twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Naandhi 2day Collections మెల్లిగా ఊపందుకుంది.. రెండో రోజు ఎంతంటే?

    |

    నాంది సినిమాతో అల్లరి నరేష్ కెరీర్‌ యూటర్న్ తిరిగింది. ఇన్నాళ్లూ సక్సెస్ కోసం ఎంతో ఎదురుచూసిన అల్లరి నరేష్‌కు మంచి కమ్ బ్యాక్ ఇచ్చింది. సుడిగాడు సినిమా తరువాత అల్లరి నరేష్ సోలో హీరోగా హిట్ కొట్టనేలేదు. మహర్షి సినిమాలో చేసిన పాత్రకు మంచి ప్రశంసలు లభించాయి. అలా అల్లరి నరేష్ తన రూట్‌ను మార్చుకొని కొత్త పాత్రలు, కథలకు ఓకే చెప్పడం ప్రారంభించాడు. అందుకే నాంది వంటి సినిమా వచ్చింది.

    మొదటి రోజు అలా..

    మొదటి రోజు అలా..

    ఇండస్ట్రీలో నాంది సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. వాటికి తగ్గట్టే సినిమాను జనాలు ఆదరించారు. మొదటి రోజు ఓ మోస్తరుగా కలెక్షన్లు వచ్చాయి.పోటీలో మూడు సినిమాలున్నా కూడా నాంది సినిమాకు పర్వాలేదనిపించేలా వసూళ్ల వచ్చాయి.

    పాజిటివ్ టాక్..

    పాజిటివ్ టాక్..

    ఇక నాంది సినిమాకు మొదటి రోజు దాదాపు 40 లక్షల వసూళ్లు వచ్చినట్టు తెలుస్తున్నాయి. మౌత్ టాక్‌తో సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో పెరిగాయి. నాందిపై వచ్చిన పాజిటివ్ టాక్ సినిమా వసూళ్లపై ప్రభావాన్ని చూపించింది.

    రెండో రోజు అలా..

    రెండో రోజు అలా..

    రెండో రోజు నాంది బాగానే పుంజుకుంది. ఏరియాల వారిగా చూసుకుంటే.. నైజాంలో 28 లక్షలు, సీడెడ్‌లో 8లక్షలు, ఉత్తరాంధ్రలో 6.2లక్షలు, ఈస్ట్ 5.1లక్షలు, వెస్ట్ 3.4లక్షలు, గుంటూరు 5.3లక్షలు, కృష్ణా 6.1లక్షలు, నెల్లూరు 3.1లక్షలను కొల్లగొట్టేశాయి.

    మొత్తంగా ఎంతంటే..

    మొత్తంగా ఎంతంటే..

    నాంది మొదటి రోజు మొత్తంగా 45 లక్షలు కొల్లగొట్టగా.. రెండో రోజు 65 లక్షలను వసూళ్లు చేసింది. ఇలా మొత్తం రెండు రోజుల్లో 1.95కోట్ల గ్రాస్ రాబట్టగా 1.1కోట్ల షేర్‌ను కొల్లగొట్టి పర్వాలేదనిపించింది. మొత్తం మీద సినిమాను 2.7 కోట్లకు అమ్మగా సినిమా 3 కోట్ల రేంజ్ టార్గెట్‌తో బరిలోకి దిగింది.

     బ్రేక్ ఈవెన్‌కు దూరంగానే..

    బ్రేక్ ఈవెన్‌కు దూరంగానే..

    అయితే నాంది సినిమా ఇంకా బ్రేక్ ఈవెన్‌కు దూరంగా ఉంది. మూడు కోట్ల షేర్‌ను రాబట్టాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 1.1కోట్లను వసూళ్లు చేసింది. ఇంకా వీకెండ్ ఉండటం.. వచ్చే వారం కూడా నాందికి మంచి ఆదరణే ఉండేలా ఉంది. మున్ముందు రోజుల్లో బ్రేక్ ఈవెన్ సాధించేలానే ఉంది.

    English summary
    Allari Naresh Naandhi Day 2 Collections ..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X