Aa Okkati Adakku 7 Days Collections: 4.50 కోట్ల టార్గెట్.. వారంలో షాకింగ్‌గా.. నరేష్ హిట్ కొట్టాలంటే!
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి సాదాసీదాగానే వచ్చినా ఆరంభంలోనే తనదైన చిత్రాలతో భారీ స్థాయిలో ప్రభావాన్ని చూపించగలిగాడు అల్లరి నరేష్. అలా చాలా కాలం పాటు హవాను చూపించిన అతడు.. ఈ మధ్య కాలంలో ఇబ్బందులు పడుతున్నాడు. దీంతో ఈ సారి సక్సెస్ ట్రాక్ ఎక్కాలన్న లక్ష్యంతో 'ఆ ఒక్కటీ అడక్కు' అనే మూవీ చేశాడు. దీనికి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అయినా వీకెండ్‌లో మంచి వసూళ్లు వచ్చాయి. కానీ, తర్వాత క్రమంగా ఈ చిత్రం డౌన్ అయింది. ఈ నేపథ్యంలో 'ఆ ఒక్కటీ అడక్కు' మూవీ 7 రోజుల వసూళ్లను మీరే చూడండి!
ఆ ఒక్కటీ అడక్కు అంటూ
టాలీవుడ్ క్రేజీ హీరో అల్లరి నరేష్ నటించిన తాజా సినిమానే 'ఆ ఒక్కటీ అడక్కు'. మల్లి అంకం తెరకెక్కించిన ఈ మూవీని చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలకా నిర్మించారు. ఇందులో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటించింది. ఇందులో వెన్నెల కిశోర్, ఆరియానా గ్లోరీ, హర్ష, జమ్మీ సహా పలువురు కీలక పాత్రల్లో కనిపించారు. గోపీ సుందర్ దీనికి సంగీతాన్ని అందించాడు.

నరేష్ మూవీ బిజినెస్ ఇలా
'నాంది' తర్వాత ఆ రేంజ్ హిట్ కోసం ఎదురు చూస్తోన్న అల్లరి నరేష్ నటించిన సినిమానే 'ఆ ఒక్కటీ అడక్కు'. దీంతో ఈ చిత్రం ఆరంభంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఫలితంగా అంచనాలను భారీ స్థాయిలో ఏర్పరచుకుంది. తద్వా మంచి డిమాండ్‌ను పెంచుకుని ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ. 4.00 కోట్లు వరకూ థియేట్రికల్ బిజినెస్ చేసుకుని గ్రాండ్‌గా విడుదలైంది.
7వ రోజు ఎంత వచ్చింది?
సీరియస్ సినిమాలతో ఫలితం లేకపోవడంతో మరోసారి తనకు కలిసొచ్చిన కామెడీ జోనర్‌లో అల్లరి నరేష్ చేసిన సినిమానే 'ఆ ఒక్కటీ అడక్కు'. దీనికి మొదటి వీకెండ్‌లో మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ, వర్కింగ్ డేస్‌లో డౌన్ అవుతూనే ఉంది. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో 7వ రోజైన గురువారం ఈ చిత్రం రూ. 9 లక్షలు షేర్‌తో పాటు రూ. 15 లక్షలు గ్రాస్‌ను వసూలు చేసింది.

7 రోజులకూ కలిపి ఎంత?
అల్లరి నరేష్ హీరోగా, మల్లి అంకం దర్శకత్వంలో వచ్చిన 'ఆ ఒక్కటీ అడక్కు' మూవీకి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ రావడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 7 రోజుల్లో అనుకున్న దానికంటే తక్కువ స్పందనే లభించింది. ఫలితంగా ఈ సినిమాకు నైజాంలో రూ. 1.00 కోటి, ఆంధ్రాలో రూ. 1.26 కోట్లతో కలుపుకుని రెండు రాష్ట్రాల్లో రూ. 2.26 కోట్లు షేర్, రూ. 4.80 కోట్లు గ్రాస్ వచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంత?
అల్లరి నరేష్ - ఫరియా అబ్దుల్లా జోడీగా నటించిన 'ఆ ఒక్కటీ అడక్కు' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో ఏడు రోజుల్లో రూ. 2.26 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిపి రూ. 34 లక్షలు మాత్రమే వసూలు చేసింది. వీటితో కలిపి 7 రోజుల్లో ఈ చిత్రానికి రూ. 2.60 కోట్లు షేర్‌తో పాటు రూ. 5.85 కోట్లు గ్రాస్ వచ్చింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?
నవ్వించే కథతో రూపొందిన 'ఆ ఒక్కటీ అడక్కు' సినిమాకు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 4.00 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 4.50 కోట్లుగా నమోదైంది. ఇక, 7 రోజుల్లో నరేష్ సినిమాకు రూ. 2.60 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 1.90 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్‌గా నిలుస్తుంది.


Click it and Unblock the Notifications











