For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  లేటుగా వస్తున్న అల్లరి నరేష్

  By Srikanya
  |

  హైదరాబాద్: అల్లరి నరేష్, ఇషా జంటగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఇ.వి.వి. సినిమా పతాకంపై ఆర్యన్ రాజేష్ నిర్మిస్తున్న చిత్రం 'బందిపోటు'. దొంగల్ని దోచుకో అనేది ఉపశీర్షిక. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఫిబ్రవరి 6 న విడుదల అవుతుందని భావించారు. అయితే అందిన సమాచారం ప్రకారం పోస్ట్ ప్రొడక్షన్ లేటు అవటం వలన మరో రెండు వారాలకు వాయిదా పడనుందని తెలుస్తోంది. సంపూర్ణేష్ బాబు, సప్తగిరి వంటి స్టార్ కమిడయన్స్ ఉండటంతో సినిమా కామెడీ కొత్త పుంతలు తొక్కుతుందని భావిస్తున్నారు.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  అల్లరి నరేశ్‌ మాట్లాడుతూ ‘‘మమ్మల్ని హీరోలుగా నిలబెట్టడానికి నాన్నగారు ఎంత కష్టపడ్డారో అంతకు మించి కష్టపడి మంచి సినిమాలతో ఇ.వి.వి బ్యానర్‌ను నిలబెడతాం'' అని అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘నరేశ్‌తో ఎప్పటి నుంచో సినిమా అనుకుంటున్నాను. ఇప్పటికి కుదిరింది. నరేశ్‌ని కొత్తగా చూపించే ప్రయత్నం చేశాను. ప్రతి క్యారెక్టర్‌కి ప్రాధాన్యం ఉండేలా తెరకెక్కించాను. నా సినిమాతో మళ్లీ ప్రారంభమైన ఈ బ్యానర్‌కి మంచి హిట్‌ ఇస్తాను'' అని అన్నారు.

  Allari Naresh's Bandipotu to be postponed

  అలాగే ...‘‘దొంగల్ని దోచుకునే బందిపోటు కథను ఎంతో వినోదంగా రూపొందిస్తున్నామని, ఓ మంచి కథ దొరకడంతో మోహన్‌కృష్ణతో ఈ చిత్రం చేస్తున్నామని, ప్రయోగాత్మక చిత్రం మాత్రం కాదని, నవ్వించడమే ప్రత్యేక ప్రయోగమని తెలిపారు''.

  నిర్మాత ఆర్యన్‌ రాజేష్‌ మాట్లాడుతూ...‘‘ మా నాన్న గారు పేరు నిలబెట్టేలా ఈ సంస్థలో చిత్రాలను నిర్మిస్తున్నామని, తామనుకున్న స్థాయిలో కథ దొరకడంతో ఈ సినిమా ప్రారంభించామని నిర్మాత రాజేష్ తెలిపారు''. ఈ సినిమా కేవలం అందరిని కామెడీతో అలరించాలన్న కోరికతోనే చేస్తున్నామని చిత్ర దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి తెలిపారు.

  నిర్మాత మాట్లాడుతూ ‘‘నాన్నగారి బ్యానర్‌లో ప్రెస్టీజయస్‌గా రూపొందిస్తున్న సినిమా ఇది. జనవరి1, 2000లో మా సంస్థను ప్రారంభించాం. ఈవీవీ బ్యానర్‌ నుంచి ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా? అని ప్రజలు ఎదురుచూసే విధంగా ఏడాదికి ఒకటీ, రెండు మంచి సినిమాలను ప్లాన్‌ చేస్తున్నాం'' అని అన్నారు.

  Allari Naresh's Bandipotu to be postponed

  అల్లరి నరేష్‌ మాట్లాడుతూ ‘‘నాన్నగారి బ్యానర్‌లో చేయడం చాలా హ్యాపీగా ఉంది. షూటింగ్‌ పూర్తయింది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాలో సంపూర్ణేష్‌బాబు, సప్తగిరితో కలిసి కామెడీ చేశాను. బందిపోటు మంచి సినిమా అవుతుంది'' అని అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఈవీవీ సంస్థ రీలాంచ్‌ నా సినిమాతో కావడం ఆనందంగా ఉంది. చక్కటి కథతో తెరకెక్కిస్తున్నాం. పరిపూర్ణమైన కథానాయకుడిగా నరేష్‌ ఇందులో కనిపిస్తారు. ఇప్పటివరకు ఆయన చేయని కొత్త తరహా కామెడీని ఈ సినిమాలో చూపిస్తున్నాం. ఆరోగ్యకరమైన నవ్వులున్న సినిమా అవుతుంది. ఎక్కడా వెకిలితనం ఉండదు'' అని అన్నారు.

  ఈషా మాట్లాడుతూ ‘‘కీలకపాత్ర చేస్తున్నాను. వైవిధ్యమైన పాత్ర'' అని చెప్పారు. హీరోయిన్ గా విఫలమైన శ్రద్దాదాస్ ఈ చిత్రంలో ఐటం గర్ల్ గా కనిపించి అలరించనుంది.ఈ మేరకు ఆమె మీద రీసెంట్ గా హైదరాబాద్ లో షూట్ చేసారు.

  ఇవివి సినిమా పతాకంపై రూపొందుతున్న సినిమా ‘బందిపోటు'. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహిస్తున్నారు. రాజేష్‌ ఈదర నిర్మాత. అల్లరి నరేష్‌, ఈష జంటగా నటిస్తున్నారు. తనికెళ్ల భరణి, రావు రమేష్‌, చంద్రమోహన్‌, పోసాని కృష్ణమురళి, శుభలేఖ సుధాకర్‌, సంపూర్ణేష్‌ బాబు, సప్తగిరి, అవసరాల శ్రీనివాస్‌, సాయాజీ షిండే తదితరులు ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు పాటలు: సిరివెన్నెల సీతారామశాసి్త్ర, రామజోగయ్యశాస్త్రి, అనంతశ్రీరామ్‌, రాంబాబు గోసాల, కెమెరా: పి.జి.విందా, సంగీతం: కల్యాణి కోడూరి.

  English summary
  Allari Naresh, Eesha starrer Bandipotu makers has earlier planned to release the film on Feb 6th but as per our sources the film may be postponed by two weeks due to the delay in the post production work.Directed by Indraganti Mohana Krishna, the film is said to be a comic caper and it is being produced under EVV Cinema banner. Kalyani Koduri has scored the music.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X