Naandhi 5 days collections: 9 ఏళ్ళ తరువాత దక్కిన విజయం.. టార్గెట్ పూర్తి చేసిన నరేష్!
చాలా కాలం తరువాత నాంది సినిమాతో అసలైన బాక్సాఫీస్ హిట్ అందుకున్నాడు నరేష్. ఫస్ట్ లుక్, టీజర్ నుంచే సినిమా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తూ వచ్చింది. నాంది సరికొత్త థ్రిల్లర్ గా రావడంతో ఆడియెన్స్ ఈజీగా కనెక్ట్ అయ్యారు. మొత్తానికి బాక్సాఫీస్ వద్ద నరేష్ కు ఒక నిజమైన గెలువు దక్కిందనే చెప్పాలి. ఎన్నో ఏళ్లుగా ఈ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇక సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను కూడా ఫినిష్ చేసింది.. ఆ వివరాల్లోకి వెళితే..
మీరెప్పుడూ చూడని శ్రీముఖి బ్యూటీఫుల్ ఫోటోలు.. లేటేస్ట్ ఫోటోషూట్ వైరల్

గత 9 ఏళ్ళుగా లేని విజయం..
కామెడీ డైరెక్టర్ ఈవివి సత్యనారాయణ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అల్లరి నరేష్ మొదట్లో అతి తక్కువ కాలంలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్నాడు. అప్పట్లో ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద మినిమమ్ వసూళ్లను అందుకునేవి. నరేష్ తో సినిమా అంటే నిర్మాతలు ఎలాంటి టెన్షన్ లేకుండా ఉండేవారు. అలాంటి హీరో గత 9 ఏళ్లుగా హిట్స్ లేకుండా ఉన్నాడు.

ఫామ్ లోకి వచ్చిన నరేష్
నరేష్ చివరగా సుడిగాడు సినిమాతో హిట్ అందుకున్నాడు. ఆ సినిమా తరువాత వచ్చిన ఏ సినిమా కూడా సరైన బూస్ట్ ఇవ్వలేదు. ఇక మొత్తానికి నాంది సినిమాతో నరేష్ ఫామ్ లోకి వచ్చేశాడు. ఈ సినిమా గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మొదటి రోజు డీసెంట్ ఓపెనింగ్స్ అందుకున్న నాంది ఆ తరువాత రోజు నుంచి పాజిటివ్ టాక్ తో ట్రాక్ లోకి వచ్చేసింది.

5వ రోజు వచ్చిన కలెక్షన్స్
ఇక సినిమా నాలుగు రోజుల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ కు అతికొద్ది దూరంలో ఆగి ఐదవ రోజు అనుకున్న పని పూర్తి చేసుకుంది. నాంది 5వ రోజు కలెక్షన్స్(షేర్స్) విషయానికి వస్తే.. నైజాం 11లక్షలు, సీడెడ్ 3లక్షలు, ఉత్తరాంధ్ర 4లక్షలు, ఈస్ట్ 3లక్షలు, వెస్ట్ 2.4లక్షలు, గుంటూరు 3.4లక్షలు, కృష్ణా 3లక్షలు, నెల్లూరు 2లక్షలు. ఏపీ తెలంగాణలో నరేష్ నాంది మొత్తం అందుకున్న షేర్స్ 0.31కోట్లు.

5రోజుల్లో మొత్తం వరల్డ్ వైడ్ కలెక్షన్స్
నాంది మూవీ 5రోజుల్లో అనుకున్న బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను పూర్తి చేసింది. సినిమా 2.7కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి 3కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో మార్కెట్ లోకి వచ్చింది. ఇక 5రోజుల్లో ఆ టార్గెట్ ను అందుకొని వరల్డ్ వైడ్ గా 3.07కోట్ల షేర్స్ ను అందుకుంది. గ్రాస్ కలెక్షన్స్ 5.50కోట్లు. ప్రస్తుతం 0.07కోట్లతో సినిమా ప్రాఫిట్ జోన్ లో కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications











