Naandhi 8 Days Collections: ఒక్కసారిగా పుంజుకున్న నాంది.. నరేష్ మూవీకి ఎంత లాభం వచ్చిందంటే!
కెరీర్ ఆరంభం నుంచే హాస్య ప్రధానమైన సినిమాలు చేస్తూ కామెడీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు అల్లరి నరేష్. జయాపజయాలతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా ప్రాజెక్టులు చేసుకుంటూ వచ్చిన అతడు.. తక్కువ కాలంలోనే ఏకంగా యాభైకి పైగా సినిమాల్లో నటించాడు. ఎక్కువ శాతం కామెడీ చిత్రాల్లో నటించిన అతడు.. మధ్య మధ్యలో పాత్రకు ప్రాధాన్యం ఉన్న సీరియస్ సినిమాలనూ చేశాడు. తద్వారా నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం 'నాంది' అనే మూవీ చేశాడు. ఈ సినిమా ఎనిమిది రోజుల బాక్సాఫీస్ రిపోర్టు మీ అందరి కోసం!

తన కెరీర్ మార్పునకు నాంది పలికిన నరేష్
వరుసగా కామెడీ చిత్రాలనే చేస్తూ పరాజయాలను ఎదుర్కొంటున్నాడు నరేష్. ఈ క్రమంలోనే ప్రయోగాత్మక చిత్రం చేయాలన్న ఉద్దేశంతో విజయ్ కనకమేడల దర్శకత్వంలో 'నాంది' అనే సినిమాలోనూ నటించాడు. క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాను సతీష్ వేగేశ్న నిర్మించారు. వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర పోషించిన ఈ సినిమాకు శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు.

రిస్క్ చేసిన నరేష్... ప్రీ రిలీజ్ బిజినెస్ అలా
యాక్టింగ్ స్కోప్ ఉన్న పాత్రల్లోనూ సత్తా చాటుతానని గతంలోనే నిరూపించాడు నరేష్. ఇక, 'నాంది' ఫస్ట్ లుక్‌లో బట్టలు లేకుండా కనిపించి షాకిచ్చాడు. దీనికి తోడు టీజర్, ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు పెరిగాయి. దీంతో నైజాం రూ. కోటి, సీడెడ్ రూ. 30 లక్షలు, ఆంధ్రా రూ. 1.20 కోట్లు, ఓవర్సీస్ రూ. 20 లక్షలు సహా మొత్తంగా ఈ మూవీకి రూ. 2.70 కోట్ల వ్యాపారం జరిగింది.

వాటన్నింటినీ తట్టుకుని నిలబడిన ‘నాంది’
గత వారం 'నాంది' మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనితో పాటే మరో మూడు సినిమాలు అదే రోజు రిలీజ్ అయ్యాయి. 'ఉప్పెన' ప్రభావం కూడా ఇంకా ఉంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఈ సినిమా బిజినెస్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. కానీ, ఊహించని విధంగా అల్లరి నరేష్ వన్ మ్యాన్ షోతో సినిమాను హిట్ చేసుకున్నాడు. తద్వారా కలెక్షన్లను కూడా రాబట్టుకుంటున్నాడు.

8వ రోజు నాంది మూవీ కలెక్షన్స్ ఎంతంటే?
'నాంది' ఎనిమిదో రోజు అనూహ్యంగా పుంజుకుంది. తద్వారా శుక్రవారం నైజాంలో రూ. 6 లక్షలు, సీడెడ్‌లో రూ. 2 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 2.20 లక్షలు, ఈస్ట్‌లో రూ. 1.70 లక్షలు, వెస్ట్‌లో రూ. 1.10 లక్షలు, గుంటూరులో రూ. 1.60 లక్షలు, కృష్ణా రూ. 1.80 లక్షలు, నెల్లూరులో రూ. 70 వేలు వసూలు చేసింది. ఓవరాల్‌గా రూ. 17 లక్షలు షేర్, రూ. 34 లక్షలు గ్రాస్ రాబట్టి సత్తా చాటింది.

8 రోజులకు ఎంత వసూలు చేసిందో తెలుసా?
మూడు సినిమాలతో పాటు విడుదలైన 'నాంది' క్రమ క్రమంగా పుంజుకుంటూ వచ్చింది. ఇక, ఈ వారం నితిన్ 'చెక్', 'అక్షర' వంటి సినిమాలు రిలీజ్ అయినప్పటికీ శుక్రవారం బాగానే రాబట్టింది. 8 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ. 3.44 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 12 లక్షలు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 8 లక్షలు సహా ప్రపంచ వ్యాప్తంగా రూ. 3.64 కోట్లు షేర్, రూ. 6.75 కోట్లు గ్రాస్ రాబట్టింది.

నరేష్ సినిమాకు ఎంత లాభం వచ్చిందంటే!
ప్రపంచ వ్యాప్తంగా 'నాంది'కి రూ. 2.70 కోట్ల వ్యాపారం జరగడంతో.. బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను రూ. 3 కోట్లుగా నిర్ణయించుకున్నారు. ఇక, ఎనిమిది రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 3.64 కోట్లు వసూలు చేసింది. అంటే ఇప్పటి వరకు నరేష్ సినిమాకు రూ. 64 లక్షలు లాభం వచ్చింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం.. ప్రాఫిట్ రూ. కోటి వరకూ చేరుకునే అవకాశాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications











