Aa Okkati Adakku 5 Days Collections: నరేష్ మూవీకి షాక్.. 5 రోజుల్లో ఇంతే.. ఇంకెంత వస్తే హిట్ అంటే!

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో రకాల సినిమాలు చేస్తూ ప్రత్యేకమైన ఇమేజ్‌తో దూసుకుపోతోన్నాడు విలక్షణ నటుడు అల్లరి నరేష్. ఇలా తనదైన చిత్రాలతో సందడి చేస్తోన్న అతడు.. హిట్లను మాత్రం పెద్దగా అందుకోవడం లేదు.

ఈ పరిస్థితుల్లో ఈ సారి ఎలాగైనా బిగ్ సక్సెస్ కొట్టాలన్న కసితో 'ఆ ఒక్కటీ అడక్కు' అనే సినిమా చేశాడు. దీనికి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అయినా వీకెండ్‌లో మంచి వసూళ్లు వచ్చాయి. కానీ, తర్వాత క్రమంగా ఈ చిత్రం డౌన్ అవుతోంది. ఈ నేపథ్యంలో 'ఆ ఒక్కటీ అడక్కు' మూవీ 5 రోజుల వసూళ్లను మీరే చూసేయండి!

Allari Naresh Starrer Aa Okkati Adakku Movie 5 Days Worldwide Collections Details

నవ్వించే కథతో వచ్చాడు
టాలెంటెడ్ హీరో అల్లరి నరేష్ నటించిన తాజా ఫన్ మూవీనే 'ఆ ఒక్కటీ అడక్కు'. మల్లి అంకం తెరకెక్కించిన ఈ మూవీని చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలకా నిర్మించారు. ఇందులో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటించింది. ఇందులో వెన్నెల కిశోర్, ఆరియానా గ్లోరీ, హర్ష, జమ్మీ సహా పలువురు కీలక పాత్రల్లో కనిపించారు. గోపీ సుందర్ దీనికి సంగీతాన్ని సమకూర్చాడు.

Allari Naresh Starrer Aa Okkati Adakku Movie 5 Days Worldwide Collections Details

నరేష్ మూవీ బిజినెస్ ఇలా

ఈ మధ్య సరైన హిట్ లేక ఇబ్బంది పడుతోన్న అల్లరి నరేష్ నటించిన సినిమానే 'ఆ ఒక్కటీ అడక్కు'. దీంతో ఈ చిత్రం ఆరంభంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఫలితంగా అంచనాలను భారీ స్థాయిలో ఏర్పరచుకుంది. తద్వా మంచి డిమాండ్‌ను పెంచుకుని ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ. 4.00 కోట్లు వరకూ థియేట్రికల్ బిజినెస్ చేసుకుంది.

Allari Naresh Starrer Aa Okkati Adakku Movie 5 Days Worldwide Collections Details

5వ రోజు ఎంత వచ్చింది?
భారీ విజయాన్ని అందుకోవాలన్న లక్ష్యంతో అల్లరి నరేష్ ఇప్పుడు మరోసారి ఫన్ జోనర్‌లో వెళ్లి 'ఆ ఒక్కటీ అడక్కు' అనే మూవీ చేశాడు. దీనికి మొదటి వీకెండ్‌లో మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ, వర్కింగ్ డేస్‌లో ఇది డౌన్ అవుతూనే ఉంది. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో 5వ రోజైన మంగళవారం ఈ చిత్రం రూ. 14 లక్షలు షేర్‌తో పాటు రూ. 25 లక్షలు గ్రాస్‌ను వసూలు చేసింది.

5 రోజులకూ కలిపి ఎంత?

అల్లరి నరేష్ హీరోగా, మల్లి అంకం రూపకల్పనలో వచ్చిన 'ఆ ఒక్కటీ అడక్కు' మూవీకి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ రావడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 5 రోజుల్లో అనుకున్న దానికంటే కాస్త తక్కువ స్పందనే లభించింది. ఫలితంగా ఈ సినిమాకు నైజాంలో రూ. 91 లక్షలు, ఆంధ్రాలో రూ. 1.16 కోట్లతో కలుపుకుని రెండు రాష్ట్రాల్లో రూ. 2.07 కోట్లు షేర్, రూ. 4.40 కోట్లు గ్రాస్ వచ్చింది.

Allari Naresh Starrer Aa Okkati Adakku Movie 5 Days Worldwide Collections Details

ప్రపంచ వ్యాప్తంగా ఎంత?
అల్లరి నరేష్ - ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన 'ఆ ఒక్కటీ అడక్కు' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో ఐదు రోజుల్లో రూ. 2.07 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిపి రూ. 31 లక్షలు మాత్రమే వసూలు చేసింది. వీటితో కలిపి 5 రోజుల్లో ఈ చిత్రానికి రూ. 2.38 కోట్లు షేర్‌తో పాటు రూ. 5.30 కోట్లు గ్రాస్ వచ్చింది.

Allari Naresh Starrer Aa Okkati Adakku Movie 5 Days Worldwide Collections Details

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?

కామెడీ స్టోరీతో రూపొందిన 'ఆ ఒక్కటీ అడక్కు' సినిమాకు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 4.00 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 4.50 కోట్లుగా నమోదైంది. ఇక, 5 రోజుల్లో నరేష్ సినిమాకు రూ. 2.38 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 2.12 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్‌గా నిలుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X