Naandhi closing collections: నరేష్ సినిమాకు మొత్తం వచ్చిన బాక్సాఫీస్ ప్రాఫిట్స్ ఎంతంటే?
వరుస డిజాస్టర్స్ తో గత 8 ఏళ్ల నుంచి సతమతమైన అల్లరి నరేష్ కు మొత్తానికి నాంది సినిమా మంచి బూస్ట్ ఇచ్చింది. ఆ సినిమా ఇచ్చిన సక్సెస్ తో నరేష్ మార్కెట్ మళ్ళీ తిరిగొచ్చింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాకు సంబంధించిన వార్తలు చాలానే వైరల్ అయ్యాయి. అగ్ర దర్శక నిర్మాతల నుంచి కూడా నరేష్ చేసిన ప్రయోగానికి ప్రశంసలు అందాయి. ఇక ఫైనల్ గా సినిమా నిన్నటితో బాక్సాఫీస్ వద్ద పోటీని ముగించుకుంది. సినిమాకు వచ్చిన క్లోజింగ్ కలెక్షన్స్ పై ఒక లుక్కేస్తే..

వాయిదా పడుతూ వచ్చింది..
గత ఏడాది ప్రేక్షకుల ముందుకు రావాల్సిన నాంది సినిమా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచే చిత్ర యూనిట్ పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. చట్టంలోని లోపాలను , రూల్స్ ను తెలియజేస్తూ ఎమోషనల్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి లాభాలను అందుకుంది.

నాంది పోరాటం ముగిసింది
నాంది సినిమా ఫిబ్రవరి 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ గురువారం కొత్త సినిమాల హడావుడి. ఎక్కువవ్వడంతో నిన్నటితో సినిమా థియేట్రికల్ రన్ క్లోజ్ అయ్యింది. ఇక టోటల్ కలెక్షన్స్ లెక్కలపై కూడా అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి. ఫైనల్ గా నిర్మాతకు ఈ సినిమా మంచి ప్రాఫిట్స్ ను అందించింది.

పోటీగా హిట్టు సినిమాలున్నా కూడా
మొదటి రోజు డీసెంట్ గా 45లక్షల షేర్స్ అందుకున్న నాంది ఆ తరువాత పాజిటివ్ టాక్ తో మొదటి ఆదివారం కోటికి పైగా షేర్స్ ను రాబట్టింది. ఇక పోటీగా మరికొన్ని సినిమాలు ఉన్నా కూడా ఓ వర్గం ఆడియెన్స్ నుంచి నరేష్ సినిమాకు పాజిటివ్ బజ్ రావడంతో రోజురోజుకు కలెక్షన్స్ పెరుగుతూ తగ్గుతూ వచ్చాయి.

మొత్తం ప్రాఫిట్స్ ఎంతంటే
ఇక సినిమా బిజినెస్ 2.7కోట్లు కాగా, 3కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో మార్కెట్ లోకి దిగింది. ఎపి తెలంగాణలో మొత్తంగా 4.81కోట్ల షేర్స్ వచ్చాయి. ఇక వరల్డ్ వైడ్ గా 5.13కోట్ల షేర్స్ దక్కాయి. టోటల్ గ్రాస్ 9.50కోట్లు. ఇక సినిమాకు వచ్చిన మొత్తం ప్రాఫిట్ 2.13కోట్లు. మొత్తానికి 8 ఏళ్ల అనంతరం నరేష్ కు మంచి ప్రాఫిట్స్ అందించిన సినిమాగా నాంది విజయాన్ని అందుకుంది.


Click it and Unblock the Notifications











