అల్లరి నరేష్ ‘సీమటపాకాయ్’ ఫైనల్ గా ఏమైంది?(ట్రేడ్‌టాక్)
క్రిందటి శుక్రవారం ప్రేక్షకుల తీర్పును కోరుతూ అల్లరి నరేష్ 'సీమటపాకాయ్"తో పాటు మరో మూడు అనువాద చిత్రాలు 'రంగం", 'ప్రేయసి", 'రాగిణి ఎం.ఎం.ఎస్" విడుదలయ్యాయి. నరేష్, పూర్ణ జంటగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో వచ్చిన 'సీమ టపాకాయ్" చిత్రం యావరేజ్ అనిపించుకుంది. నరేష్ రెగ్యులర్ సినిమాల స్ధాయిలోనే ఈ చిత్రం సాగింది. అయితే అంత కామిడీ వర్కవుట్ కాకపోవటం సినిమాకు మైనస్ గా మారింది. కానీ అల్లరి నరేష్ చిత్రం అనగానే కామిడి అని ముద్ర ఉండటంతో ఫ్యామిలీలు సమ్మర్ లో రిలీఫ్ కోసం వెళ్ళటం సినిమాకు ప్లస్ అయింది. ఇక జీవా హీరోగా వచ్చిన తమిళ సూపర్ హిట్ రంగం మంచి టాక్ నే తెచ్చుకుంటుంది. కాని ఇక ప్రేయసి, రాగిణి ఎం.ఎం.ఎస్‌లకు ప్రేక్షకాదరణ కొరవడింది. ఈ చిత్రాలు ప్రదర్శిస్తున్న థియేటర్లు జనం లేక వెలవెలబోతున్నాయి.


Click it and Unblock the Notifications











