Naandhi 12 Days Collections: అలా పోటీ ఉన్నా జోరు తగ్గని ‘నాంది’.. భారీ లాభాల దిశగా నరేష్ మూవీ

తెలుగు సినీ ఇండస్ట్రీలో అల్లరి నరేష్‌ది ప్రత్యేకమైన స్థానం. ఇప్పటి తరం హీరోల్లో ఏ ఒక్కరికీ సాధ్యం కాని విధంగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్నాడతను. అదే సమయంలో అందరి కంటే వేగంగా సినిమాలు చేస్తూ అర్ధ శతకాన్ని కూడా పూర్తి చేసేశాడు. అయితే, కొన్నేళ్లుగా అతడికి హిట్ అందడం లేదు. దీంతో ఎన్నో ప్రయోగాలు చేస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల 'నాంది' అనే సీరియస్ మూవీని చేశాడు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ఘన విజయాన్ని అందుకుంది. రెండో వారంలోనూ సత్తా చాటుతూ భారీ లాభాల దిశగా సాగుతోంది. ఆ వివరాలు మీకోసం!

Recommended Video

#Nandhi Movie Team Chit Chat With Sunil Part 3 | Allari Naresh| Varalaxmi Sarathkumar
‘సుడిగాడు' వచ్చిన ఎనిమిదేళ్లకు మరో హిట్

‘సుడిగాడు' వచ్చిన ఎనిమిదేళ్లకు మరో హిట్

వరుసగా కామెడీ చిత్రాలనే చేస్తున్న కారణంగా నరేష్‌లోని అసలైన నటుడు ఇన్ని రోజులూ బయటకు రాలేదు. కానీ, కొత్త దర్శకుడు విజయ్ కనకమేడల మాత్రం అతడినే తీసుకొచ్చాడు. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వచ్చిందే 'నాంది'. సతీష్ వేగేశ్న నిర్మించిన ఇందులో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర పోషించింది. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు. ఈ చిత్రం ఘన విజయం సాధించింది.

ఆ ఒక్క కారణంతోనే ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా

ఆ ఒక్క కారణంతోనే ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక్కో హీరోకు ఒక్కో ప్రాంతంలో ఎక్కువ మార్కెట్ ఉంది. నరేష్‌కు అందరి కంటే తక్కువే ఉన్నా.. అతడి సినిమాలను బాగానే ఆదరించేవారు. కానీ, ఇటీవల వరుస ఫ్లాపులు వస్తుండడంతో 'నాంది'కి మార్కెట్ జరగదని అంతా అనుకున్నారు. కానీ, ఫస్ట్ లుక్‌లోనే న్యూడ్‌గా కనిపించి అంచనాలు పెంచేశాడు. దీంతో ఈ చిత్రానికి రూ. 2.70 కోట్ల వ్యాపారం జరిగింది.

వన్ మ్యాన్ షో.. పోటీని తట్టుకుని నిలబడింది

వన్ మ్యాన్ షో.. పోటీని తట్టుకుని నిలబడింది

అంతకు ముందు వారమే 'ఉప్పెన' మూవీ విడుదలై భారీ హిట్‌గా దూసుకుపోతోంది. అదే సమయంలో మూడు సినిమాలతో కలిసి 'నాంది' విడుదలైంది. దీంతో ఈ సినిమా హిట్ కొట్టడం కష్టమేనేమో అని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా నరేష్ వన్ మ్యాన్ షోతో సినిమాను నిలబెట్టాడు. దీంతో ఆ సినిమాల పోటీని తట్టుకుని నిలబడిన ఈ చిత్రం హిట్ అయింది.

పన్నెండో రోజు నాంది ఎంత వసూలు చేసింది?

పన్నెండో రోజు నాంది ఎంత వసూలు చేసింది?

పన్నెండో రోజు 'నాంది' కలెక్షన్లు బాగా వచ్చాయి. మంగళవారం ఈ మూవీ నైజాంలో రూ. 3 లక్షలు, సీడెడ్‌లో రూ. 1.20 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 2 లక్షలు, ఈస్ట్‌లో రూ. 1.60 లక్షలు, వెస్ట్‌లో రూ. 1 లక్షలు, గుంటూరులో రూ. 1.20 లక్షలు, కృష్ణా రూ. 1.30 లక్షలు, నెల్లూరులో రూ. 60 వేలు వసూలు చేసింది. ఓవరాల్‌గా రూ. 12 లక్షలు షేర్, రూ. 21 లక్షలు గ్రాస్ రాబట్టి సత్తా చాటింది.

12 రోజులకు కలిపి మొత్తం ఎంత రాబట్టిందంటే?

12 రోజులకు కలిపి మొత్తం ఎంత రాబట్టిందంటే?

'ఉప్పెన' మూవీ ప్రభావం ఇంకా ఉన్నా.. గత వారం కొత్త సినిమాలు విడుదలైనా 'నాంది' సత్తా చాటుతోంది. తద్వారా ఇది 12 రోజులకు తెలుగు రాష్ట్రాల్లో రూ. 4.50 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 17 లక్షలు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 10 లక్షలు సహా ప్రపంచ వ్యాప్తంగా రూ. 4.77 కోట్లు షేర్, రూ. 8.85 కోట్లు గ్రాస్ రాబట్టింది. దీంతో నరేష్ ఖాతాలో సరైన సమయంలో ఓ హిట్ వచ్చి చేరింది.

భారీ లాభాల దిశగా ‘నాంది'... ఇప్పటి వరకూ..

భారీ లాభాల దిశగా ‘నాంది'... ఇప్పటి వరకూ..

'నాంది' థియేట్రికల్ రైట్స్ రూ. 2.70 కోట్లకు అమ్ముపోవడంతో.. బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను రూ. 3 కోట్లుగా నిర్ణయించుకున్నారు. ఇక, పన్నెండు రోజుల్లో ఈ సినిమా రూ. 4.77 కోట్లు వసూలు చేసింది. అంటే ఇప్పటి వరకు నరేష్ సినిమాకు రూ. 1.77 కోట్లు లాభం వచ్చింది. ఇక, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం.. వచ్చే రెండో రోజుల్లోనే ఈ సినిమా లాభాలు రూ. 2 కోట్లు దాటవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X