రవితేజకు ట్విస్ట్ ఇస్తున్న అల్లరి నరేష్

By Srikanya

హైదరాబాద్: అల్లరి నరేష్ సినిమాలూ, రవితేజ సినిమాలూ రెండూ ఎంటర్టైన్మెంట్ బేస్ గానే రూపొందుతాయి. అయితే రవితేజ చిత్రాలు భారీ బడ్జెట్ తో భారీ రిలీజ్ తో ముందుకు వస్తాయి. కానీ రవితేజకు బ్యాడ్ పిరియడ్ నడుస్తోంది. వరసగా ఐదు ప్లాప్ లు అతనికి ఉన్నాయి. ఈ నేఫధ్యంలో ఓ హిట్టు అవసరం. దాంతో అతని ఆశలన్ని సారొచ్చారు చిత్రంపై నే పెట్టుకున్నాడు. అయితే ఇప్పుడు అల్లరి నరేష్ వచ్చి సారొచ్చారు రిలీజ్ రోజునే తన చిత్రం యముడుకి మొగుడు విడుదల పెట్టుకుని ట్విస్ట్ ఇస్తున్నాడు.

'అల్లరి' నరేష్ నటిస్తున్న సోషియో పాంటసీ చిత్రం 'యముడికి మొగుడు'. రిచాపనయ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి ఇ.సత్తిబాబు దర్శకుడు. ఫ్రెండ్లీ మూవీస్ పతాకంపై చంటి అడ్డాల నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్మాత చిత్ర విశేషాలను తెలియజేస్తూ ' నరేష్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్ చిత్రం ఇది. ఇప్పటి వరకు వచ్చిన యమలోకం నేపథ్య చిత్రాల్లో ఈ చిత్రం భిన్నంగా వుంటుంది. పూర్తి వినోదభరితంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలోని పాటలను ఇటీవల విడుదల చేశాం. వాటికి చక్కని ఆదరణ లభిస్తోంది. మా సంస్థలో ఐదేళ్ల గ్యాప్ తర్వాత వస్తున్న చిత్రమిది. సోషియో పాంటసీ కథాంశానికి చక్కని వినోదాన్ని జోడించి సత్తిబాబు చిత్రాన్ని అద్భుతంగా రూపొందించాడు. తప్పకుండా చిత్రం అన్ని వర్గాల ఆదరణ పొందుతుందనే నమ్మకం వుంది' అన్నారు. షాయాజీ షిండే, రమ్యకృష్ణ, భరత్, కృష్ణభగవాన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మూలకథ: జయసిద్ధు, మాటలు: క్రాంతిడ్డి, సంగీతం: కోటి.

రవితేజ, కాజల్, రీచా గంగోపాధ్యాయ్ హీరో హీరోయిన్లుగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'సారొచ్చారు'. 'మంచి ప్రేమ కథతో' అనేది సబ్ టైటిల్. తాజాగా ఈచిత్రం షూటింగ్ పార్ట్ పూర్తయింది. పోస్టు ప్రొడక్షన్ పనులు ముగించి డిసెంబర్ 21న సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈచిత్రానికి సంబంధించిన ఎక్కువ శాతం షూటింగ్ ఊటీ, యూరఫ్, హైదరాబాద్ లలో నిర్వహించారు. దర్శకుడు పరశురామ్ ఈచిత్రాన్ని రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించారు. రవితేజ, కాజల్, రీచా గంగోపాధ్యాయ్ మధ్య జరిగే రొమాంటిక్ సన్నివేశాలు సినిమాకే హైలెట్ గా నిలవనున్నాయి.

ఈచిత్రాన్ని త్రీ ఏంజిల్స్ స్టూడియో బేనర్ పై ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ కుమార్తె ప్రియాక దత్ నిర్మిస్తున్నారు. గతంలో వచ్చిన రవితేజ వరుస మూస సినిమాలకు భిన్నంగా ఈ చిత్రం ఉండబోతోంది. సినిమాలో వినోదానికి అధిక ప్రాధాన్యత నిచ్చారు. అదే విధంగా నిర్మాణ విలువలు కూడా భారీగా ఉండనున్నాయి. మరి ఈ రెండు చిత్రాలలో ఏ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X