Naandhi Collections: ఊహించని రీతిలో నాంది కలెక్షన్స్.. అల్లరి నరేష్ కెరీర్‌లో మొదటిసారి ఇలా
'అల్లరి' అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయ్యాడు టాలెంటెడ్ స్టార్ నరేష్. మొదటి సినిమానే ఇంటి పేరుగా మార్చుకున్న అతడు.. అప్పటి నుంచి అల్లరి చేస్తూనే ఉన్నాడు. మరే హీరోకూ సాధ్యం కాని రీతిలో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఎక్కువగా కామెడీ చిత్రాలనే చేయడంతో అతడిపై ఆ ముద్ర పడిపోయింది. మధ్యలో కొన్ని ప్రయోగాత్మక చిత్రాలు నరేష్‌కు మంచి పేరును తెచ్చాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం అతడు 'నాంది' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. దీనికి రికార్డు స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి. ఆ వివరాలు మీకోసం!

మరో ప్రయోగాత్మక చిత్రంలో అల్లరి నరేష్
ఈ ఏడాది ఇప్పటికే 'బంగారు బుల్లోడు' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల్లరి నరేష్.. విజయ్ కనకమేడల దర్శకత్వంలో 'నాంది' అనే సినిమాలోనూ నటించాడు. క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాను సతీష్ వేగేశ్న నిర్మించారు. వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర పోషించిన ఈ సినిమాకు శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు. దీనిపై భారీ ఆశలే పెట్టుకున్నాడు నరేష్.

పెరిగిన అంచనాలు.. ప్రీ బిజినెస్ భారీగానే
ఫస్ట్ లుక్‌లో బట్టలు లేకుండా కనిపించి షాకిచ్చాడు అల్లరి నరేష్. దీనికి తోడు టీజర్, ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరిగింది. నైజాం రూ. కోటి, సీడెడ్ రూ. 30 లక్షలు, ఆంధ్రా రూ. 1.20 కోట్లు, ఓవర్సీస్ రూ. 20 లక్షలు సహా మొత్తంగా రూ. 2.70 కోట్ల వ్యాపారం జరిగినట్లు తెలిసింది.

అద్భుత స్పందన... అతడి గురించే చర్చ
ఎన్నో అంచనాల నడుమ విడుదలైన 'నాంది' అద్భుతమైన స్పందనను అందుకుంటోంది. మొదటి ఆట నుంచే హిట్ టాక్‌ను సంపాదించుకున్న ఈ చిత్రం విడుదలైన అన్ని ప్రాంతాల్లోనూ మంచి కలెక్షన్లు రాబట్టింది. మరీ ముఖ్యంగా ఇందులో అల్లరి నరేష్ అద్భుతమైన యాక్టింగ్, వరలక్ష్మీ నటన, డైరెక్టర్ విజయ్ కనకమేడల టేకింగ్‌తో పాటు శ్రీచరణ్ సంగీతం హైలైట్‌గా నిలిచాయి.

ఊహించని రీతిలో నాంది మూవీ కలెక్షన్స్
'నాంది' మొదటి రోజు నైజాంలో రూ. 18 లక్షలు, సీడెడ్‌లో రూ. 6 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 5.2 లక్షలు, ఈస్ట్‌లో రూ. 5 లక్షలు, వెస్ట్‌లో రూ. 2.2 లక్షలు, గుంటూరులో రూ. 3.2 లక్షలు, కృష్ణా రూ. 3 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 2 లక్షలు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 2 లక్షలు వసూలు చేసింది. ఓవరాల్‌గా రూ. 49 లక్షలు షేర్, రూ. 72 లక్షల గ్రాస్ రాబట్టింది.

అల్లరి నరేష్ కెరీర్‌లో మొదటిసారి ఇలా
చాలా వరకు కామెడీ చిత్రాల్లోనే కనిపించి మెప్పించిన అల్లరి నరేష్.. అప్పుడప్పుడూ వైవిధ్యమైన పాత్రల్లోనూ సత్తా చాటాడు. అందులో 'నాంది' అతడి కెరీర్‌లోనే అద్భతమైన చిత్రంగా నిలిచిపోతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక, మొదటి రోజు దాదాపు యాభై లక్షల రూపాయల షేర్ ఇప్పటి వరకు అతడి కెరీర్‌లో ఏ సినిమాకూ రాకపోవడం గమనార్హం.

బ్రేక్ ఈవెన్‌ను చేరుకోవాలంటే ఎంత రావాలి?
ప్రపంచ వ్యాప్తంగా 'నాంది'కి రూ. 2.70 కోట్ల వ్యాపారం జరగడంతో.. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను రూ. 3 కోట్లుగా నిర్ణయించుకున్నారు. మొదటి రోజు రూ. 49 లక్షలు వసూలు కావడంతో.. టార్గెట్‌ను చేరుకోవాలంటే మరో రూ. 2.51 కోట్లు కలెక్షన్లు రాబట్టాల్సి ఉంటుంది. వీకెండ్ కావడంతో ఈ రెండు రోజుల్లో చాలా వరకు వసూలు చేసే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు.
90 ML బ్యూటీ మసూమ్ సర్కార్ హాట్ వర్కౌట్ ఫొటోలు


Click it and Unblock the Notifications











