Naandhi 11 Days Collections: క్లిష్ట సమయంలోనూ సత్తా చాటిన ‘నాంది’.. లాభాల్లోనూ నరేష్ మూవీ రికార్డు
అల్లరి నరేష్.. తెలుగు సినీ ఇండస్ట్రీలోనే ప్రత్యేకమైన శైలి ఉన్న ఏకైక హీరో. సుదీర్ఘ ప్రయాణంలో ఎక్కువ హాస్యభరితమైన చిత్రాలనే చేసిన అతడు.. కామెడీ హీరో అనే పేరును సంపాదించుకున్నాడు. అంతేకాదు, అందరి కంటే వేగంగా సినిమాలు చేస్తూ ఇప్పటికే హాఫ్ సెంచరీని కూడా పూర్తి చేసేశాడు. కామెడీ చిత్రాల్లోనే కాకుండా అప్పుడప్పుడూ సీరియస్ పాత్రల్లోనూ కనిపించి మెప్పించాడతను. ఈ క్రమంలోనే ఇటీవల 'నాంది' అనే యాక్టింగ్ స్కోప్ ఉన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి హిట్ కొట్టాడు. ఈ చిత్రం 11 రోజుల బాక్సాఫీస్ రిపోర్టు మీకోసం!
సౌతిండియాలో ఐటమ్ గర్ల్స్ హీరోయిన్లు వీరే... గ్లామర్‌తో ఇరగదీస్తున్న బ్యూటీలు

ఎనిమిదేళ్ల తర్వాత హిట్ ట్రాక్ ఎక్కిన నరేష్
'సుడిగాడు' అనే సినిమా తర్వాత హిట్ రుచిని అస్వాదించలేకపోయాడు నరేష్. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా అతడు విజయ్ కనకమేడల దర్శకత్వంలో 'నాంది' అనే సినిమాలో నటించాడు. క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాను సతీష్ వేగేశ్న నిర్మించారు. వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర పోషించింది. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది.

నరేష్ కెరీర్‌లో ప్రత్యేకం... అందుకే అత్యధికం
మిగిలిన హీరోలతో పోలిస్తే నరేష్‌కు ఉన్న మార్కెట్ చాలా తక్కువనే చెప్పాలి. అయినప్పటికీ రొటీన్ సినిమాల కారణంగా అతడి చిత్రాలకు డబ్బులు రావడం లేదు. దీంతో ఎక్కువ వెచ్చించి ఈ హీరో సినిమాలను కొనడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో 'నాంది' ఫస్ట్ లుక్‌లో బట్టలు లేకుండా కనిపించిన నరేష్ సినిమాపై అంచనాలు పెంచేశాడు. దీంతో ఈ చిత్రానికి రూ. 2.70 కోట్ల వ్యాపారం జరిగింది.

పోటీగా ఎన్నో సినిమాలు.. మార్క్ చూపిస్తూ
టీజర్, ట్రైలర్‌తో 'నాంది' సినిమా అందరి దృష్టిలో పడింది. ఈ నేపథ్యంలో గత నెలలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనితో పాటే మరో మూడు సినిమాలూ విడుదలయ్యాయి. అలాగే, 'ఉప్పెన' సినిమా ప్రభావం అప్పుడు భారీగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో నరేష్ సినిమా భవితవ్యంపై అనుమానాలు వచ్చాయి. కానీ, ఈ మూవీ అంచనాలను అందుకుంటూ సూపర్ హిట్ అయింది.

పదకొండో రోజు నాంది ఎంత వసూలు చేసింది?
పదకొండో రోజు 'నాంది' పర్వాలేదనిపించింది. సోమవారం ఈ మూవీ నైజాంలో రూ. 5 లక్షలు, సీడెడ్‌లో రూ. 2 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 4.20 లక్షలు, ఈస్ట్‌లో రూ. 2.40 లక్షలు, వెస్ట్‌లో రూ. 1.20 లక్షలు, గుంటూరులో రూ. 2 లక్షలు, కృష్ణా రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలు వసూలు చేసింది. ఓవరాల్‌గా రూ. 20 లక్షలు షేర్, రూ. 40 లక్షలు గ్రాస్ రాబట్టి సత్తా చాటింది.

11 రోజులకు కలిపి మొత్తం ఎంత రాబట్టిందంటే?
వేరే సినిమా నుంచి గట్టి పోటీ నెలకొని ఉన్నప్పటికీ 'నాంది' మూవీ బాగా రాణిస్తోంది. తద్వారా నరేష్ సినిమా 11 రోజులకు గానూ తెలుగు రాష్ట్రాల్లో రూ. 4.38 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 15 లక్షలు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 10 లక్షలు సహా ప్రపంచ వ్యాప్తంగా రూ. 4.63 కోట్లు షేర్, రూ. 8.60 కోట్లు గ్రాస్ రాబట్టింది. ఫలితంగా సూపర్ హిట్‌గా నిలిచింది. అలాగే రికార్డులూ బద్దలు కొట్టింది.

‘నాంది' మూవీక మొత్తం ఎంత లాభం వచ్చింది?
ప్రపంచ వ్యాప్తంగా 'నాంది'కి రూ. 2.70 కోట్ల వ్యాపారం జరగడంతో.. బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను రూ. 3 కోట్లుగా నిర్ణయించుకున్నారు. ఇక, పదకొండు రోజుల్లో ఈ సినిమా రూ. 4.63 కోట్లు వసూలు చేసింది. అంటే ఇప్పటి వరకు నరేష్ సినిమాకు రూ. 1.63 కోట్లు లాభం వచ్చింది. తద్వారా కోటిన్నర మార్కును దాటేసి రికార్డు క్రియేట్ చేసింది. ఇదే జోరు చూపిస్తే రూ. 2 కోట్లు లాభాలు రావొచ్చు.


Click it and Unblock the Notifications











