.91 కోట్లు గ్రాస్ రాబట్టి సత్తా చాటింది.

ఇప్పటి వరకు ఎంత వసూలు చేసిందంటే?

ఇప్పటి వరకు ఎంత వసూలు చేసిందంటే?

మూడు సినిమాలతో పాటు విడుదలైన 'నాంది' క్రమ క్రమంగా పుంజుకుంటోంది. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 45 లక్షలు, రెండో రోజు రూ. 65 లక్షలు, మూడో రోజు రూ. 1.04 కోట్లతో మొత్తంగా రూ. 2.14 కోట్లు షేర్, రూ. 3.86 కోట్లు గ్రాస్ అందుకుంది. ఇక, ఓవర్సీస్‌లో రూ. 8 లక్షలు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 6 లక్షలు సహా ప్రపంచ వ్యాప్తంగా రూ. 2.28 కోట్లు రాబట్టింది.

బ్రేక్ ఈవెన్‌ను దాటాలంటే ఎంత రాబట్టాలి?

బ్రేక్ ఈవెన్‌ను దాటాలంటే ఎంత రాబట్టాలి?

ప్రపంచ వ్యాప్తంగా 'నాంది'కి రూ. 2.70 కోట్ల వ్యాపారం జరగడంతో.. బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను రూ. 3 కోట్లుగా నిర్ణయించుకున్నారు. ఇక, మూడు రోజుల్లో ఈ సినిమా రూ. 2.28 కోట్లు వసూలు చేసింది. అంటే మరో రూ. 72 లక్షలు కలెక్ట్ చేస్తే హిట్ చిత్రంగా నిలుస్తుంది. సినిమాకు హిట్ టాక్ రావడంతో పాటు క్రమంగా రెస్పాన్స్ పెంచుకుంటుండడంతో టార్గెట్ రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X