twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Naandhi Collections.. దుమ్ములేపిన అల్లరి నరేష్.. ఇప్పటి వరకు వచ్చిన లాభమెంతంటే?

    |

    నాంది సినిమాతో అల్లరి నరేష్ సక్సెస్ బాట పట్టాడు. దాదాపు ఎనిమిదేళ్ల తరువాత ఓ హిట్ కొట్టాడు. విజయం అనే పదం విని చాలా కాలమైందని అల్లరి నరేష్ మీడియా ముఖంగానే కన్నీరు పెట్టేసుకున్నాడు. అయితే నాంది సినిమాపై పెట్టుకున్న నమ్మకం మాత్రం నిలబడింది. నాంది సినిమాతో నిర్మాతలు లాభాల బాట పడ్డారు. అల్లరి నరేష్ నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి. మొత్తంగా అటు కమర్షియల్‌గా ఇటు క్రిటిక్స్ పరంగా నాంది బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.

    మౌత్ టాక్‌తో..

    మౌత్ టాక్‌తో..

    నాంది సినిమాపై ముందు నుంచి మంచి అభిప్రాయమే ఏర్పడింది. ఏదో ఒక ప్రయోగం చేయబోతోన్నాడని పోస్టర్లతోనే అర్థమైంది. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టే సినిమా నేపథ్యం కొత్తగా ఉంది. అల్లరి నరేష్ పూర్తిగా తన నటనలో వైవిధ్యాన్ని చూపించాడు. అలా నాంది సినిమాకు మౌత్ టాక్ బాగా పని చేసింది. కలెక్షన్లు రోజు రోజుకూ పెరుగుతూనే వచ్చాయి.

    తొమ్మిదో రోజు అలా..

    తొమ్మిదో రోజు అలా..

    తొమ్మిదో రోజు నాంది బాగానే దూసుకుపోయింది. ఏరియాల వారిగా చూసుకుంటే.. నైజాంలో 9 లక్షలు, సీడెడ్‌లో 3లక్షలు, ఉత్తరాంధ్రలో 3.2లక్షలు, ఈస్ట్ 2.4లక్షలు, వెస్ట్ 2లక్షలు, గుంటూరు 2.6లక్షలు, కృష్ణా 2.8లక్షలు, నెల్లూరు 1.8లక్షలను కొల్లగొట్టేసింది.

    మొత్తంగా తొమ్మిదో రోజు..

    మొత్తంగా తొమ్మిదో రోజు..

    అయితే మొత్తంగా నాంది తొమ్మిదో రోజు మంచి వసూళ్లనే సాధించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 27 లక్షల షేర్‌ను కొల్లగొట్టింది.. 52 లక్షల గ్రాస్‌ను వసూళ్లు చేసింది. ఇక మొత్తంగా తొమ్మిది రోజులకు నాంది ఎంత కొల్లగొట్టిందో ఓ సారి చూద్దాం.

    మొత్తంగా ఎంతంటే..

    మొత్తంగా ఎంతంటే..

    నాంది ఈ తొమ్మిదో రోజుల్లో ఏరియాల వారిగా చూసుకుంటే ఎంత కొల్లగొట్టిందంటే.. నైజాంలో 1.5కోట్లు, సీడెడ్‌లో 49లక్షలు, ఉత్తరాంధ్రలో 37లక్షలు, ఈస్ట్ 30లక్షలు, వెస్ట్ 22లక్షలు, గుంటూరు 31లక్షలు, కృష్ణా 33లక్షలు, నెల్లూరు 19లక్షలను కొల్లగొట్టేసింది. అలా మొత్తంగా ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో 7.02కోట్ల గ్రాస్.. 3.71కోట్ల షేర్‌ను వసూళ్లు చేసింది.

     లాభాల బాట..

    లాభాల బాట..

    అయితే చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 3.92కోట్లను వసూళ్లు చేసింది. నాంది సినిమా చేసిన బిజినెస్.. ఇప్పటి వరకు రాబట్టిన వసూళ్లను చూస్తుంటే.. లాభాల బాట పట్టినట్టు తెలుస్తోంది. మూడు కోట్లకే బ్రేక్ ఈవెన్ అవ్వగా.. ఇప్పుడంతా లాభాలే వస్తున్నాయి. ఇప్పటికే 92 లక్షలతో ముందంజలో ఉండి క్లీన్ హిట్‌గా నిలిచింది.

    English summary
    Allari Naresh Naandhi Day 9 Collections,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X