For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Naandhi 13 Days Collections: బడా చిత్రాలకు ధీటుగా ‘నాంది’ కలెక్షన్లు.. మైలురాయి దిశగా నరేష్ అడుగులు

  |

  ఎనిమిదేళ్లుగా వరుస పరాజయాలు.. ఏ తరహా సినిమా చేసినా నిరాశే ఎదురవుతోంది.. ఇలాంటి పరిస్థితుల్లో పంథాను మార్చుకున్నాడు.. ఫలితంగా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌తో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. అతడే టాలెంటెడ్ హీరో అల్లరి నరేష్. వరుసగా హాస్య ప్రధానమైన చిత్రాల్లోనే నటిస్తూ ఎన్నో ఫ్లాపులతో సతమతం అయిన అతడు.. 'నాంది' అనే సీరియస్ సినిమాతో వచ్చి మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. బడా చిత్రాలతో పాటు విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల పరంగానూ సత్తా చాటుతోంది. ఇక, 13 రోజల్లో ఈ మూవీ ఎంత వసూలు చేసిందో చూద్దాం పదండి!

  Naandhi Box Office Report | Break Even Target For Allari Naresh Movie | Filmibeat Telugu
  పరాజయాలకు బ్రేక్.. ‘నాంది’ పలికిన నరేష్

  పరాజయాలకు బ్రేక్.. ‘నాంది’ పలికిన నరేష్


  2012లో వచ్చిన ‘సుడిగాడు' తర్వాత అల్లరి నరేష్ ఎన్నో చిత్రాల్లో నటించాడు. అయితే, ఇవేమీ అతడికి హిట్‌ను అందించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త దర్శకుడు విజయ్ కనకమేడల తీసిన ‘నాంది'తో అల్లరి నరేష్ మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. సతీష్ వేగేశ్న నిర్మించిన ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర పోషించింది. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు.

  అంచనాలకు అనుగుణంగానే జరిగిన బిజినెస్

  అంచనాలకు అనుగుణంగానే జరిగిన బిజినెస్

  వాస్తవానికి మిగిలిన హీరోలతో పోలిస్తే నరేష్‌కు ఉన్న మార్కెట్ చాలా తక్కువ. దీనికి కారణం అతడు వరుసగా పరాజయాలను చవి చూస్తుండడమే. ఇలాంటి పరిస్థితుల్లో ఫస్ట్ లుక్ పోస్టర్‌, టీజర్, ట్రైలర్ అంచనాలు పెంచేయడంతో ‘నాంది' మార్కెట్ మాత్రం భారీగా జరిగింది. మొత్తంగా ఈ మూవీ బిజినెస్ రూ. 2.70 కోట్ల వరకూ జరిగింది. ఇది కూడా నరేష్ రేంజ్‌ను పెంచేసింది.

  నరేష్ నటనకే మార్కులు.. అదే నిలబెట్టింది

  నరేష్ నటనకే మార్కులు.. అదే నిలబెట్టింది


  అంతకు ముందు వారమే ‘ఉప్పెన' మూవీ విడుదలై భారీ హిట్‌గా దూసుకుపోతోంది. అదే సమయంలో మూడు సినిమాలతో కలిసి ‘నాంది' విడుదలైంది. దీంతో ఈ సినిమా హిట్ కొట్టడం కష్టమేనేమో అని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా నరేష్ వన్ మ్యాన్ షోతో సినిమాను నిలబెట్టాడు. దీంతో ఆ సినిమాల పోటీని తట్టుకుని నిలబడిన ఈ చిత్రం హిట్ అయింది.

  13వ రోజు ‘నాంది’ ఎంత వసూలు చేసింది?

  13వ రోజు ‘నాంది’ ఎంత వసూలు చేసింది?

  13వ రోజు ‘నాంది' కలెక్షన్లు బాగా వచ్చాయి. బుధవారం ఈ మూవీ నైజాంలో రూ. 2 లక్షలు, సీడెడ్‌లో రూ. 1 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 2 లక్షలు, ఈస్ట్‌లో రూ. 1.20 లక్షలు, వెస్ట్‌లో రూ. 60 వేలు, గుంటూరులో రూ. 1 లక్షలు, కృష్ణా రూ. 1 లక్షలు, నెల్లూరులో రూ. 40 వేలు వసూలు చేసింది. ఓవరాల్‌గా 13వ రోజు రూ. 9 లక్షలు షేర్, రూ. 18 లక్షలు గ్రాస్ రాబట్టి సత్తా చాటింది.

  13 రోజులకు కలిపి మొత్తం ఎంత రాబట్టింది?

  13 రోజులకు కలిపి మొత్తం ఎంత రాబట్టింది?

  వైష్ణవ్ తేజ్ నటించిన ‘ఉప్పెన' మూవీ ప్రభావం కొనసాగుతూ ఉన్నా.. గత వారం ‘చెక్' సహా కొన్ని కొత్త సినిమాలు విడుదలైనా నరేష్ మూవీ ‘నాంది' రాణిస్తూనే ఉంది. తద్వారా 13 రోజులకు తెలుగు రాష్ట్రాల్లో రూ. 4.59 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 17 లక్షలు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 10 లక్షలు సహా ప్రపంచ వ్యాప్తంగా రూ. 4.86 కోట్లు షేర్, రూ. 9.05 కోట్లు గ్రాస్ రాబట్టింది.

  మైలురాయి దిశగా అడుగులు వేస్తున్న నరేష్

  మైలురాయి దిశగా అడుగులు వేస్తున్న నరేష్

  ‘నాంది' థియేట్రికల్ రైట్స్ రూ. 2.70 కోట్లకు అమ్ముపోవడంతో.. బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను రూ. 3 కోట్లుగా నిర్ణయించుకున్నారు. ఇక, పదమూడు రోజుల్లో ఈ సినిమా రూ. 4.86 కోట్లు వసూలు చేసింది. అంటే ఇప్పటి వరకు నరేష్ సినిమాకు రూ. 1.86 కోట్లు లాభం వచ్చింది. తద్వారా రెండు కోట్ల రూపాయల లాభాల మైలురాయికి మరింత చేరువైంది. ఇదే ఊపు ఉంటే రెండు రోజుల్లో పూర్తవుతుంది.

  English summary
  Naandhi is an upcoming Indian Telugu-language action crime thriller film directed by Vijay Kanakamedala and produced by Satish Vegesna. The film stars Allari Naresh, Varalaxmi Sarathkumar, and Priyadarshi Pullikonda, while Harish Uthaman and Praveen play supporting roles.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X