Naandhi 7 days collections: అల్లరి నరేష్ బాక్సాఫీస్ హిట్.. మొత్తం లాభం ఎంతంటే?
కామెడీ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న నరేష్ అప్పుడప్పుడు ఆ మార్క్ ను దాటేసి ప్రయోగాలు చేస్తూ వస్తున్నాడు. ఆ స్టైల్ లో చేసిందే నాంది. గతంలో గమ్యం సినిమాతో నరేష్ జనాలకు చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాడు. ఇక మళ్ళీ ఆ తరువాత నాంది సినిమాతో అదే తరహాలో ఆడియెన్స్ కు కనెక్ట్ అయ్యాడు. నాంది సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ అని తేలిపోయింది. కానీ కలెక్షన్స్ ఇంకా అనుకున్నంత రేంజ్ లో రావడం లేదని తెలుస్తోంది. సినిమాకు 7వ రోజు వచ్చిన కలెక్షన్స్ విషయంలోకి వెళితే..

ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న విజయం
నరేష్ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న విజయం నాంది ద్వారా అందుకున్నాడు. సినిమా సెట్స్ పైకి వచ్చినప్పటి నుంచే సరికొత్త కాన్సెప్ట్ అంటూ హైప్ గట్టిగానే క్రియేట్ చేశారు. ఇక మొత్తానికి విడుదల రోజు నుంచే సినిమా పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ అందుకుంది. 5రోజుల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకుంది. ఇక 7వ రోజు వచ్చిన కలెక్షన్స్ పై ఒక లుక్కేస్తే..

డీసెంట్ ఓపెనింగ్స్
అల్లరి నరేష్ 2012లో చివరగా సుడిగాడు సినిమాతో సక్సెస్ కొట్టడు. ఆ తరువాత 9 ఏళ్లయినా విజయం దక్కలేదు. ఇక ఇన్నాళ్లకు ఒక మంచి సక్సెస్ దక్కింది. గత సినిమాలతో పోలిస్తే మొత్తానికి నాంది సినిమాతో నరేష్ ఫామ్ లోకి వచ్చేశాడని అర్ధమయ్యింది. ఈ సినిమా గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మొదటి రోజు డీసెంట్ ఓపెనింగ్స్ అందుకున్న నాంది ఆ తరువాత రోజు నుంచి పాజిటివ్ టాక్ తో ట్రాక్ లోకి వచ్చేసింది.

7వ రోజు వచ్చిన కలెక్షన్స్
నాంది సినిమా 5 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకొని ప్రాఫిట్ జోన్ లోకి వచ్చేసింది. అయితే 6వ రోజు నుంచి కలెక్షన్స్ తగ్గుతున్నాయి. ఇక నాంది 7వ రోజు కలెక్షన్స్(షేర్స్) విషయానికి వస్తే.. నైజాం 5లక్షలు, సీడెడ్ 1.7లక్షలు, ఉత్తరాంధ్ర 2లక్షలు, ఈస్ట్ 1.6లక్షలు, వెస్ట్ 1.2లక్షలు, గుంటూరు 1.4లక్షలు, కృష్ణా 1.6లక్షలు, నెల్లూరు 0.8లక్షలు. ఏపీ తెలంగాణలో 7వ రోజు నాంది మొత్తం అందుకున్న షేర్స్ 0.15కోట్లు.

మొదటి వారం మొత్తం వరల్డ్ వైడ్ కలెక్షన్స్
నాంది మూవీ 5రోజుల్లో అనుకున్న బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను పూర్తి చేసింది. సినిమా 2.7కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి 3కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో మార్కెట్ లోకి వచ్చింది. ఇక 7రోజుల్లో ఆ వరల్డ్ వైడ్ గా 3.47కోట్ల షేర్స్ ను అందుకుంది. గ్రాస్ కలెక్షన్స్ 6.40కోట్లు. ప్రస్తుతం 0.47కోట్లతో సినిమా ప్రాఫిట్ జోన్ లో కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications











