Aa Okkati Adakku 2 Days Collections: నరేష్ మూవీ హవా.. 2వ రోజు భారీగా.. హిట్‌కు అంత దూరంలోనే!
టాలీవుడ్‌లో సుదీర్ఘ కాలంగా తనదైన సినిమాలను చేస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్నాడు టాలెంటెడ్ హీరో అల్లరి నరేష్. గతంలో ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న అతడు.. ఈ మధ్య కాలంలో ఇబ్బందులు పడుతున్నాడు. దీంతో ఈ సారి ఎలాగైనా సక్సెస్ సాధించాలన్న లక్ష్యంతో 'ఆ ఒక్కటీ అడక్కు' అనే కామెడీ చిత్రాన్ని చేశాడు. ఈ మూవీ ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనికి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చినా రెస్పాన్స్ బాగానే లభిస్తోంది. ఈ నేపథ్యంలో 'ఆ ఒక్కటీ అడక్కు' మూవీ 2 రోజుల వసూళ్లను మీరే చూసేయండి!
సక్సెస్ ఫార్ములాతో నరేష్
కామెడీ జోనర్ హీరో అల్లరి నరేష్ నటించిన తాజా చిత్రమే 'ఆ ఒక్కటీ అడక్కు'. మల్లి అంకం తెరకెక్కించిన ఈ మూవీని చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలకా నిర్మించారు. ఇందులో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటించింది. గోపీ సుందర్ దీనికి సంగీతం అందించారు. ఇందులో వెన్నెల కిశోర్, ఆరియానా గ్లోరీ, హర్ష, జమ్మీ సహా పలువురు కీలక పాత్రల్లో కనిపించారు.

నరేష్ మూవీ బిజినెస్ ఇలా
హిట్ కోసం వేచి చూస్తోన్న అల్లరి నరేష్ నటించిన సినిమానే 'ఆ ఒక్కటీ అడక్కు'. దీంతో ఈ చిత్రం ఆరంభంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఫలితంగా అంచనాలను భారీ స్థాయిలో ఏర్పరచుకుంది. తద్వా మంచి డిమాండ్‌ను పెంచుకుని భారీ ప్రీ రిలీజ్ బిజినెస్‌ను జరుపుకుంది. ఇలా ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ. 4.00 కోట్లు వరకూ థియేట్రికల్ బిజినెస్ జరుపుకుంది.
2వ రోజు ఎంత వచ్చింది?
కొంత కాలంగా సీరియస్ సినిమాలతో వస్తోన్న అల్లరి నరేష్.. ఇప్పుడు మరోసారి కామెడీ జోనర్‌లో 'ఆ ఒక్కటీ అడక్కు' అనే మూవీ చేశాడు. దీనికి మొదటి రోజు ఆశించిన రీతిలో రెస్పాన్స్ రాలేదు. కానీ, రెండో రోజు మాత్రం ఇది బాగానే పుంజుకుంది. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో శనివారం ఈ చిత్రం రూ. 65 లక్షలు షేర్‌తో పాటు రూ. 1.20 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.

2 రోజులకూ కలిపి ఎంత?
అల్లరి నరేష్ హీరోగా, మల్లి అంకం తెరకెక్కించిన 'ఆ ఒక్కటీ అడక్కు' మూవీకి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ రావడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రెండు రోజుల్లో అనుకున్న దానికంటే కాస్త తక్కువ స్పందనే లభించింది. ఫలితంగా ఈ సినిమా రెండు రోజులకూ కలిపి తెలుగులో రూ. 1.20 కోట్లు షేర్‌తో పాటు రూ. 2.30 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంత?
అల్లరి నరేష్ - ఫరియా అబ్దుల్లా జోడీగా నటించిన 'ఆ ఒక్కటీ అడక్కు' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో రెండు రోజుల్లో రూ. 1.20 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిపి రూ. 30 లక్షలు మాత్రమే వసూలు చేసింది. వీటితో కలిపి మొదటి రోజు ఈ చిత్రానికి రూ. 1.50 కోట్లు షేర్‌తో పాటు రూ. 3.30 కోట్లు గ్రాస్ వచ్చింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?
ఫన్ కాన్సెప్టుతో రూపొందిన 'ఆ ఒక్కటీ అడక్కు' సినిమాకు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 4.00 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 4.50 కోట్లుగా నమోదైంది. ఇక, 2 రోజుల్లో నరేష్ సినిమాకు రూ. 1.50 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 3.00 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్‌గా నిలుస్తుంది.


Click it and Unblock the Notifications











