Aa Okkati Adakku 4 Days Collections: ఒక్కసారిగా డౌన్.. 4 రోజుల్లో అన్ని కోట్లు.. హిట్ కావాలంటే!
బడా ఫిల్మ్ మేకర్ కుమారుడిగా సినిమాల్లోకి వచ్చినా.. తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించి స్టార్‌గా మారిపోయాడు అల్లరి నరేష్. కెరీర్ ఆరంభంలో కామెడీ సినిమాలతో మెప్పించిన అతడు.. ఈ మధ్య కాలంలో మాత్రం సీరియస్ మూవీలు చేస్తున్నాడు.
కానీ, హిట్లు పెద్దగా రాకపోవడంతో ఇప్పుడు మరోసారి తన జోనర్‌లోకి వెళ్లి 'ఆ ఒక్కటీ అడక్కు' అనే మూవీ చేశాడు. దీనికి మిక్స్‌డ్ టాక్ వచ్చినా ఫస్ట్ వీకెండ్‌లో రెస్పాన్స్ బాగానే లభించింది. కానీ, వర్కింగ్ డేలో డౌన్ అయిపోయింది. మరి 'ఆ ఒక్కటీ అడక్కు' మూవీ 4 రోజుల వసూళ్లను మీరే చూసేయండి!

మరోసారి కామెడీ కథతోనే
టాలెంటెడ్ హీరో అల్లరి నరేష్ నటించిన తాజా కామెడీ చిత్రమే 'ఆ ఒక్కటీ అడక్కు'. మల్లి అంకం తెరకెక్కించిన ఈ మూవీని చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలకా నిర్మించారు. ఇందులో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటించింది. ఇందులో వెన్నెల కిశోర్, ఆరియానా గ్లోరీ, హర్ష, జమ్మీ సహా పలువురు కీలక పాత్రల్లో కనిపించారు. గోపీ సుందర్ దీనికి సంగీతం అందించారు.

నరేష్ మూవీ బిజినెస్ ఇలా
సరైన హిట్ కోసం చూస్తున్న అల్లరి నరేష్ నటించిన సినిమానే 'ఆ ఒక్కటీ అడక్కు'. దీంతో ఈ చిత్రం ఆరంభంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఫలితంగా అంచనాలను భారీ స్థాయిలో ఏర్పరచుకుంది. తద్వా మంచి డిమాండ్‌ను పెంచుకుని భారీ ప్రీ రిలీజ్ బిజినెస్‌ను జరుపుకుంది. ఇలా ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ. 4.00 కోట్లు వరకూ థియేట్రికల్ బిజినెస్ చేసుకుంది.
4వ రోజు ఎంత వచ్చింది?
విలక్షణమైన నటనతో సీరియస్ మోడ్‌లో మెప్పిస్తోన్న అల్లరి నరేష్.. ఇప్పుడు మరోసారి కామెడీ జోనర్‌లో 'ఆ ఒక్కటీ అడక్కు' అనే మూవీ చేశాడు. దీనికి మొదటి వీకెండ్‌లో మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ, వర్కింగ్ డేన ఒక్కసారిగా డౌన్ అయిపోయింది. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో సోమవారం ఈ చిత్రం రూ. 23 లక్షలు షేర్‌తో పాటు రూ. 45 లక్షలు గ్రాస్‌ను వసూలు చేసింది.

4 రోజులకూ కలిపి ఎంత?
అల్లరి నరేష్ హీరోగా, మల్లి అంకం రూపొందించిన 'ఆ ఒక్కటీ అడక్కు' మూవీకి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ రావడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 4 రోజుల్లో అనుకున్న దానికంటే కాస్త తక్కువ స్పందనే లభించింది. ఫలితంగా ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకుని రూ. 1.96 కోట్లు షేర్‌తో పాటు రూ. 4.10 కోట్లు గ్రాస్ మాత్రమే వసూలు అయింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంత?
అల్లరి నరేష్ - ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన 'ఆ ఒక్కటీ అడక్కు' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో నాలుగు రోజుల్లో రూ. 1.96 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిపి రూ. 30 లక్షలు మాత్రమే వసూలు చేసింది. వీటితో కలిపి నాలుగు రోజుల్లో ఈ చిత్రానికి రూ. 2.26 కోట్లు షేర్‌తో పాటు రూ. 4.90 కోట్లు గ్రాస్ వచ్చింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?
ఫన్ స్టోరీతో రూపొందిన 'ఆ ఒక్కటీ అడక్కు' సినిమాకు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 4.00 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 4.50 కోట్లుగా నమోదైంది. ఇక, 4 రోజుల్లో నరేష్ సినిమాకు రూ. 2.26 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 2.24 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్‌గా నిలుస్తుంది.


Click it and Unblock the Notifications











